అంతర్జాతీయం

శాంతి ప్రక్రియను దెబ్బతీసే ప్రకటనలు చేయొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంత్రులు, ఉన్నతాధికారులకు పాక్ ప్రధాని షరీఫ్ ఆదేశం

ఇస్లామాబాద్, డిసెంబర్ 19: ఇటీవల తిరిగి ప్రారంభమైన శాంతిప్రక్రియను దెబ్బతీసే ప్రకటనలేవీ చేయవద్దని పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ తన మంత్రులను, సహాయకులను ఆదేశించినట్లు ‘ది నేషన్’ పత్రిక కథనం పేర్కొంది. ‘గతాన్ని తవ్వేవి కాకుండా చర్చల ప్రక్రియను ప్రోత్సహించే ప్రకటనలు మాత్రమే ఉండాలి. శాంతిని ప్రోత్సహించండని ప్రధానమంత్రి తన సన్నిహిత అనుచరులను, మంత్రులను ఆదేశించారు’ అని ప్రధాని సన్నిహిత అధికారినుటంకిస్తూ ఆ పత్రిక తెలిపింది. ఈ నెలలోప్రారంభమైన శాంతిప్రక్రియ నిరాటంకంగా ముందుకు సాగడం కోసం ఈ చర్య తీసుకున్నట్లు ఆ కథనం తెలిపింది. శాంతిప్రక్రియను దెబ్బ తీసే ఎలాంటి ప్రకటనలూ చేయవద్దని ప్రధాని తన మంత్రులు, ఉన్నతాధికారులను ఆదేశించినట్లు ఆ పత్రిక తెలిపింది. భారత్‌తో మెరుగైన సంబంధాల విషయంలో ప్రధాని షరీఫ్ ఆశావహ దృక్పథంతో ఉన్నారని, దీనివల్ల మొత్తం ఉపఖండానికి ప్రయోజనం చేకూరుతుందని ఆ సీనియర్ అధికారి చెప్పారు. భారత్‌నుంచి వెలువడిన కొన్ని ప్రకటనలపై షరీఫ్ కినుకతో ఉన్నారని, అయితే ఇది భారత ప్రభుత్వ విధానం కాదనే విషయాన్ని అర్థం చేసుకున్నారని కూడా ఆయన చెప్పారు. ఇరుపక్షాలు చర్చల కోసం కూర్చున్నప్పుడు కాశ్మీర్ సమస్య, ఉగ్రవాదం, వాణిజ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని షరీఫ్ భావిస్తున్నారని ఆ అధికారి చెప్పారు.
కాగా, భారత్‌తో శాంతి విషయంలో ప్రధానమంత్రి, మిలిటరీ అగ్రనాయకత్వం ఒకే అభిప్రాయంతో ఉన్నాయని మరో అధికారి చెప్పారు. భిన్నాభిప్రాయం లేదని, ప్రధాన అంశాలపై ఇంతకుముందే ప్రకటించిన వైఖరిలో ఎలాంటి రాజీ ఉండకూడదని కూడా ఇరుపక్షాలు అంగీకరిస్తున్నాయని ఆయన అన్నారు. అన్ని అపరిష్కృత సమస్యలను పరిష్కరించుకోవడానికి చర్చల ప్రక్రియను తిరిగి ప్రారంభించాలని భారత్, పాక్‌లు అంగీకరించడం ఓ మంచి సానుకూల పరిణామమని పరిశీలకులు అంటున్నారు.