జాతీయ వార్తలు

ఒవైసీని రాష్ట్రంనుంచి ఎందుకు పోనిచ్చారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహారాష్ట్ర సిఎంను నిలదీసిన శివసేన

ముంబయి/ లక్నో, మార్చి 17: ‘్భరత్ మాతాకీ జై’ అని అనడానికి తిరస్కరించిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై శివసేన ధ్వజమెత్తింది. ‘్భరత్ మాతాకీ జై’ అని అనడానికి తిరస్కరించిన వారి పౌరసత్వాన్ని, ఓటింగ్ హక్కును రద్దు చేయాలని డిమాండ్ చేసింది. మరోవైపు, ఉత్తరప్రదేశ్‌లో ఒవైసీ పాల్గొనవలసి ఉన్న రెండు కార్యక్రమాలకు అనుమతి ఇవ్వడానికి ఆ రాష్ట్ర అధికారులు తిరస్కరించారు. ఒవైసీ ఇటీవల లాతూర్‌లో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దేశాన్ని అవమానించే వ్యాఖ్యలు చేసిన ఒవైసీ రాష్ట్రం వదలి వెళ్లిపోతుంటే ఏంచేశారని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను శివసేన తన అధికార పత్రిక ‘సామ్నా’ గురువారం సంచిక సంపాదకీయంలో నిలదీసింది.
‘హర్దిక్ పటేల్ జాతీయ పతాకాన్ని అవమానించినందుకు అతనిపై దేశద్రోహం కేసు నమోదు చేసి, జైలులో పెట్టారని, భరతమాతను అవమానించడం ద్వారా ఒవైసీ దేశద్రోహానికి పాల్పడలేదా? అని ప్రశ్నించింది. ఒవైసీ వంటి నాయకుల ఆలోచనల వల్లే ముస్లింలు వెనుకబడి ఉన్నారని శివసేన విమర్శించింది.
అయితే కేవలం నినాదాలు వారిని (శివసేనను) జాతీయవాదులను చేయలేవని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి అల్ నసర్ జకారియా విమర్శించారు. ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి ఆలోచనలతో ప్రతి ఒక్కరు ఏకీభవించాల్సిన అవసరం లేదని ఎన్‌సిపి అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, జిల్లా అధికారులు అనుమతి ఇవ్వడానికి తిరస్కరించడం వల్ల గురువారం లక్నోలో ఒవైసీ పాల్గొనవలసి ఉండిన ఒక కార్యక్రమం రద్దయింది. శాంతి భద్రతల పరిస్థితి రీత్యా సభ నిర్వహణకు అనుమతి ఇవ్వలేదని అదనపు జిల్లా మేజిస్ట్రేట్ (పశ్చిమ) జె.ఎస్.దూబే తన ఆదేశాలలో పేర్కొన్నారు. కాగా, సభకు అనుమతి ఇవ్వకపోవడం పట్ల ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై ఎంఐఎం ధ్వజమెత్తింది. మైనారిటీలకు ఏమీ చేయని సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వం ఒవైసీ అంటే భయపడుతోందని విమర్శించింది.