డైలీ సీరియల్

యాజ్ఞసేని..45

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీష్ముడు, శ్రీకృష్ణుడు, ద్రోణుడు, కృపుడు, ధౌమ్యుడు, వ్యాసమహర్షి, బాహ్లికుడు, సోమదత్తుడు, చతుర్వేద విశారుదులైన బ్రాహ్మణులను ముందుంచి యధావిధిగా, శాస్త్రోక్తంగా భద్రపీఠంపై నిగ్రహంతో వున్న ధర్మరాజును అభిషేకించారు.
‘‘రాజా! నీవు ఈ సమస్త భూమినీ జయించి నీ అధీనం క్రింద వుంచి రాజసూయ యాగాలు భూరి దక్షణలిచ్చి నిర్వహించి అవభృధస్నానం చేసి బంధు మిత్రులతో సుఖంగా యుండుము అని ఆశీర్వదించారు.
అందరూ జయజయద్వనులు చేశారు. రాజులందరూ యుధిష్ఠిరుని అభినందించారు.
ఏనుగును అధిరోహించిన యుధిష్ఠిరుడు హస్తినాపురానికి ప్రదక్షిణలు జేసి నాగరికుల అనుసరణతో పురప్రవేశం చేశాడు.
అయితే గాంధారిదేవి పుత్రులైన దుర్యోధనాదులు ఈ పట్ట్భాషేక వైభవాన్ని చూచి ఈర్ష్యతో కలత చెంది దుఃఖితులైనారు. ఇది తెలిసిన దృతరాష్ట్రుడు శ్రీకృష్ణునితో, కౌరవుల సమక్షంలో ధర్మరాజుతో
‘‘యుధిష్ఠిరా! నీవు పొందిన ఈ పట్ట్భాషేకం అజితాత్ములైన పురుషులకు అసాధ్యం. రాజా! నీవు పూర్వుల రాజ్యాన్ని పొంది కృతార్థుడవయ్యావు. నేడే నీవు సోదరులతో సహా ఖండవప్రస్థానికి పోయి నివసించుము. అది పూర్వం ‘పౌరవుల’ రాజధాని నగరం. ఖండవప్రస్థాన్ని ‘బుధపుత్రుని’ కారణంగా ఋషులు నాశనం చేశారు. నీవు మరలా దానిని వృద్ధి చేయుము. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు ఇతరులు నీమీద భక్తితో నిన్ను అనుసరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ నగరము ధన ధాన్య సమృద్ధి కలది. తమ్ములతో బయలుదేరుము’’ అని అన్నాడు.
పాండవులు ధృతరాష్ట్రుని ఆజ్ఞతో ఖండవప్రస్థానికి బయలుదేర సంసిద్ధులైనారు. రథాలు సిద్ధం చేయబడ్డాయి. ఏనుగులు, గుఱ్ఱాలు, కొంత కాల్బలము సిద్ధం చేశారు. ఖాండవప్రస్థంలో వుంటానికి కావలసిన సదుపాయాలకు తగిన వస్తు సేకరణ జరిగింది. వివిధ వృత్తులవారు తమ తమ కుటుంబాలతో బయలుదేరారు.

25
పాండవులు ఖాండవప్రస్థానికి బయలుదేరనున్నారన్న విషయం గాంధారీకి తెలిసింది.
కుంతీదేవి, ద్రౌపది కూడా గాంధారి అనుజ్ఞ పొందాలని సంకల్పించారు.
ఇంతలో దుర్యోధనుని భార్య అయిన భానుమతి అత్తగారి ఆజ్ఞతో ద్రౌపదిని చూడవచ్చింది.
‘‘చెల్లీ! ద్రుపద రాజపుత్రీ! ఇన్నిరోజులు మా సరసన హస్తినాపురంలో సుఖంగా ఉన్నావు. ఇకముందు ఖాండవప్రస్థంలో వుండవలసి వస్తుంది గదా! నీవు భర్తలతో కలిసి బయలుదేరనున్నావని గాంధారీదేవికి తెలిసికొన్నది. ఆమె పంపున నేను నిన్ను ఆమె వద్దకు కొనిపోవవచ్చాను. వేగమే మహారాణి దర్శనార్థం రావలసినదిగా కోరుచున్నాను’’ అని అన్నది.
ద్రౌపది అత్త కుంతీదేవి అనుమతితో భానుమతితో కలిసి గాంధారిని చూడవచ్చింది.
గాంధారిని చూచి ‘‘మహారాణీ! నేను ద్రౌపదిని, నమస్కరించుచున్నాను’’ అని అన్నది.
‘దీర్ఘసుమంగళీభవ!’ అని గాంధారి ద్రౌపదిని ఆశీర్వదించింది. చేరదీసి తన పక్కన కూర్చుండబెట్టుకుంది. భానుమతి నిష్క్రమించింది. అంత గాంధారి-
‘‘అమ్మా! యాజ్ఞసేని! నీతో ఒక విషయం చెప్పదలిచాను శ్రద్ధగా ఆలోకించుము. నీవు అతిలోక సౌందర్యవతివని అందరూ అంటుండగా వింటున్నాను. అది సరే. మహారాజు ధృతరాష్ట్రులవారు పాండవులకు అర్థరాజ్యంగా ఖండవప్రస్థాన్ని ఇచ్చినారు.
పాండవులు అచ్చోట రాజస్థాపన చేసికొని రాజ్యాన్ని పాలించవలసి వున్నది. నా పుత్రులు దుర్యోధనాదులు పాండవులంత ధర్మనిరతులు కారు. గర్వితులు. అహంకారులు. ఎవరి మాటలను లెక్కచేయరు. వారివలన పాండవులకు హాని జరుగకూడదనే ఉద్దేశ్యంతో మహారాజు ఇలా నిర్ణయించారు. అయినా నా పుత్రులు ఏదో ఒక నెపంతో పాండవులను బాధపెట్ట చూస్తుంటారు. ఏ రోజు ఏ ఉపద్రవం వాటిల్లుతుందోనని నేను ఎల్లప్పుడూ భయపడుతూ వుంటాను.

- ఇంకావుంది

త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము