డైలీ సీరియల్

బంగారుకల- 27

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇక్కడ రంగస్థలాలపై చాలాసేపు నృత్య ప్రదర్శనలు జరుగుతూనే ఉన్నాయి. నవరాత్రులు తొమ్మిది రోజులు ఇదేవిధమైన కార్యక్రమం ఏర్పాటుచేయబడింది.
సాయంత్రంవేళ అవుతున్న మార్తాండుడు ప్రతాపం చాలించి లోకం మీద తన వేడి కిరణాలను ఉపసంహరించుకొని పశ్చిమాద్రికి ప్రయాణమవుతున్నాడు.
ప్రజలు, ఉద్యోగులు అతిథులు అంతా విజయ భవన ప్రాంగణానికి విచ్చేశారు. మల్లురు, జెట్టీలు, నృత్యగాన కళాకారులు అలంకృత అశ్వాలతో ఊరేగింపుగా బయలుదేరారు. బ్రాహ్మణులు, రాకుమారులు, రాజబంధువులు, వారి వారి మిత్రులు, పరివారం మహారాజుని అనుసరించారు.
ఈ ఉత్సవాల విషయంలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ అడుగడుగునా శక్తివంతమైన గూఢచారి వ్యవస్థతో మహామంత్రి తిమ్మరుసే స్వయంగా పర్యవేక్షిస్తూ తగు సూచనలు, ఆజ్ఞలు ఇస్తున్నారు.
మహారాజు విజయ భవన వేదికపై సింహాసనాన్ని అధిరోహించారు. ప్రజలు అధికార గణం లేచి నిలుచుండి విజయాభివందనం చేశారు.
కొందరు ఆప్తులు మహారాజు దగ్గరగా కూర్చున్నారు. దేవేరులు మహారాజు సమీపంలో తెరల మాటున వీక్షిస్తున్నారు. తాంబూల సేవనం మహారాజు సమక్షంలో నిషిద్ధమని అందరికీ తెలుసు కాబట్టి ఎవ్వరూ ఆ పని చేయటంలేదు.
అప్పటిదాకా బయట నిరీక్షిస్తున్న సేనాధికారులు ఒక్కొక్కరు వరుసలో వచ్చి రాజుకు జోహారులు సమర్పించి మండపంలో తమ తమ స్థానాలలో కూర్చున్నారు. అనంతరం నృత్య ప్రదర్శన జరిగింది.
నాడు మంజరి చేసిన ‘నవమోహిని’ నృత్యం సరికొత్త భావానుభూతిని మిగిల్చింది. క్షీరసాగర మథనంలో హాలాహలాన్ని పరమ శివుడు భరించాడు.
తర్వాత పుట్టిన అమృతాన్ని దేవదానవులకు పంచే విధానంలో శ్రీమహావిష్ణువు మోహినీ రూపంలో అవతరించి దానవులను సమ్మోహనపరిచిన విధానాన్ని మంజరి అభినయ నర్తనంగా అందించిన ప్రావీణ్యతకు కళాహృదయాలన్నీ పులకించాయి.
మంజరి నవమోహినీ రూపం చంద్రప్ప మనసులో గిలిగింతలు పెట్టింది. ఈ దసరా నవరాత్రులయిన నెలకు ఆ ఇద్దరికీ పరిణయం జరుగనుంది. ఆ తలపే చంద్రప్పను వివశుడ్ని చేస్తున్నది.
‘‘బాగు బాగు’’ ఆ కర్కోటక స్వరం వీరేంద్రునిదే.
చంద్రప్ప తీక్షణంగా వీరేంద్రుని చూశాడు. వీరేంద్రుని వాక్కులో ప్రశంసకన్నా కుటిలత్వమే విన్పిస్తున్నది.
‘‘నర్తకీమణీ! మీ నృత్యాభినయంతో మేము ముగ్ధులమయ్యాం!’’ అంటూ ప్రభువు తన మెడలోని ముత్యాలహారాన్ని ఆమెకు బహూకరించారు. కృతజ్ఞతతో మంజరి కళ్ళు చెమర్చాయి.
‘‘మంజరీ! నేటినుండి నిన్ను మా ఆస్థాన నర్తకిగా గౌరవిస్తున్నాం’’. ప్రభువిచ్చిన వెలలేని కానుకలతో ఇల్లు చేరిన మంజరికి తల్లి గుర్తొచ్చింది. కృష్ణసాని ఉంటే ఎంత సంతోషించేంచేదో! ఆమె కళ్ళు తల్లి జ్ఞాపకాలతో చెమర్చాయి.
మర్నాటి కార్యక్రమం మొదలయింది.
రంగస్థలంలో వెయ్యిమంది మల్లయోధులు ఆయుధాలు లేకుండా పోరాడి వివిధ రకాల మల్లవిద్యలు ప్రదర్శించారు. వారికందరికీ బహుమతులు అందాయి. కొందరు వలలు విసురుతూ రంగస్థలంలోని వారిని చేపల్లా పట్టే వినోదాన్ని ప్రదర్శించారు.
ఈ విధంగా అనేక ప్రదర్శనల తర్వాత పలు వర్ణాల జ్యోతులు వెలిగించారు. బాణసంచా పేల్చారు.
అనంతరం బారులుతీరిన అలంకృత ఏనుగులు, అశ్వాలు, వృషభాలు రాజు ఎదుట వచ్చి నిలబడ్డాయి. బ్రాహ్మణుడు మంత్ర పుష్పాక్షతలతో వీటిని అర్చించాక మహారాజు పక్కనే ఉన్న చిన్న ద్వారం గుండా నిష్క్రమించాయి.
బ్రాహ్మణులు విజయమందిర దేవాలయ విగ్రహాన్ని యథాశక్తి పూజించారు. మహారాజు ఉత్సవాలు జరిగే తొమ్మిదిరోజులు ఉపవాసమున్నారు. ఆయన ముఖకళ రోజురోజుకూ ఇనుమడిస్తూనే ఉండటం విశేషం.
ఈ ఉత్సవాల కాలంలో సామంత నాయకులు రాజమందిరం దగ్గర నవ దుర్గాల్లో అమూల్య వస్త్భ్రారణాలు, వస్తువులు ఉంచి విజయదశమి మహోత్సవ వేళ చక్రవర్తికి రాజచిహ్నాలను అలంకరించి కానుకలు చెల్లించారు. ప్రభువు దేవేరులంతా స్వర్ణ్భారణ భూషితులై బంగారు కలశాలతో రాజచంద్రునికి నీరాజనాలు సమర్పించారు. నవరాత్రి దసరా ఉత్సవం తొమ్మిది రోజులు రాజభవనం ఆనంద పారవశ్యంలో మునిగితేలుతున్నది.
కురిసిన దెచట వాక్కుల జృంభణములోన
కవిరాజుపైన బంగారు వాన
సలిపిన దెచట ధూర్జటి దివ్యలేఖిని
నవ్యవారాంగనా నర్తనంబు
తొడిగిన దెచట నిస్తుల రాజహస్తము
కవి పితామహు కాలి కంకణంబు
విరిసిన దెచట ప్రవీణవాచస్పతి
రామలింగని హాస్య రససమృద్ధి

అది శిలల దిబ్బ దసరాలకైన దిబ్బ
తెలుగు లలిత కళాదేవి తీర్చినట్టి
కొలువుకూటపు దిబ్బ వనె్నలకు దిబ్బ
మా మహర్నవమీశాల మంటపంబు
***
తిమ్మరుసు భవనంలో కుమారుడు గోవిందరాయలతో గంభీరంగా సమావేశమైనాడు.
‘‘మీరేమైనా చెప్పండి నాన్నగారూ.. వీరేంద్రుడింక విజయనగరంలో వుండటానికి వీలులేదు’’ గోవింద రాయలు ఆవేశంగా అన్నాడు.
‘‘త్వరపడితే ఎలా గోవిందా! అతను రాజబంధువు. ముల్లును ముల్లుతోనే తీసివేయాలి. అతని కపటబుద్ధి నాకూ తెలుసు. గజపతుల కూతురితో వచ్చి విజయనగరంలో పాగా వేసినప్పటినుంచి అతన్ని కనిపెడుతూనే ఉన్నాను’’ తిమ్మరుసు సాలోచనగా అన్నాడు.
‘‘ఇంక జాప్యం చేయరాదు నాన్నగారూ, కంటకుడు రాజద్రోహులతో మంతనాలు చేస్తున్నాడు. సైన్యాధికారులు, రాజోద్యోగుల మీద పెత్తనం చేయాలని చూస్తున్నాడు’’ గోవిందరాయలి కోపం తారాస్థాయిలో వుంది.
తిమ్మరుసు వౌనంగా తల పంకించాడు.

- ఇంకా ఉంది

-చిల్లర భవానీదేవి