డైలీ సీరియల్

కొత్త స్నేహితులు 12

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భోజనాలయ్యాక అది నిజమో కాదో తెల్సుకుందుకు తన చేతిని గిల్లుకోబోయిన అతణ్ణి వారించి, తన మొహాన్నతడి దగ్గరగా చేర్చి, ‘‘ఇది కల కాదు నిజమే! అనుమానంగా వుంటే నా బుగ్గ గిల్లి చూసుకోండి’’ అంటూ అతడికి మరింత దగ్గరగా జరిగింది సామ్రాజ్ఞి.
అసహజంగా వున్న సామ్రాజ్ఞి ప్రవర్తనకు కారణం అతడి ఆలోచనకు అందడంలేదు. ఆమె గతంలో తనతో ఉన్నట్టుగానే తాను కూడా ఆమెతో ఇహనుంచీ అంటీ ముట్టనట్టుగా ఉందామని నిర్ణయించుకున్న తర్వాత ఆమెలో ఈ మార్పు రావడం కాకతాళీయమా? లేక దీని వెనుక ఏదైనా కారణముందా? అని తర్జన భర్జన పడసాగాడు సామ్రాట్.
తన మాటలకు స్పందించకుండా తిరిగి అతడాలోచనలో పడడం చూసి అంది సామ్రాజ్ఞి ‘‘ఏదో విషయం గురించి దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నారు. నేనేమైనా తప్పుగా మాట్లాడానా?!’’ గోముగా చూస్తూ.
తనేం మాట్లాడినా విరుచుకుపడిపోతూ పెడసరంగా మాట్లాడే సామ్రాజ్ఞి ఆ రోజలా ఎందుకు ప్రవర్తిస్తోందో అతడి ఊహకు అందలేదు.
‘‘అబ్బే.. అటువంటిదేం లేదు. ఉన్నట్టుండి నా మీద ఇంత ప్రేమ ఎలా పుట్టుకొచ్చిందా? అని ఆలోచిస్తున్నాను’’ అన్నాడు సామ్రాట్.
‘‘ఇది ప్రేమ కాదండీ.. మీ పట్ల నా బాధ్యత. ఇంతకాలం మీరు నా పట్ల చూపిస్తూ వస్తోన్న ప్రేమకు నా ప్రతిస్పందన మీకూ చూపించాలనే ఉంది నాకు. అందుకు ఇంకో గంట ఆగాలి మరి!’’ అంది సామ్రాజ్ఞి.
‘‘గంట గడువెందుకూ? అదేదో ఇప్పుడే, ఇక్కడే చూపించొచ్చుగా!’’ అన్నాడు సామ్రాట్ ఒంట్లోని రక్తం మొహంలోకి తన్నుకురాగా.
తను సరైన దారిలోనే వెళుతున్నాననే విషయాన్ని రంగు మారిన అతడి మొహం చెప్పకనే చెప్పింది సామ్రాజ్ఞికి.
‘‘కొంచెం సేపు ఓపిక పట్టండి. ఈలోగా స్నానం చేసి వస్తాను’’ అంటూ నడకలో హొయలొలికిస్తూ స్నానాల గది వైపు నడిచింది సామ్రాజ్ఞి.
తర్వాత ఊరంతా మాటు మణిగిన వేళ, ‘శయనేషు రంభా’ అంటే ఏవిటో పెళ్లయిన తర్వాత సామ్రాట్‌కు తొలిసారి తెలిసొచ్చేటట్టుగా ప్రవర్తించింది సామ్రాజ్ఞి.
పడకగదిలో తను రంభననే భావాన్ని సామ్రాట్‌కు పూర్తిగా కలిగించాననే నమ్మకం కుదిరాక ఇంకా పరవశంతో అరమోడ్పు కళ్లతో మేఘాల్లో విహరిస్తోన్న సామ్రాట్‌కు దగ్గరగా జరిగి, ‘‘ఆఫీస్ టూర్ బాగా జరిగిందా?’’ అంది సామ్రాజ్ఞి.
‘‘ఊ..’’ అన్నాడు సామ్రాట్ ఇంకా మత్తుగానే.
‘‘వెళ్లిన పని పూర్తయిందా?’’
‘‘ఊ...’’
‘‘మరెందుకలా దిగులుగా ఉన్నారు ఇంటికొచ్చాక..’’ అందామె అసలు విషయానికి వస్తూ.
‘‘దిగులా.. దిగులేం లేదే! నేను మామూలుగానే ఉన్నాను. నువ్వలా ఎందుకనుకుంటున్నావో నాకర్థం కావడంలేదు’’ అన్నాడు సామ్రాట్.
‘‘ఉహూ.. ఎప్పుడిలా నన్ను పలకరించకుండా మీ మానాన మీరు ఎవరో పరాయి వ్యక్తిలా ప్రవర్తిస్తున్నారివాళ’’ అంది సామ్రాజ్ఞి బుంగమూతి పెడుతూ.
‘‘ఊ...’’
‘‘ఏవిటివ్వాళ.. ఊ.. ఆ.. అని తప్ప అంతకంటే నాతో ఎక్కువగా మాట్లాడకూడదని ఎవరికైనా మాట ఇచ్చారా?’’
‘‘ఉహూ..’’
‘‘మరైతే ఇవ్వాళ ఎందుకలా ఉన్నారు?!’’ సహనాన్ని ఎరువు తెచ్చుకుంటూ అంది సామ్రాజ్ఞి.
తను ఏదో ఒక సమాధానం చెప్పకపోతే ఆమె వాక్ప్రవాహం అలానే కొనసాగుతుందనిపించి, ‘‘ఏం లేదు సామూ. మన పెళ్లయిన నాటినుంచీ కొద్దిగంటల క్రితంవరకూ నువ్వు నాతో అంటీ ముట్టనట్టే ఉన్నావు కదా! అందుకే నేనూ నీలానే ఉంటే నీకు నచ్చుతుందేమోనని అలా ఉందామని ప్రయత్నించానంతే! ఈరోజున్నట్టే ఎప్పుడూ నువ్వుంటే నేనూ మామూలుగానే ఉంటాను. సరేనా?’’ అన్నాడు సామ్రాట్.
‘‘ఉహూ.. మీరు నిజం చెప్పటంలేదు. మీరు టూర్‌లో వున్న ఈ నాల్రోజుల్లోనూ ఏదో జరిగింది. మీకు కొత్తవాళ్లెవరైనా పరిచయమైనా అయి ఉండాలి. లేదూ మీ పరిచయస్తుల్లో మీకు సంసార విషయాల్లో ఏవైనా అమూల్యమైన సలహాలైనా ఇచ్చుండాలి. అంతేనా?’’ అంది సామ్రాజ్ఞి బెడ్‌లాంప్ వెలుతుర్లో అతడి ముఖ కవళికల్లో తానాశించిన మార్పులేవైనా కనిపిస్తాయేమోనని నిశితంగా గమనిస్తూ.
‘‘ఉహూ.. అటువంటిదేం లేదు సామూ.. అయినా నువ్వు నాతో ఇప్పటిలా ప్రేమగా ఉంటూ ఇష్టంగా నడుచుకున్నంతకాలం నాకు వేరే సలహాలూ, స్నేహమూ ఎందుకు చెప్పు?’’ అన్నాడు సామ్రాట్.
సామ్రాజ్ఞి అతడి మాటల్ని నమ్మలేదు. తననుంచి అతడేదో దాస్తున్నాడనే అనుమానం మాత్రం ఆమె మనసులోంచి తొలగిపోలేదు.
4
‘‘ఊ.. చెప్పండి’’ అది సాహిత్య.
‘‘చిన్నప్పటినుంచి సాహిత్యమంటే నాకెంతో ఇష్టం. చందమామలతో ప్రారంభించి అపరాధ పరిశోధన నవలలు ఇష్టంతో చదవడంతోపాటు అన్ని రకాల సాహిత్య ప్రక్రియల పట్లా ఇష్టం పెంచుకున్నాను నేను. ఇప్పుడు కూడా రోజూ ఎంతో కొంత చదవకపోతే ఏదో కోల్పోయినట్టనిపిస్తుందారోజు నాకు’’ అన్నాడు సామ్రాట్. ‘‘ఈ విషయంలో నేనూ మీలాంటిదానే్న! మా ఊళ్లో మేం ఉండే వీధిలోనే గ్రంథాలయం ఉండేది. నేను హైస్కూలు చదువు మధ్యలో కొచ్చేసరికి ఆ గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలనన్నింటినీ చదివేశాను. నేను చదివేందుకు ఇహ ఆ లైబ్రరీలో పుస్తకాలేవీ మిగలకపోవడంతో నాకంటే ఆ లైబ్రేరియన్ ఎక్కువగా నొచ్చుకునేవాడు. ‘ఏవైనా కొత్త పుస్తకాలొచ్చాయా?’ అని నేనడిగిన ప్రతిసారీ!’’ అని నవ్వింది సాహిత్య.
ఆ శీతాకాలపు సాయం సమయాన జనం ఆట్టే లేని ఆ పార్కులో ఎదురెదురుగా కూర్చుని మాట్లాడుకుంటోన్న వారి వద్దకు ఒక కుర్రాడొచ్చాడు.
అతడి భుజాన్న ఓ సంచీ వ్రేలాడుతోంది. అతడి చేతిలో రెండు కాగితం పొట్లాలున్నాయి.

-ఇంకాఉంది

సీతాసత్య