రివ్యూ

శృతిమించిన రాగం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

*శంకరాభరణం (బాగోలేదు)

తారాగణం:
నిఖిల్, నందిత, అంజలి, రావు రమేష్, సుమన్ తదితరులు.
సంగీతం:
ప్రవీణ్ లక్కరాజు
రచన:
కోన వెంకట్
దర్శకత్వం:
ఉదయ్ నందనవనమ్

తెలుగులో రచయితగా మంచి కమర్షియల్ టర్నింగ్ తీసుకున్న కోన వెంకట్ నిర్మాతగా మారి సినిమాలు చేస్తున్నాడు. మొదటి ప్రయత్నం ‘గీతాంజలి’ మంచి టాక్ సంపాదించింది. రెండో ప్రయత్నంగా విభిన్నమైన నేపథ్యాన్ని ఎన్నుకుని నాటి క్లాసికల్ హిట్ శంకరాభరణం పేరిట సినిమా నిర్మించాడు. శంకరాభరణం పేరు జనాల్లో బాగా నానుతూ ఉండటంతో ఈ సినిమాకు ఎలాంటి సంబంధంలేకున్నా టైటిల్‌ని వాడుకున్నారు. కొత్త జనరేషన్‌లో స్వామిరారా, కార్తికేయలాంటి ప్రాజెక్టులతో వరుస హిట్లు కొడుతూ వస్తున్న హీరో నిఖిల్ తాజాగా -కోన వెంకట్ సమర్పణలో ఉదయ్ నందనవనమ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా శంకరాభరణంతో వచ్చాడు. అమెరికాలో మిలియనీర్ కొడుకు గౌతమ్ (నిఖిల్). కావలసినంత డబ్బు తండ్రి సంపాదించాడు కాబట్టి, నేనెందుకు సంపాదించాలన్న ఆటిట్యూడ్‌తో లైఫ్ ఎంజాయ్ చేస్తుంటాడు. ఇలాంటి సమయంలో -గౌతం తండ్రి సుమన్‌ని ఫ్రెండ్స్ ముంచేస్తారు. ఆస్తి అంతా పోయి బ్యాంకుకి 12 కోట్లు కట్టాల్సి వస్తుంది. దాంతో గౌతమ్ తల్లి సితార, తన పేరుమీద బీహార్‌లో శంకరాభరణం అనే పాలెస్ ఉందని, దాన్ని అమ్మి డబ్బు తెచ్చుకుంటే సమస్య తీరిపోతుందని చెప్తుంది. దాంతో గౌతమ్ బిహార్ వస్తాడు. అక్కడేమో సితారకి చెందిన ఫ్యామిలీ ఆ పాలెస్‌లోనే గత 15 ఏళ్ళుగా ఉంటుంటారు. వాళ్ళని ఎలాగోలాగ మోసం చేసి పాలెస్ అమ్మేయాలని అన్నీ సెట్ చేసుకుంటాడు. ఈలోగా గౌతమ్ డబ్బున్న కుర్రాడని తెలుసుకున్న బిహార్‌లోని కిడ్నాప్ ముఠా అతన్ని కిడ్నాప్‌చేసి డబ్బు డిమాండ్ చేస్తుంది. డబ్బుల్లేని గౌతమ్ అదే గ్యాంగ్‌తో కలిసి మిగతా కిడ్నాప్ ముఠాల నుంచి డబ్బు వసూలు చేయాలని ఓ ప్లాన్ వేస్తాడు. ఇంతకి ఆ ప్లాన్ ఏంటి? గౌతమ్ ఎదుర్కొన్న ఇబ్బందులేమిటి? తన ఫ్యామిలీ సమస్యని ఎలా తీర్చాడు? అన్నదే అసలు కథ.
హీరో నిఖిల్ ఎన్నారై పాత్రకి పర్ఫెక్ట్‌గా సరిపోయేలా తన లుక్ అండ్ మానరిజమ్స్ చూపించాడు. గౌతమ్ పాత్ర, దానికుండే రెండు షేడ్స్ చూపించటంలో తనే పర్ఫెక్ట్ అనిపించుకున్నాడు. ఫస్ట్ టైం ఫన్ టచ్ ఉన్న పాత్రలో హీరోయిన్ నందిత ఓకే అనిపించుకుంది. అంజలి బందిపోటు రాణిగా ముఖ్యపాత్రలో కనిపించింది. బలుపు, పొగరున్న సీరియస్ అమ్మాయిగా బాగానే చేసింది కానీ, సినిమాకి అంజలి పెద్దగా హెల్ప్ కాలేదు. కొన్నిచోట్ల అవసరానికి మించి అంజలి ఓవరాక్షన్ చేసింది. ఇక కమెడియన్స్‌గా 30 ఇయర్స్ పృథ్వి, సప్తగిరి, సంజయ్‌మిశ్రా, వైవా హర్షలు తమ మార్క్ డైలాగ్ డెలివరీతో పంచ్ డైలాగ్స్ చెప్పి ప్రేక్షకులను కాస్త నవ్వించారు. సంపత్ రాజ్ నెగటివ్ షేడ్ పాత్రలో మరోసారి మెప్పించాడు. ఇక రావు రమేష్, సుమన్, సితార వారివారి పాత్రల్లో ఫర్వాలేదనిపించారు.
2010లో బాలీవుడ్‌లో వచ్చిన సూపర్‌హిట్ ‘పస్ గయారే ఒబామా’కు ఇది రీమేక్. కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించిన కోన -ఎందులోనూ ఓకే అనిపించుకోలేకపోయాడు. ఒరిజినల్ కథలోని ఫ్రెష్‌నెస్‌కి తన మార్క్ విషయాన్ని జతచేసి మొదట కథని చెడగొట్టేశారు. కథకి అవసరమేలేని ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్ ఒకదాన్ని క్రియేట్‌చేసి ఫస్ట్‌హాఫ్ అంతా దానిమీదే నడిపించారు. అదేమన్నా కొత్తగా రాసుకున్నారా? అంటే అదీ లేదు. ఎప్పుడు తన కథల్లో ఉండే సీన్స్ అండ్ ఎమోషనే్స. ఇక సెకండాఫ్‌ని గజిబిజి గందరగోళం చేశారు. కథనమైతే అధోగతే. మొదటి 10 నిమిషాల సినిమాకే క్లైమాక్స్ క్లియర్‌గా అర్థమైపోవడంతో -ఆడియన్స్‌కు థ్రిల్లు అందదు.
డైరెక్షన్ ఉదయ్ నందనవనమ్‌దైతే, కోన దానికి దర్శకత్వ పర్యవేక్షణ చేసాడు. ఇలా ఇద్దరు చేసిన సినిమాలో ఒక్క సిగ్నేచర్ సీన్ కూడా కనిపించదు. హీరో హీరోయిన్ల మధ్య ఒక్క లవ్ సీన్ లేదు. క్లైమాక్స్‌లో ఇద్దరికీ ప్రేమ పుట్టేస్తుంది. టెక్నికల్ టీంలో -ప్రవీణ్ లక్కరాజు మ్యూజిక్ బావుంది. చెప్పుకోదగ్గ సాంగ్స్ లేకున్నా -బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌తో సినిమాకు హెల్పయ్యాడు. సాయిశ్రీరామ్ సినిమాటోగ్రఫీ ఒకే. లొకేషన్స్‌లో బిహార్ ఫ్లేవర్‌ని బాగా తీసుకొచ్చాడు. చిన్నా ఆర్ట్‌వర్క్ ఒకే. ఎడిటింగ్ పూర్. ఎంవివి సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. మరింత రక్తికట్టించాల్సిన రీమేక్ సూత్రానికి భిన్నంగా -శంకరాభరణం సీన్ రివర్స్ అయ్యింది. కొత్తగా అనిపించే పాయింట్‌నే కోన అటూ ఇటూ చేసి ఒరిజినల్ ఫ్లేవర్‌ని మిస్ చేశాడు. ఓవరాల్‌గా నిఖిల్ కెరీర్‌కి సినిమా ఏమాత్రం ఉపయోగపడదు. తెలుగు క్లాసిక్ శంకరాభరణం టైటిల్‌ను మిస్ యూజ్ చేశారన్న అపవాదు ప్రేక్షకుల నుంచి మోయక తప్పదు.

-ద్వివేది