బిజినెస్

నిన్న రిఫైనరీ ఆధారిత సెజ్... నేడు పోర్ట్ ఆధారిత సెజ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సందిగ్ధంలో కాకినాడ ఎస్‌ఇజడ్ భవితవ్యం

కాకినాడ, డిసెంబర్ 21: భూసేకరణ వ్యవహారంలో వివాదాస్పదంగా మారిన కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి (కెఎస్‌ఇజడ్) భవితవ్యం సందిగ్ధంగా మారింది. ప్రభుత్వాలను శాసించే స్థాయికి చేరిన కార్పొరేట్ కంపెనీలు తలచుకుంటే ఏదైనా సాధించగలరనడానికి తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ ఎస్‌ఇజడ్ వ్యవహారాన్ని మంచి ఉదాహరణగా చెప్పవచ్చనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గతంలో ఇక్కడ రిఫైనరీ ఆధారిత ఎస్‌ఇజడ్‌ను కాకినాడ తీరంలో ఏర్పాటుచేస్తున్నట్టు ప్రకటించి వేలాది ఎకరాల పంట భూములను రైతుల నుండి సేకరించిన విషయం తెలిసిందే.
ఈ భూములపై స్థానికంగా దుమారం చెలరేగుతుండగా, మరోవైపు ఎస్‌ఇజడ్ కార్యకలాపాలు విస్తరించడానికి రంగం సిద్ధమవుతోంది. అయితే రిఫైనరీ ఆధారిత సెజ్ స్థానే పోర్టుతో కూడిన బహుళ ఉత్పత్తుల (మల్టీ ప్రోడక్ట్) ప్రత్యేక ఆర్థిక మండలిని నిర్మిస్తున్నట్టు సంస్థ యాజమాన్యం ప్రకటించింది. దాదాపు పదేళ్ల క్రితం అప్పటి యుపిఎ ప్రభుత్వ హయాంలో కాకినాడలో ఎస్‌ఇజడ్ నిర్మాణానికి భూసేకరణ చేపట్టారు. ప్రభుత్వ రంగ సంస్థ ఒఎన్‌జిసి ముందుగా ఈ ఎస్‌ఇజడ్‌లో రిఫైనరీని నిర్మించడానికి ముందుకువచ్చింది. అప్పట్లో ఒఎన్‌జిసి ఆధ్వర్యంలో రిఫైనరీ ఆధారిత సెజ్ నిర్మించనున్నట్టు సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే భూసేకరణ వ్యవహారం తీవ్ర వివాదాస్పదం కావడం, స్థానికంగా నెలకొన్న అప్పటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఒఎన్‌జిసి వెనక్కి వెళ్ళిపోయింది. తర్వాత ఒకటి రెండు స్వదేశీ, విదేశీ కంపెనీలు కూడా రిఫైనరీని నిర్మించడానికి ముందుకువచ్చినట్టే వచ్చి వెళ్ళిపోయాయి. అప్పట్లో సెజ్ ముఖ్య ప్రమోటర్‌గా కాకినాడ సీపోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవహరించింది. కొంతకాలానికి ప్రముఖ కార్పొరేట్ సంస్థ జిఎంఆర్ చేతుల్లోకి ఎస్‌ఇజడ్ వచ్చిపడింది. ప్రస్తుతం సెజ్ కార్యకలాపాలన్నీ ఈ సంస్థ ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. ఇదిలావుండగా రిఫైనరీ ఆధారిత సెజ్ పేరుతో భూములను సేకరించారని, ఇప్పుడు అందుకు విరుద్ధంగా పోర్ట్ ఆధారిత సెజ్ నిర్మిస్తున్నట్టు ప్రకటించడం న్యాయపరంగా ఎంతవరకు సమంజసమన్న ప్రచారం సెజ్ వ్యతిరేక వర్గాల్లో జరుగుతోంది.
ఒఎన్‌జిసి రిఫైనరీ ఆధారిత సెజ్ పేరుతో ప్రభుత్వమే ఇక్కడ వేలాది ఎకరాల భూములను సేకరించి, ప్రైవేట్ వ్యక్తి, ప్రైవేట్ కంపెనీ పేరున అప్పట్లో ధారాదత్తం చేసిందని, తాజాగా ప్రస్తుత ప్రభుత్వంలో రిఫైనరీ స్థానే పోర్ట్‌ను తెర మీదకు తెచ్చారని, ఇది ఎలా సాధ్యమవుతుందన్న వాదన మొదలయ్యింది. కాగా, గతంలో సెజ్‌కు వ్యతిరేకంగా దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టివేసిందని, కావాలనే కొందరు సెజ్‌కు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు సాగిస్తున్నారంటూ కంపెనీ పేర్కొంటోంది.
ఇటీవల సెజ్ భూముల్లో నిర్వాసితులు నిర్మాణంలో ఉన్న కంచెను తొలగించి మళ్లీ ఉద్యమానికి ఊపిరిలూదే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాకినాడ సెజ్ భవితవ్యం ఏమిటనే ప్రశ్న వినిపిస్తోంది.