డైలీ సీరియల్

బంగారుకల 39

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఆ తాచుపాము మెడ పట్టి పడగ దింపాలి రామలింగ నాయకా! ఇక ఉపేక్ష పనికిరాదు’’ తిమ్మరుసు నెమ్మదిగా చెప్పినా నిర్ణయం దృఢంగా ఉంది.
‘‘కాగల కార్యమేమిటి మహామంత్రీ!’’ వ్యాస రాయలు శాంతంగా అడిగారు.
‘‘ఏముంది. వీరేంద్రుడిని తన్ని తగలేయటమే’’ ఆవేశంగా బుసలు కొట్టాడు రామలింగనాయకుడు.
‘‘ఆ ఆ! అలా చేస్తే రాయలవారి దృష్టిలో నిజంగానే మనం దుర్మార్గులమైపోతాం. ఆ వీరేంద్రుని పాచికకు ఎదురు పాచిక వేయటమే మనం చేయాల్సిన పని’’ తిమ్మరుసు సాలోచనగా అన్నారు.
‘‘ఏమిటది మహామంత్రీ’’ వ్యాసరాయలి ప్రశ్నకు తిమ్మరుసు ఇలా వివరించారు.
‘‘మనకి అందిన వార్త ప్రకారం అన్నపూర్ణాదేవి మహారాజును ఓ కోరిక కోరతారు’’.
‘‘ఏమని?’’ వ్యాసరాయలు అడిగారు. తిమ్మరుసు తన వివరణ కొనసాగించారు.
‘‘అదేమంటే యువరాజు తిరుమలరాయలకు పట్ట్భాషేకం చేయమని’’.
‘‘ఆ! అంత పసివాడికి పట్ట్భాషేకమా?’’ రామలింగనాయకుడు నిర్ఘాంతపోయాడు.
‘‘అవును. దీనికి నేను ఒప్పుకోననీ, తద్వారా రాయలవార్కి నాకూ విభేదాలు పెంచాలని వీరేంద్రుని పాచిక’’ తిమ్మరుసు విడమరిచారు.
‘‘మరి మనం అవునంటే?’’ వ్యాస రాయలు సందిగ్ధంగా చూశాడు.
‘‘అవునంటే పట్ట్భాషేకం చేయాలి’’ తేల్చి చెప్పారు మహామంత్రి.
‘‘కాదంటే’’ రామలింగ నాయకుడి ఆవేశం.
‘‘రాయలకూ మాకు విభేదం’’ స్థిరంగా ఉంది తిమ్మరుసు స్వరం.
‘‘రాయలవారికి ఇంతటి స్థానం సంపాదించి ఇచ్చింది మీరు. మీతోనే విభేదిస్తారా?’’ రామలింగ నాయకుడు కలవరపడ్డాడు.
‘‘రామలింగ నాయకా! అధికారం విచక్షణ కళ్ళు మూస్తుంది. అది ఎవరికైనా ఒకటే! ఇన్నాళ్ళకి రాయలకూ నాకూ ఒక విషప పరీక్ష ఎదురైంది. చూద్దాం! నా రాయలు దీనిని ఎలా ఎదుర్కొంటాడో!’’తిమ్మరుసుమంత్రి కంఠంలో సన్నని వణుకు మొదటిసారిగా ధ్వనించింది.
‘‘మన కర్తవ్యం?’’ వ్యాసరాయలు వాతావరణాన్ని తేలిక చేశారు.
‘‘గురువర్యా! గతంలో రాయలవారి జన్మకుండలి ప్రకారం యోగం తప్పినపుడు మీరీ విజయనగర సామ్రాజ్యమధిష్ఠించి సహాయం చేశారు. మరోసారి రాయలవారి జాతకాన్ని పరిశీలించండి. మనమేం చేయాలో దానిననుసరించి నిర్ణయిద్దాం’’.
తిమ్మరుసు మాట ప్రకారం వ్యాసరాయలు శ్రీకృష్ణదేవరాయల జన్మకుండలి పరిశీలించారు. ఆయన వదనం వివర్ణమయింది.
‘‘మహామంత్రీ! రాయలవారి రోజులు అంతగా బాగా లేవు. కొంత గ్రహశాంతి చేయాలి. యువరాజుగారి జాతకం కూడా ఆపద సూచిస్తున్నది.’’
‘‘దీని పరిహారం?’’ తిమ్మరుసు మంత్రి ఆందోళనగా చూశారు.
‘‘యువరాజు పట్ట్భాషేకం ఇప్పట్లో జరగరాదు’’ వ్యాసరాయలు తేల్చి చెప్పారు.
‘‘అదెలా సాధ్యం? రాయలవారు జరపదలుస్తారు కదా!’’ రామలింగ నాయకుని సందేహం
జరపదలుస్తారు. అంతే! అన్నపూర్ణాదేవి మందిరానికి వెళ్ళకుండా కొన్నాళ్ళు రాయలవారిని ఆపగలిగితే... తిమ్మరుసు ఆలోచనలో పడ్డారు.
‘‘గురుదేవా! మేమిక వెళ్ళివస్తాం. ప్రణామాలు! మేమీ చర్చ చేసిన విషయం కడు రహస్యం. మీకు తెలుసు గదా!’’ నర్మగర్భంగా నవ్వారు తిమ్మరుసు.
‘‘మంచిది మహామంత్రీ! నిశ్చింతగా వెళ్ళిరండి. శుభం’’.
వ్యాసరాయలి ఆశీస్సులు తీసుకొని తిమ్మరుసు, రామలింగ నాయకుడు వెళ్ళిపోయారు. విజయనగర సామ్రాజ్య రక్షణకు కట్టుబడి ఉన్న ఆ ఇద్దరు దేశభక్తులను చూస్తుండిపోయారు. వ్యాసరాయలు.
***
‘‘మంజూ! ఆగు’’
ఒంటరిగా ఇన్నాళ్ళు తర్వాత కలిసింది తన ప్రేయసి. చంద్రప్ప ఆమె చేతిని బిగించి పట్టుకున్నాడు.
అది వాళ్ళు తరచుగా కలుసుకునే ఉద్యానవనం. అయితే చాలా రోజులుగా ఆ తోట చిన్నబోయింది. ఈ ప్రేమికుల సందడి లేక వెలవెలబోతున్నది. ఆమె ఆగింది. పెడమోమై నిల్చున్నది.
‘‘మంజూ! నీకిది న్యాయంగా ఉందా! ఎందుకు నన్ను దూరం చేస్తున్నావు’’ దీనంగా అడిగాడు.
తన కన్నీళ్ళు అతనికి కన్పించనీయలేదామె.
‘‘నావల్ల ఏదైనా పొరపాటు జరిగితే నన్ను శిక్షించు. అంతేగానీ ఇలా దూరం చేస్తే చచ్చిపోతాను’’,
చటుక్కున వెనుదిరిగి చేత్తో అతని నోరు మూసేసింది. ‘‘చంద్రా!’’ అంటూ అరచేతుల్లో మొహం దాచుకుని వెక్కివెక్కి ఏడవసాగింది.
‘‘మంజూ!’’ ఆమెని దగ్గరికి తీసుకున్నాడతను.
‘‘జాతకం నమ్మి నన్ను దూరం చేస్తావా! చావైనా బతుకైనా ఇద్దరికీ ఒకసారే అనుకున్నాం కదా! ఆ కంటకునితో కలిసి ఎందుకు నా కంటబడుతున్నావో తెలుసుకోలేని బుద్ధిహీనుడ్ని కాను’’ కోపంగా అన్నాడు.
ఏం శిక్ష వేస్తావ్?’’ నడుం మీద చేతులుంచుకొని మంజరి అడిగిన తీరుకు నవ్వేశాడు.
‘‘శిక్షా! మూడుముళ్లే...’’
ఆమె మొహం వివర్ణమయిందా ప్రస్తావనతో. పైకి బింకంగా మాట్లాడుతోంతేగానీ తనవల్ల చంద్రప్పకి ఎటువంటి ఆపదయినా, అదీ పెళ్ళి రూపంలోనైనా రాకూడదని ఆమె ఆలోచన.
‘‘సర్లేగానీ ఇలా రా కూర్చో. నీతో చాలా సంగతులు చెప్పాలి.

- ఇంకా ఉంది

-చిల్లర భవానీదేవి