డైలీ సీరియల్

ఎండిపోతున్న కాశ్మీరీ చినారులు 62

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమ్ముడూ! ఇది అబద్ధాలతో నిండిన లోకంరా! ఇక్కడ చీకటి తల ఎత్తుకుని తిరుగుతోంది. వెలుగు ఆత్మహత్య చేసుకోవడానికి వివశురాలవుతోంది. సత్యం తెలిసి కూడా చెప్పలేనివాడు ఈ లోకంలో బతకడం కష్టంరా. నేను నాపై అధికారులకు, రక్షా మంత్రాలయానికి, రాష్టప్రతికి నా రజిగ్నేషన్ స్వీకరించమని ప్రార్థిస్తూ రాశాను. ఆర్మీలో చేరినపుడు చేసిన ఎగ్రిమెంటు ప్రకారం 20 సంవత్సరాలలు పని చేయాలి. అంతకుముందు ఆర్మీ నుండి బయటపడే వీలు లేదు.
నేను ఈ వ్యవస్థ నాతో ఏవేవి జరిపించాలనుకున్నదో వాటన్నింటిని చేశాను. ఈరోజు నేను పూర్తిగా చావను చావలేను. ఆనందంగా బతకనూ బతకలేను. ఒక సైనికుడికి మన దేశం ఇచ్చే గౌరవం ఇదేనా! అరచేతులలో ప్రాణాలను పెట్టుకుని దేశం కోసం సరిహద్దులను రక్షించే సైనికుడికా ఈ గౌరవం? కొన్ని దేశాలలో తమ వీర సైనికుల బొమ్మలను తయారుచేస్తారు. కామిక్స్ కూడా ప్రచురిస్తారు. పిల్లల మనస్సులలో సైన్యం పట్ల గౌరవ భావం పెరగాలన్న ఉద్దేశ్యంతో వీటిని తయారుచేస్తారు. సైన్యంలో చేరాలన్న కోరిక కలగాలన్న ఉద్దేశ్యంతో కూడా చేస్తారు. కాని మన దేశంలో యువతరానికి వీర సైనికుల పేర్లు కూడా తెలియదు.
ఆర్మీకూడా ఈ సమాజంలోని భాగమేగా. నేను ఎన్నోసార్లు మనుష్యుల విధిరాతలకు ఫిలాసఫీ జోడించి నాకు నేను నచ్చచెప్పుకునే ప్రయత్నం చేస్తాను. అసలు ఏ మనిషి జీవితం ఎప్పుడు సంపూర్ణం కాదని అంతరంగంలో ఎప్పుడు ఏదో ఒక మూల ఖాళీగా ఉంటుందనే అనుకుంటూ ఉంటాను. మహాభారత యుద్ధం తరువాత విజేతలు కూడా సంతోషంతో ఉప్పొంగిపోలేదు. నిజానికి ఈ యుద్ధం జరగకుండా ఉండాల్సింది. ఈ కుట్రలు- కుతంత్రాలు జరగకుండా ఉండాల్సింది అని అనుకునే ఉంటారు.
కాని నన్ను నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. భవిష్యత్తులో నేనెట్లా జీవించగలుగుతాను? నా మానవత్వాన్ని మంటకలిపిననాడు నేను మళ్లీ జీవించకలనేమో. కాని మానవత్వం లేని మనిషిగా జీవించడం అంటే నేను మనిషిని కాదు అని చెప్పడమే. ఉఫ్.. అసలు నేను ఆర్మీలో జాయిన్ అయింది- శాంతి, ప్రేమ, కరుణ, మానవత్వం- వీటి అర్థాలను తెలుసుకోవాలనే కదా!
నేనేం చెయ్యను?
అసలు నేను ఏమీ చేయలేకపోతున్నాను. ప్రశ్నల మధ్య చిక్కుకుపోతున్నానే తప్ప ఎన్నో ఎనె్నన్నో కలలు పండించుకోవాల్సిన ఈ జీవితం కుర్చీపై కూర్చున్న కొందరి స్వార్థానికి బలైపోతోంది. నిజానికి ఈ బతుకు ఇసుక కోటల్లా కూలిపోతోంది. ఏం? ఎందుకని?
అసలు నేను చేసిన అపరాధం ఏమిటి?
నేను ఏం కోరుకున్నాను? మంచి లక్ష్యాలకోసం నా జీవితం సమర్పించుకోవాలనేగా నేను కోరుకున్నది? ఈనాడు నేను కోరుకునేది ఒక్కటే ఒక్కటి- మనిషిగా బతకాలి. సౌందర్యం, మానవత్వం అనే దారం నా చేతుల్లోంచి జారిపోకూడదు. నాలో సుప్తంగా వున్న సంవేదనలను రుబీనా పట్ల ప్రేమ, కర్తవ్య భావాలు తట్టిలేపాయి. అసలు హింస అనే వర్షంలో నేను ఎంతగా తడిసి మోపెడంత అయ్యానంటే ఇప్పుడు నా అడుగులు కూడా ముందుకు పడటంలేదు. అందుకే నాకు విముక్తి కావాలి.
తమ్ముడూ! నా జీవితంలో నేను ఆమెతో కేవలం ఆరుసార్లు కలిసినా మాది జన్మ జన్మల బంధం అని అనిపిస్తుంది. శ్రీనగర్‌లోని గుడ్‌గాంవ్ పోస్టింగులో ఐదుసార్లు కలిశాను. ఆరోసారి చండీగడ్ పోస్టింగప్పుడు కలిసాను. కాని మా సంబంధంలో ఉన్న విశేషం ఏమిటంటే వౌనంలోనే ఈ సంబంధం పెరిగింది.
వాళ్ల కుటుంబం నాశనం కావడానికి నేనెంత మాత్రం కారణం కాదని అందువలన ననే్నమాత్రం బాధపడవద్దని పదే పదే నాకు చెబుతునే ఉంది. జమీల్‌ని చంపి నేను సైనికుడి ఉద్దేశ్యాన్ని, కర్తవ్యాన్ని పూర్తిచేశాను.
నీకు నా వర్తమాన జీవితం గురించి తెలిసి ఉంటే.. నేను ఎంతగా బాధపడుతున్నానో నీకు తెలిసేది.
ఎవరో కవి అన్నాడు- ఒక్క పూవును రక్షించడానికి యుద్ధం చేస్తున్నాను. నేనూ ఇదేగా చేస్తున్నది.
ఒక పూవును రక్షించాలనే ప్రయత్నం.
నేను ఏ మువ్వనె్నల జెండా గౌరవాన్ని కాపాడాలని, ఏ జెండా కోసం ప్రాణాలు సైతం అర్పించదలచుకుని సైన్యంలో చేరానో ఈనాడు నాగాలాండ్, అస్సాం, కాశ్మీర్‌దాకా.. ఆ భారతీయ జెండాని రక్షించడం ఎంతో కష్టమైపోతోంది. నాగాలాండ్‌లో భారతీయ సైన్యం ఉంది. భారతదేశం నుండి విడిపోవాలనుకుంటున్న ఉగ్రవాదులు ఒక లక్షకిపైగా భారతీయులను చంపేశారు కాని ఏమైంది?

- ఇంకాఉంది

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత