హైదరాబాద్

ఓం నమః శివాయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శివ నామస్మరణలతో నగరం ‘శివోహం’ ఘనంగా మహాశివరాత్రి పూజలు
శివాలయాలకు భక్తుల తాకిడి కిటకిటలాడిన కీసర జనంతో పోటెత్తిన కేశవగిరి
కిషన్‌బాగ్ శివాలయంలో అపశృతి..తెగి పడిన కరెంటు తీగ
భక్తులను కాపాడి.. కాన్టిసేబుల్ మృతి

హైదరాబాద్, మార్చి 7: మహానగరం సోమవారం శివనామసర్మణలతో మారుమోగింది. మహాశివరాత్రి పర్వదినం..ఆపై సోమవారం కావటంతో నగరంలోని శివాలయాలు, శైవ క్షేత్రాలతో పాటు అన్ని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆదివారం అర్థరాత్రి నుంచే భక్తజనం పొటెత్తింది. సోమవారం తెల్లవారుఝామున ఆయా దేవాలయాల్లో ప్రారంభమైన ప్రత్యేక పూజల్లో శివభక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొని పూజాధికాలు నిర్వహించారు. శివపార్వతుల కళ్యాణం కనులారా వీక్షించి భక్తజనం భక్తపారవశ్యంలో మునిగితేలారు. ఉపవాసదీక్షల్లో ఉన్న కొందరు ఉదయం నుంచి సాయంత్రం వరకు దేవాలయాల్లోనే గడిపి, సాయంత్రం అయిదుగ గంటల తర్వాత దేవాలయాల్లోనే ఉపవాసదీక్షలను విరమించారు. ముఖ్యంగా శివారులోని నాగోల్‌లోని శ్రీ కాశీవిశే్వశ్వరాలయం, కీసరలోని శ్రీ రామలింగేశ్వరదేవాలయం, భోలక్‌పూర్‌లోని భవానీ శంకర దేవాలయం, ముషీరాబాద్‌లోని గౌరీశంకరాలయం, పాతబస్తీలోని కేశవగిరి, విద్యానగర్‌లోని శివం, శంకరమఠం వంటి శైవ క్షేత్రాలు, శివాలయాలు ప్రత్యేకంగా ముస్తాబయ్యాయి. సాయంత్రం దీక్షలు విరమించే సమయంలో ఈ దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. రద్దీని నియంత్రించేందుకు నిర్వాహకులు బారికేడ్లను ఏర్పాటు చేసి ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందిని నియమించారు. కాగా, ఇటీవలే నూతన జిహెచ్‌ఎంసి పాలక మండలి ఏర్పాటు కావటంతో గ్రేటర్‌లో కొత్తగా గెలిచిన కార్పొరేటర్లు తమ డివిజన్లలోని దేవాలయాల వద్ధ భక్తులకు సౌకర్యాలు కల్పించటంలో ప్రత్యేక చొరవ తీసుకున్నారు. శివరాత్రి వైశిష్ట్యాన్ని చాటిచెప్పేందుకు గతంలో ఎన్నడూ లేని విధంగా పలు వ్యాపార, వాణిజ్య సంస్థలతో పాటు కార్పొరేట్ సముదాయాలు వినూత్న రీతిలో కార్యక్రమాలు నిర్వహించాయి. సోమవారం రోజునే శివరాత్రి పర్వదినం రావటంతో ప్రతి ఏటా ఉపవాసదీక్షలుండే వారితో పాటు నూతనంగా వేలాది మంది దీక్షలు స్వీకరించటం విశేషం. ముఖ్యంగా శివరాత్రి రోజున రాత్రి జాగరణ ఉండే భక్తుల కోసం పలు దేవాలయాల్లో ప్రత్యేక ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. కాగా, నగరంలోని పలు ధియేటర్లలో సెకండ్ షో తర్వాత అదనంగా రెండు మిడ్‌నైట్ షోలను అందుబాటులో ఉంచారు. వీటిలో కొన్ని ధియేటర్లు భక్తి, ఆధ్యాత్మిక ప్రధానంశాలైన సినిమాలను ప్రదర్శించగా, మరికొన్ని ధియేటర్లు కొత్త సినిమాలను ప్రదర్శించి వినోదానికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాయి.