డైలీ సీరియల్

ఎండిపోతున్న కాశ్మీరీ చినారులు.. 65

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగడ్
వెనక్కివచ్చినా ఎందుకో తను అక్కడే అన్నీ వదిలేసి వచ్చాడు అని సందీప్‌కి అనిపించలేదు. తన ఆత్మలోని ఒక అంశం తమ్ముడి దగ్గర వదిలేసి వచ్చాడా అని అనిపించింది. పనిలో ఎంత నిమగ్నుడైనా మానసిక పటలం పైన ఉదాశీనంతోనిండిన సీమ కళ్ళు మాటిమాటికి కనిపిస్తూనే ఉన్నాయి. సందీప్ లాప్‌టాప్‌ను వదిలేసి లేచాడు. అతీతం అతని కళ్లల్లో కనిపిస్తోంది.
ఉఫ్! అసలు ఈమె ఆ సీమేనా! ఎప్పుడు నవ్వుతూ తుళ్లుతూండే సీమేనా! పక్షిలా కలకలారావం చేసే సీమేనా! కొండలపైనుండి దూకే సెలయేరులా ప్రవహించే సీమేనా! ఆ సీమే ఈ రోజు రెక్కలు తెగిన పక్షిలా పడి ఉంది. ఎందుకిట్లా జరిగింది? అసలు ఈ షాక్ నుండి బయటపడకలదా? ఇదివరకు ముంబయిలో ఉన్నప్పుడు సీమని ఒక చోట కూర్చుని ఉన్నట్టుగా ఎప్పుడు చూడలేదు.
ఎందుకిట్లా అయింది? వాళ్లిద్దరు జీవించలేదు, బహుశా జీవితాన్ని వేగంగా మింగేస్తున్నారనా? జీవనగతి ఎంత వేగంగా ఉండేదో అంత తీవ్రంగానూ దానికి ఒక్కసారిగా బ్రేక్ పడ్డది.
లోపం ఎక్కడుంది? ఏం పొరపాటు జరిగింది?
సిద్ధార్థ, సీమ, శేఖర్‌బాబు!
ప్రతి ఒక్కరు ఇదే ప్రశ్న వేస్తున్నారు.
సందీప్ ఏమని జవాబిస్తాడు? అసలు అతడి జీవితం కూడా అతడిని ప్రశ్నిస్తోంది, ఏం పొరపాటు చేశానని?
రాత్రనక పగలనక సిద్ధార్థ చదువుతూనే ఉండేవాడు. పరీక్షల ప్రిపరేషన్‌లో గానుగెద్దులాగా నిద్రాహారాలు మాని చదువుతూనే ఉండేవాడు. పరీక్ష పాస్ అయ్యేవాడు. ఎప్పుడు ముందంజ వేసేవాడు. దేశానికి క్రిమీలేయర్. అన్నింటికన్నా పెద్దదైన కార్పొరేట్ కంపెనీలో సేల్స్ టార్గెట్ పూర్తిచేయడానికి రాత్రింబవళ్లు పనిచేస్తూనే ఉంటాడు.
సీమ పరిస్థితి కూడా దాదాపు ఇంతే. వారంలో ఐదు రోజులు కంపెనీ పనే. కంపెనీ లాభాలు ఎట్లా పెంచాలా? ఈ ఆలోచన తప్పితే మరో ఆలోచన లేదు. పైపొజిషన్‌కి వెళ్లాలి. ప్రమోషన్ రాలేదనే కోపం. దేశంలోని క్రిమిలేయర్ సంపాదన రాజుగారి సంపత్తి అంతే కాని జీవితం గాడిద జీవితం. తిండిపైన ధ్యాస ఉండదు. పగలంతా చెవుల దగ్గర మొబైల్. కళ్ల ఎదురుకుండా లాప్‌టాప్. మైండ్‌లో కంపెనీ.
ఆ రోజు తమ్ముడిని కలవాలని వెళ్లితే కనీసం అర్థగంట కూడా కూర్చోనీయలేదు. సిద్ధార్థకి ఆరోజుల్లో నడుం నొప్పి విపరీతంగా ఉండేది. బహుశా పగలంతా వంగి లాప్‌టాప్‌పైన పనిచేయడంవలన ఏమో. అసలు తమ్ముడి దగ్గర డాక్టర్ దగ్గరకి వెళ్లడానికి సమయం లేదు. పెయిన్ కిల్లర్ మందులు వేసుకోవడం, ఇంజెక్షన్ తీసుకోవడం చేసేవాడు. డాక్టర్ చేయమన్న ఏ టెస్టులు చేయించేవాడు కాదు.
