బిజినెస్

పనితీరు ప్రామాణికతను చేరుకోకపోతే.. ఉద్యోగుల వార్షిక ఇంక్రిమెంట్లు నిలిపివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్రానికి ఏడో వేతన సంఘం సిపార్సు
========================

న్యూఢిల్లీ, నవంబర్ 22: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు గనుక పనితీరు ప్రామాణికతను అందుకోలేక పోయినట్లయితే వారికి వార్షిక ఇంక్రిమెంట్లను నిలిపి వేయాలని ఏడవ వేతన సంఘం సిఫార్సు చేసింది. అంతేకాదు ఈ ప్రామాణికతను ‘గుడ్’ నుంచి ‘వెరీ గుడ్’కు పెంచాలని కూడా కమిషన్ అభిప్రాయపడింది. అలాగే అన్ని కేటగిరీల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పనితీరుతో ముడిపడిన వేతనం (పిఆర్‌పి)ను అమలు చేయాలని కూడా కమిషన్ సిఫార్సు చేసింది. ఇంక్రిమెంట్లు, పదోన్నతులనేవి ఆటోమేటిగ్గా జరిగి పోతాయనేది సాధారణంగా ఉద్యోగులందరి భావన. ఉద్యోగులు పదోన్నతులు పొందడానికి పనితీరుకు సంబంధించి ప్రామాణికతలను నిర్దేశించినప్పటికీ సవరించిన అస్యూర్డ్ కెరీర్ పురోగతి (ఎంఏసిపి) మంజూరు అనేది యధావిధిగా జరిగిపోతుందనే భావన ఉద్యోగుల్లో ఉందని కమిషన్ పేర్కొంది. ‘నిర్ణయించిన పనితీరుకు సంబంధించిన ప్రామాణికతకు చేరుకోలేకపోయిన ఉద్యోగులను భవిష్యత్తు వార్షిక ఇంక్రిమెంట్లు పొందడానికి అనుమతించకూడదని కమిషన్ నమ్ముతోంది. అందువల్ల ఎంఏసిపి కోసం కానీ, లేదా సర్వీసులో ఇరవై ఏళ్ల లోపు రెగ్యులర్ పదోన్నతి కోసం కానీ పనితీరుకు సంబంధించిన ప్రామాణికతకు చేరుకోలేకపోయిన ఉద్యోగులకు వార్షిక ఇంక్రిమెంట్లను నిలిపి వేయాలి. ఉద్యోగులు ప్రామాణికతలను చేరుకోవడానికి, అసమర్థ ఉద్యోగులు తమ సామర్థ్యాన్ని మెరుగుపర్చుకోవడానికి ఇది తోడ్పడుతుంది. అయితే ఇది శిక్ష కాదు కాబట్టి క్రమశిక్షణా చర్యల కేసుల్లో పాటించే ఇంక్రిమెంట్లు నిలిపివేయడం లాంటి శిక్షలకు పాటించే నిబంధనలు ఇలాంటి కేసుల్లో వర్తించవు’ అని కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొంది. అంతేకాకుండా అలాంటి ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణల విషయంలో వర్తింపజేసే నియమ నిబంధనలపై సర్వీసును వదిలిపెట్టే అవకాశం ఇవ్వాలని కూడా కమిషన్ స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు మామూలుగా తమ సర్వీసులో పది, ఇరవై, ముప్పై ఏళ్లకు ప్రమోషన్లు లభిస్తుంటాయి. దీని ఫ్రీక్వెన్సీని పెంచాలన్న ఉద్యోగ సంఘాల డిమాండ్‌ను కమిషన్ తోసిపుచ్చింది. అయితే మార్పు అవసరమని కమిషన్ అభిప్రాయపడుతున్న ఒక ముఖ్యమైన అంశం ఉంది. అదేమిటంటే ఎంఏసిపి లేదా రెగ్యులర్ ప్రమోషన్ కోసం నిర్ణయించిన ప్రామాణికతకు సంబంధించినది. పని తీరు స్థాయిని మెరుగుపర్చడం కోసం దీన్ని ‘గుడ్’నుంచి ‘వెరీ గుడ్’కు పెంచాలి’ అని కమిషన్ పేర్కొంది. అంతేకాకుండా ఎంఏసిపి తీసుకోవడానికి ముందు డిపార్ట్‌మెంటల్ పరీక్షలు పాస్ కావడం, శిక్షణ తప్పనిసరి చేయడంలాంటి మరింత కఠినమైన ప్రామాణికతలను ప్రవేశపెట్టే విషయాన్ని ప్రభుత్వం పరిశీలించాలని కమిషన్ పేర్కొంది.