యువ

మీలోనే ఓ ఎడిసన్.. ఓ లింకన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరాజయాలకు కుంగిపోకండి..
అపజయం..ఆ పేరంటేనే చాలామందికి భయం. సెట్‌బాక్స్ లేకుండా కెరీర్‌ని నిర్మించుకోవాలని, జీవితాన్ని సాగించాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అది సాధ్యమేనా? అవమానాలు, అపజయాలు లేకుండా జీవితమే ఉండదు. మహామహులనుకున్నవారికి కూడా ఇవి తప్పలేదు. జీవితంలో వరుస విజయాలను సాధిస్తున్నవారికి కూడా ఎప్పుడో ఒకప్పుడు ఓటమి తప్పదు. ఎన్నికల బరిలోకి దిగిన ప్రతిసారీ పరాజయానే్న చవిచూసిన అబ్రహాం లింకన్‌ను చివరికి అమెరికా అధ్యక్ష పదవి వరించింది. సైన్స్‌లో థామస్ అల్వా ఎడిసన్ చేసినన్ని ఆవిష్కరణలు మరే శాస్తవ్రేత్తా చేయలేదు. కానీ అంతటి శాస్తవ్రేత్త కూడా అపజయాల బారిన పడక తప్పలేదు. అయితే లింకన్ అయినా, ఎడిసన్ అయినా...ఆ మాటకొస్తే విజయ తీరాలకు చేరుకున్న వారెవరైనా జీవితంలో తమకు ఎదురైన అపజయాలనూ, ఓటములనూ చూసి కుంగిపోలేదు. అక్కడితో తమ ఎదుగుదలకు ఫుల్‌స్టాప్ పడిందని భావించలేదు. ఓటములనుంచి పాఠాలు నేర్చుకున్నారు. పడిలేచిన కడలి తరంగంలా పట్టుదలతో పనిచేసి విజయాలనందుకున్నారు. ఎడిసన్ చేపట్టిన దాదాపు పదివేల ప్రయోగాలు విఫలమయ్యాయట. ఆ పరాజయాలను చిరునవ్వుతో స్వీకరించిన ఎడిసన్ ‘నేను ఓడిపోలేదు. పదివేల మార్గాలు వెతికాను. అయితే అవి ఏవీ గమ్యాన్ని చూపించలేదంతే’ అనేవాడట. ఓటమి ఎదురైన ప్రతిసారీ, ఎందుకు ఓడిపోయానని విశే్లషించుకునేవాడట. పరాజయాలనుంచి పాఠాలు నేర్చుకోవడమంటే అదే!
సానుకూల దృక్పథం ముఖ్యం
తెలివితేటలనేవి సహజ సిద్ధంగా ఉండాలని, అవి లేనప్పుడు పరాజయాలను ఎదుర్కోక తప్పదన్నది చాలామంది భావన. కానీ అది వాస్తవం కాదు. తెలివితేటలు అంతంతమాత్రంగానే ఉన్నా, కృషితో నాస్తి దుర్భిక్షం అనే నానుడిని నిజం చేస్తూ కష్టపడి పనిచేయడం ద్వారా గెలుపును చేజిక్కించుకోవచ్చు. దీనికి కావలసింది సానుకూల దృక్పథం. హార్డ్‌వర్క్ ద్వారా ప్రతిభాపాటవాలను పెంపొందించుకోవచ్చు. పరాజయాలను అవలీలగా అధిగమించవచ్చు. ఓటమి ఎదురైనప్పుడు దానికి కుంగిపోకుండా, పరాజయాన్ని ఓ సవాల్‌గా, ఎదగడానికి లభించిన ఓ అవకాశంగా భావించి సానుకూల దృక్పథంతో ముందుకు వెడితే గెలుపు మీదే! తెలివితేటలనేవి ఏ పనినైనా ప్రారంభించేందుకు ఉపయోగపడతాయి. దానికి హార్డ్‌వర్క్ తోడవనిదే విజయం అసాధ్యం.
ధైర్యే సాహసే....
ఓ సెట్‌బాక్ ఎదురుకాగానే చాలామంది కుంగిపోతారు. భవిష్యత్తును తలచుకుని భయపడిపోతారు. దురదృష్టవశాత్తూ ఉద్యోగం పోతే...ఇక అంతటితో జీవితమే ముగిసిపోయినట్టు బాధపడతారు. మరో ఉద్యోగం దొరకదేమో...దాచుకున్న డ బ్బు అయిపోతుందేమో...్భర్యాబిడ్డలతో సహా రోడ్డున పడాలేమో వంటి ఆలోచనలతో లేనిపోనివన్నీ ఊహించేసుకుని అర్థం లేని భయాలతో ఆందోళన పడతారు. ముందు చేయవలసింది అలాంటి ఆలోచనలకు అడ్డుకట్ట వేయడం. ఓటమనేది ఓ అడ్డంకి..ఓ ఆటంకం..ఓ స్పీడ్ బ్రేకర్. అంతే. ఓటమి శాశ్వతం కాదనే వాస్తవాన్ని గ్రహించండి. అపజయం ఎదురైన వెంటనే కంగారు పడకుండా ఎక్కడ తప్పు జరిగిందో నింపాదిగా ఆలోచించాలి. తదుపరి కర్తవ్యమేమిటో గుర్తెరగాలి. ఐదేళ్ల తరవాత మనం ఎక్కడుండాలో గమ్యం నిర్దేశించుకోవాలి. ఆ దిశగా పరుగు ప్రారంభించాలి. అసలు అపజయాలనేవి కేవలం తాత్కాలికమని మీరు నమ్మాలి. అలా నమ్మితే పరాజయభారంనుంచి బయటపడటం, మీకు మీరు దిశానిర్దేశం చేసుకోవడం కష్టమేమీ కాదు.
లక్ష్య నిర్దేశం అవసరం
విజయాన్ని అందుకోవడానికి దారులు అనేకం. ఒక దారి మూసుకుపోయినంత మాత్రాన పోయిందేముంది? మరో దారి ఉందనే సత్యాన్ని గమనిస్తే చాలు. కావలసిందల్లా పరాజయభారంనుంచి త్వరగా బయటపడటమే. మీ లక్ష్యం పెద్దదే కావచ్చు. కానీ దానిని చిన్న చిన్న లక్ష్యాలుగా విడగొట్టండి. అలా చేసినంతమాత్రాన వాటిని అధిగమించడం సులభమని కాదు. అయితే వాటిని చేరుకుంటే ఇచ్చే కిక్ మిమ్మల్ని అసలు లక్ష్యానికి చేరువ చేస్తుంది. లక్ష్యాలను ఎలా సాధించాలనే ప్రణాళికారచన మీరు చేయగలిగితే, ఆ దిశగా మీ ప్రయాణం ప్రారంభమవుతుంది. కాబట్టి లక్ష్య నిర్దేశం, దానిని ప్రణాళికాబద్ధంగా చేరుకోవడం అవసరం.
పరాజయాన్ని చూసి పారిపోతే మీకు భవిష్యత్తు మిగలదు. ఓటమిని నిర్లక్ష్యం చేసినా లేక దాచిపెట్టి ముందుకు వెడదామని ప్రయత్నించినా ఎదురుదెబ్బలు తప్పవు. మీ తప్పుల్ని, మీ అపజయాల్ని మీరు గుర్తించలేనప్పుడు ఇతరులెవరూ మీకు పాఠాలు నేర్పలేరు. మీ పరాజయాలనుంచి పాఠాలు నేర్చుకోవలసింది మీరేనన్న విషయాన్ని ముందుగా గ్రహించండి. ఓటమిని అవమానంగా భావించడం కంటే అదో గుణపాఠంగా గ్రహించినందువల్ల ముందడుగు వేయడం సులభతరమవుతుంది. వర్షంలో తడవడం ఎవరికీ ఇష్టం ఉండదు. కానీ వర్షం వస్తే తడవక తప్పదు కదా. అలా అని తడుస్తూ ఉండలేం. రెయిన్‌కోట్లు, గొడుగులు వంటివాటిని ఆశ్రయిస్తాం. అలాగే పరాజయాలూ కూడా. అవి అనివార్యం. వాటిని ఎదుర్కొనేందుకు కవచకుండలాలను సంపాదించుకోవలసింది మీరే. చివరగా ...పరాజయం మీకు మాత్రమే పరిమితం కాదు. ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు దానిని ఎదుర్కోవాల్సిందేనన్న విషయాన్ని గుర్తెరగండి. సాంత్వన చేకూరుతుంది.

-సిఎం ప్రాణ్‌రావు