జాతీయ వార్తలు

గొంతు నులిమి చంపారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షీనా బోరా హత్యపై ఎయిమ్స్ బృందం నివేదిక

ముంబయి, డిసెంబర్ 24: సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో దర్యాప్తు సంస్థలకు ముందుకు సాగడానికి కీలకమైన ఆధారం లభించింది. గొంతు నులమడం వల్లనే షీనా బోరా మృతి చెందిందని అఖిల భారత వైద్య విజ్ఞానాల సంస్థ (ఎయిమ్స్) ధ్రువీకరించిందని ఒక ఆంగ్ల దినపత్రిక కథనం గురువారం వెల్లడించింది. గొంతు నులమడమే షీనా హత్యకు దారితీసిందని ఎయిమ్స్ బోర్డ్ ఆఫ్ ఫోరెన్సిక్ మెడిసిన్స్‌కు చెందిన నిపుణులు ఈ మేరకు కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ)కి సమర్పించిన తమ తుది నివేదికలో ధ్రువీకరించినట్లు ఆ కథనం తెలిపింది. ‘గొంతు నులమడమే షీనా బోరా హత్యకు కారణమని ఎయిమ్స్ బోర్డ్ ధ్రువీకరించింది’ అని ఆస్పత్రి వర్గాలను ఉటంకిస్తూ ఆ ఆంగ్ల దినపత్రిక తన కథనంలో పేర్కొంది. పోస్టుమార్టం కోసం షీనా బోరా అస్థికలను సిబిఐ అక్టోబర్‌లో ఎయిమ్స్ ఫోరెన్సిక్ డిపార్ట్‌మెంట్‌కు అందజేసింది. ఈ అస్థికలను పరిశీలించిన డాక్టర్ సుధీర్ గుప్త నేతృత్వంలోని ఎయిమ్స్ బృందం తల ఎముకలు విరగలేదని, అందువల్ల షీనా మృతికి తలకు గాయాలు కారణం కాదని స్పష్టం చేసింది. షీనా మృతికి కాల్పులు జరపడం కూడా కారణం కాదని తేల్చిచెప్పిందని ఆ వర్గాలు తెలిపాయి. ఈ కేసులో సేకరించిన ప్రాథమిక సమాచారం ప్రకారం, కారులో వెళ్తుండగా షీనా బోరాను హతమార్చి, అనంతరం ఆమె మృతదేహాన్ని దగ్ధం చేసి, అటవీ ప్రాంతంలో పూడ్చిపెట్టారు. సాక్ష్యాలను ధ్వసం చేయడానికే హంతకులు ఇలా వ్యవహరించారు. ఈ కేసులో షీనా తల్లి ఇంద్రాణి ముఖర్జీ, ఇంద్రాణి మాజీ భర్త సంజీవ్ ఖన్నా, ఇంద్రాణి డ్రైవర్ శ్యాంవర్ రాయ్, మీడియా సంస్థ మాజీ అధినేత పీటర్ ముఖర్జీని నిందితులుగా పోలీసులు అరెస్టు చేశారు.