నీవు ఈ గొప్ప పని కోసం రాత్రింబవళ్లు ఇంత కష్టపడుతున్నావు. ఇంతగా ఎందుకు పని చేసి అలసిపోతున్నావు? బలహీన పడిపోతున్నావు? సందీప్ తమ్ముడిని అడగాలనుకునేవాడు. కాని సిద్ధార్థ కనిపిస్తేగా! ఉరుకులు.. పరుగులు..
సీమకి కూడా అర్థం అయ్యేలా ఎవరు చెప్పగలుగుతారు? జరిగిపోయిందేదో జరిగిపోయింది. దానినే తలచుకుంటూ బాధపడితే ఏం లాభం? ఎదురుగుండా భవిష్యత్తు ఉంది. భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దుకోవచ్చు. సీమ తల్లి కాలేకపోయింది. డా మహేష్ వాడ్వానీని ఎవరైనా మరువగలరా? కనీసం వందమంది పిల్లలకు తండ్రి కావాలని అతని కోరిక.
భార్య చనిపోయిన తరువాత మహేష్‌గారు మానసికంగా కృంగిపోయాడు. అప్పుడు ఆయన వయసు 48 సంవత్సరాలు. కొంతకాలానికి తాగడానికి, జూదానికి అలవాటుపడ్డారు. ఒక రోజు కాన్పూర్ స్టేషన్‌లో నిల్చుని ఆయన పూరీ తింటున్నారు. అప్పటికే ఆయన మనఃస్థితి బాగా దిగజారిపోయింది. ఆయన తినిపడేసిన ఆకులోని ఎంగిలిని తినడం కోసం ఒక పిల్లవాడు విస్తరిని ఒక కుక్కలా లాగడం మొదలుపెట్టాడు. అంతే ఆ క్షణం ఆయన తెలుసుకున్నాడు. బతుకంటే ఏమిటో! అంతే తన జీవితాన్ని ఈ అనాథ పిల్లలకు సమర్పించుకోవాలనుకున్నాడు. ఎంతో శ్రమపడి ఉన్న డబ్బుని పెట్టుబడిగా పెట్టి ఆశ్రమాన్ని స్థాపించారు. ఆయన ఒక అడుగు ముందుకు వేసారు. నెమ్మది నెమ్మదిగా అందరి సహకారంవలన ఆశ్రమాన్ని నడపడం మొదలుపెట్టాడు. ఈనాడు దాదాపు ఇరవై రెండు మంది ఆదీవాసీ పిల్లలు అక్కడ ఉంటున్నారు. వందమంది పిల్లల తండ్రి కావాలని ఆయన కోరిక. ఇప్పటికీ ఇంకా ఆ కలే కంటున్నారు.
ఉఫ్! సీమ జీవితంలో కూడా ఇట్లాంటి మలుపు వస్తే ఎంత బాగుండును. ఏదైనా మంచి టర్నింగ్ పాయింట్.
రెండు చేతులు ఎత్తి దండం పెట్టుకుని దేవుడిని ప్రార్థించాడు.
మెల్లి మెల్లిగా అలలన్నీ సమతలంపైకి వచ్చాయి. అతడి మానసిక స్థితి మామూలుగా అయిపోయింది. కర్నల్ సందీప్ తన చేంబర్‌లో కూర్చుని ఇంపార్టెంట్ కాగితాలు చూసుకుంటున్నాడు. పోస్ట్‌మెన్ ఒక పెద్ద కవరు ఇచ్చాడు. ఒక్కసారి దానిమీద ఉన్న అడ్రస్సు చూడగానే ఆశ్చర్యపోయాడు. కిష్త్‌వాడా జైల్ నుండి ఆ ఉత్తరం వచ్చింది. గుండె దడదడలాడింది. రుబీనా రాసిన ఉత్తరం అది. ఉర్దూలో రాసిన ఉత్తరాన్ని అనువాదం చేయించడానికి అనువాదకుడిని వెతకడంలో కొన్ని గంటలు పట్టింది. అతడి మనస్సు బరువెక్కింది.

- ఇంకాఉంది

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత