డైలీ సీరియల్

ఎండిపోతున్న కాశ్మీరీ చినారులు 51

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్మీ జమీల్ ఇంటికి వచ్చి వెళ్లినప్పటినుండి ఆ ఇంటి వాళ్ల జీవితాలు నరకం అయ్యాయి. క్షణం క్షణం చస్తూ జీవచ్ఛవాల్లా బతుకుతున్నారు వాళ్లు.. నడుస్తున్న శవాలు వాళ్లు. అసలు ఈ ఇంట్లో ఎప్పుడూ సంతోష ఆహ్లాదాలు లేనే లేవని చెప్పాలి. కాని కొంత శాంతి ఉండేది కాని ఇప్పుడు ఆ శాంతి కూడా గూడును వదిలేసి వెళ్లిపోయింది. ఇప్పుడు ఆ గూట్లో అంతా చిమ్మచీకటే.. అక్కడ జీవితపు చేదును రుచి చూస్తున్న నలుగురు వ్యక్తులు ఉన్నారు. తన ఇష్టం వచ్చినప్పుడు సందీప్ తన సిబ్బందితో ఆ గూటికి వస్తాడు. అతడి వెంట వచ్చిన సిపాయిలు ఆ ఇంటి వాళ్లని బెదిరిస్తారు. జమీల్ తమ్ముడిని తమ ఉక్కులాంటి చేతులతో చెంపదెబ్బలు కొడతారు. పెద్దగా అరుస్తూ అడుగుతారు. ‘వన్ భై కైటి భురుూ జమీల్’ (జమీల్ ఎక్కడున్నాడో చెప్పు) జమీల్ తమ్ముడు వెక్కి వెక్కి ఏడుస్తూ కింద పడ్డాడు. అరుస్తూనే ఉన్నాడు కాని జమీల్ గురించి ఒక్క మాట చెప్పడు. అతడి తల్లి ప్రేతవస్త్రంలా కప్పబడిన తన చినిగిన బురఖాలో బయటికి వచ్చింది. గుండెలు బాదుకుంటూ ఏడ్చింది. పెడబొబ్బలు పెట్టింది. పిల్లలను తన ప్రేత వస్త్రం బురఖాలో లాక్కుంది. ఆమెకు చేతనయితే నిజానికి కంగారు మృగంలా ఇద్దరి పిల్లలను తన సంచీలో దాచుకునేది ఈ ఆర్మీ వాళ్లనుండి, జిహాదీల నుండి రక్షిస్తూ.
ఆర్మీ వాళ్లు ఏ ఇంటికి వెళ్ళినా, జిహాదీల గురించి విచారణ జరిపినా ఫరవాలేదు. కాని పోలీసులు ఈ విషయంలో ఎంటర్ అయ్యారు అంటే ఇక ఆ ఇంటివాళ్లకు నరకయాతన తప్పదు. జమీల్ ఇంట్లో ఆర్మీ వాళ్లు తమదైన విధానంతో సత్యాలను వెళ్లగక్కించడానికి ప్రయత్నం చేశారు. ఎంతైనా సైనికులు నీతి నియమాలకు కట్టుబడి ఉంటారు. జమీల్ కేసులో ఆర్మీ పోలీసుల జాయింట్ ఎడ్వంచర్ మొదలయింది. ఆర్మీ వాళ్లు పోలీసు డిపార్టుమెంట్ వాళ్లని తమ వెంట తీసుకువెళ్తారు. ఎవరూ వాళ్లని కోర్టుకి ఈడ్వడానికి అవకాశం ఉండదు.
పోలీసుల విధానం వేరు. వాళ్ల భాష వేరు. వాళ్ల ప్రవర్తన వేరు. పోలీసులు జమీల్ ఇంటివాళ్ల ఒక వీక్ లింక్‌ను కనిపెట్టారు. రుబీనా వనం, జవీల్ తమ్ముడు హమీద్‌కున్న వెన్నలాంటి మనస్సు.
ఇక ఇప్పుడు పోలీసులు వాళ్లకి నానా విధాలుగా టార్చర్ పెట్టడం మొదలుపెట్టారు. హింసించి క్రూరత్వాన్ని చూపిస్తే ఎటువంటివాడి నోటినుండైనా సత్యం చెప్పించవచ్చని వాళ్ళకి గట్టి నమ్మకం. పోలీసులు వారానికి ఒక్కసారి హమీద్‌ని పోలీసు స్టేషన్‌కి పిలిపి చచ్చేట్టు కొడుతున్నారు. వాడి శరీరం మీద కొట్టిన దెబ్బలు గుర్తులు ఉండకూడదని గొంగళి కప్పి మరీ కొడుతున్నారు.
హ్యూమన్ రైట్స్ వాళ్లు ఈ విషయంలో జోక్యం చేసుకోకూడదన్న ఉద్దేశ్యంతో వాళ్లకి ఇట్లా చేయడం అలవాటే. అసలే వాడు గర్భ దరిద్రుడు. పరపతి లేదు. ఎదిరించలేడు. హమీద్ తన్నులు తినేవాడు కాని ఏ మాత్రం నోరు విప్పేవాడు కాదు. పోలీసుల కోపం ఇంకా తీవ్రమయింది. ఇంటిమీద పడ్డారు. అక్కడే అడ్డా వేసుకుని కూర్చున్నారు. సిగరెట్టు పొగను గాలిలో వదుల్తూ రుబీనా వంక గుచ్చి గుచ్చి చూసారు. ఆ అమ్మాయితో వేళాకోళం చేస్తూ బూతులు మాట్లాడారు. వికారపు సైగలు చేశారు. జమీల్ తండ్రి పోలీసులు తిట్టే బూతులు విని తలకొట్టుకున్నాడు. ఏడ్చాడు.
పోలీసులు జమీల్ తల్లిని బెదిరిస్తూ అన్నారు-
‘‘నీ కొడుకు, కూతురు బాగుండాలంటే మాకు జమీల్ ఆచూకీ తెలుపు. ఎక్కడ ఉన్నాడో, ఎప్పుడు వస్తున్నాడో చెప్పు’’. జమీల్ తల్లి మట్టి ముద్దలా ఒక మూల పడి ఉంటోంది. బెదురు చూపులతో గోడల వంక చూస్తూ ఉంటోంది.
పోలీసులు జమీల్ కుటుంబం వారిని భయపెడుతున్నారు. బాధపెడుతూనే ఉన్నారు. రోజు రోజుకీ హింస ఎక్కువ కాసాగింది. చిమ్మ చీకటి- అమావాస్య రాత్రిలా వాళ్ల క్రూరత్వం పెరుగుతూనే ఉంది.
ఒక్కసారిగా ఉగ్రవాదుల ఉపద్రవాలు ఎక్కువ అయ్యాయి. రాజౌరీలో అయిన ఒక ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మేజర్లు వీరగతి పొందారు. ఒక కెప్టెన్ బాగా గాయపడ్డాడు. ఈ సంఘటన వలన సందీప్‌పైన పైఆఫీసర్ల వత్తిడి ఎక్కువ కాసాగింది.
జమీల్ విషయం తెలుసుకోవడానికి సందీప్ ఎంతగానో ప్రయత్నించాడు. పైఆఫీసర్ల వత్తిడి ఎక్కువ అవుతున్న కొద్దీ సందీప్ టీమ్ వాళ్లల్లో వున్న పశువు ఇంకా క్రూరంగా మారింది. ఆ కుటుంబాన్ని ఎంతగా టార్చర్ చేసారంటే ఇంటిల్లిపాదీ కేవలం ప్రాణాలు ఉన్న శవాల్లా మారిపోయారు. వాళ్లలో కళాకాంతులు లేవు. జీవించాలన్న ఆశ అసలే లేకుండా పోతోంది.
ఝాలమ్ నదిలో గలగలా పారుతూ ఉండే రుబీనా ఎండిపోసాగింది. ఆమె ముఖంలో ముడతలు పడ్డాయి. పోలీసులు విపరీతంగా కొట్టడంవలన హమీద్ మాటా మంతీ లేకుండా తన లోకంలో తను ఉంటున్నాడు. స్కూల్‌కి వెళ్ళడం మానేసాడు.
రెండు ముసలి గుర్రాలు టూరిస్టులను తిప్పేబదులు కట్టివేయబడ్డాయి. అబ్బూ గొంగళి కప్పుకుని తనలో తనే మాట్లాడుకుంటూ ఉంటాడు. మొత్తం ఆ ఇంటి పరిస్థితులే మారిపోయాయి.
మేజర్ సందీప్ ఆ ఇంటికి వెళ్ళినప్పుడల్లా అతడికి చనిపోయిన నాగరికత కంపును భరిస్తున్నానా అని అనిపించేది. అతడికి శ్వాస పీల్చుకోవడం కష్టంగా ఉంది. అసలు గాలి వీయడం ఆగిపోయింది. జీవితం ఒక మూల ముఖం దాచుకుని ఏడుస్తోంది. ఆ రోజు పెద్ద పరీక్షే జరిగింది.
సందీప్ అతడి టీమ్, పోలీసులు ఆ ఇంట్లోకి చొరబడగానే హమీద్ వణకడం మొదలుపెట్టాడు.సందీప్ పైకి ఉక్కుమనిషిలా ఉన్నా లోపల అతడి మనస్సు ఎంతో బాధపడ్డది.

- ఇంకాఉంది

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత