రాష్ట్రీయం

మలుపు తిరుగుతున్న ఏకీకృత సర్వీస్ రూల్స్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మరోసారి వివరాలు కోరిన కేంద్ర హోంశాఖ

హైదరాబాద్, డిసెంబర్ 4: ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు రూల్స్‌పై సుప్రీంకోర్టు ఆదేశాలను పురస్కరించుకుని పూర్తి వివరాలతో ప్రతిపాదనలు పంపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరనున్నట్టు కేంద్ర హోం శాఖ డైరెక్టర్ అశుతోష్ జైన్ తెలిపారని ఎస్‌టియు ఎపి రాష్ట్ర అధ్యక్షుడు కత్తినర్సింహారెడ్డి చెప్పారు. న్యూఢిల్లీలోని హోంశాఖ కార్యాలయంలో డైరెక్టర్‌ను ఆయన కలిసి సుప్రీంకోర్టు ఆదేశాలు తదుపరి రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 8న పంపించిన ప్రతిపాదనలపై జాప్యం లేకుండా ఆమోదించాలని కోరారు. సర్వీసు రూల్స్‌కు సంబంధించి మొత్తం క్యాడర్లు, హోదా తదితర పూర్తి వివరాలను పంపించాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ పంపనున్నట్టు తెలిపారు. ప్రతిపాదనలు వచ్చిన వెంటనే చర్యలు గైకొంటామని హామీ ఇచ్చినట్టు తెలిపారు. ఏకీకృత సర్వీసు రూల్స్‌పై రాష్టప్రతి ఉత్తర్వులు పొందేందుకు సెప్టెంబర్ 30న సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 8న రాష్ట్ర ప్రభుత్వం పంపించిన లేఖపై పూర్తి వివరాలను పంపించాలని కోరుతూ రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖకు లేఖను పంపించనున్నట్టు ఆయన తెలిపారు. డిసెంబర్ 15వ తేదీలోగా జిఎడి అనుమతితో పూర్తి వివరాలతో కేంద్ర హోం శాఖకు ప్రతిపాదనలు పంపించేందుకు విద్యాశాఖ కార్యదర్శి ఆర్ పి సిసోడియా హామీ ఇచ్చారని తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలోనే సర్వీసు రూల్స్ పొందడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకోవాలని నర్సింహారెడ్డి కోరారు.
అప్పీళ్లపై ఆన్‌లైన్‌లోనే పరిష్కారం
ఇటీవల ఉపాధ్యాయుల వెబ్ కౌనె్సలింగ్‌లో ఉపాధ్యాయుల నుండి వచ్చిన అప్పీళ్లపై అన్ని జిల్లాలకు సంబంధించి పరిష్కారం వివరాలను సిఎస్‌ఇ వెబ్‌సైట్‌లో శుక్రవారం అందుబాటులో ఉంచినట్టు పాఠశాల విద్యాశాఖాధికారులు తెలిపినట్టు యుటిఎఫ్ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ఐ వెంకటేశ్వరరావు, పి బాబురెడ్డిలు చెప్పారు. సెకండరీ స్థాయిలో ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు ఎల్‌సిడి ప్రాజెక్టులు, ప్రింటర్లు, టివి, తదితర అవసరాలకు 48.6 లక్షలు విడుదల చేస్తూ విద్యాశాఖ కార్యదర్శి ఆర్ పి సిసోడియా ఉత్తర్వులు జారీ చేసినట్టు యుటిఎఫ్ నేతలు వివరించారు.