హైదరాబాద్

తెదేపాకు ‘సాయన్న’షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికింద్రాబాద్, డిసెంబర్ 3: తెలుగుదేశం పార్టీకి కంటోనె్మంట్ ఎమ్మెల్యే సాయన్న షాక్ ఇచ్చారు. గురువారం సిఎం క్యాంపు కార్యాలయంలో కెసిఆర్‌ను కలిసిన అనంతరం బయటికి వచ్చి మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గ అభివృద్ధికి టిడిపిని వీడి తెరాసలో చేరుతున్నట్లు ప్రకటించారు. తెలుగుదేశం పార్టీకి నమ్మిన బంటుగా ఉన్న సాయన్నకు తెలంగాణ నుంచి టిటిడి బోర్డు మెంబర్‌గా చంద్రబాబునాయుడు నియమించారు. కంటోనె్మంట్ నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన సాయన్న.. పార్టీ మారుతారని ఎవరు ఊహించలేకపోయారు. ఎన్నికల ముందే సాయన్న తెరాసలోకి అగ్రనాయకత్వం ఆహ్వానించినప్పటికీ, సున్నితంగా తిరస్కరించి టిడిపి నుంచి పోటీకి దిగి గెలుపొందారు.
తలసాని, తీగల పార్టీని వీడిన సమయంలో సాయన్న వెళుతారని ఊహాగానాలు వచ్చినప్పటికీ.. సాయన్న మాత్రం ఆలాంటి ఏమిలేదని కొట్టిపారేయడంతో టిటిడి బోర్డు సభ్యుడిగా నియమించారు. అంత సవ్యంగా ఉందనుకుంటున్న తరుణంలో గ్రేటర్ ఎన్నికలకు నగరా మోగే సమయంలో సాయన్న గ్రేటర్ టిడిపికి షాక్ ఇచ్చారు. సాయన్న పార్టీని వీడడంతో నష్టమేమి లేదని తెదేపా నేతలు బయటికి చెబుతున్నప్పటికీ.. నగరంలో సీనియర్‌లుగా ఉన్న నేతలు ఇలా ఒక్కొక్కరు సైకిల్ దిగి కారు ఎక్కుతుండడంతో క్యాడర్‌లో సైతం కలవరం మొదలైంది. సాయన్న పార్టీకి ఎందుకు గుడ్‌బై చెప్పారో తెలియక తికమక పడుతున్నారు. పార్టీలో సౌమ్యుడుగా వివాదాలకు దూరంగా ఉండే సాయన్న ఏ ఒక్కరికో అనుకూలం కాకుండా గ్రూపులకు దూరంగా చిన్నపెద్ద అందరితో సఖ్యతగా మెలిగేవారు. ఎన్నికలకు ముందే సాయన్నను తెరాసలోకి లాగడానికి నాయకత్వం తీవ్రంగా ప్రయత్నించినప్పటికి ఆయన టిడిపిని వీడడానికి ససేమిరా అని పొటీ చేసి గెలిచారు. అనంతరం వచ్చిన కంటోనె్మంట్ బోర్డు ఎన్నికల్లో కనీసం తన కూతురిని సైతం గెలిపించికోలేకపోయారు. టిడిపికి అనుకూలంగా ఉండే ఓటర్లు ఒక్క వార్డు మెంబర్ సైతం గెలుపొంద లేకపోయారు. అదే సమయంలో సాయన్న పార్టీ మారుతారన్న ప్రచారం కూడా జరిగింది. టిటిడి బోర్డు మెంబర్‌గా నియమించినప్పటికీ సాయన్న.. పార్టీ కార్యక్రమాల పట్ల అంటిముట్టనట్లుగానే ఉంటూ వచ్చారు. తీరా గ్రేటర్ ఎన్నికల సమయంలో తెరాస అధినాయకత్వం టిడిపి కార్యకర్తలను ఆలోచనలో పడేస్తూ మరో ఎమ్మెల్యే సాయన్నను పిలిచి కారు ఎక్కించుకున్నారన్న వార్తలు వినపడుతున్నాయి. కంటోనె్మంట్ టిడిపి కార్యకర్తలు మాత్రం తాము టిడిపితోనే ఉంటున్నామని, సాయన్న పార్టీని వీడడం ఆయన వ్యక్తిగతమని, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, టిటిడి బోర్డు మెంబర్‌గా నియమించినప్పటికీ ఇప్పటికి ఇప్పుడు ఆయనకు పార్టీలో జరిగిన నష్టం ఏమిలేకపోయినప్పటికీ తన స్వార్థప్రయోజనాల కోసం వెళ్లారని తీవ్రంగా దుయ్యబడుతున్నారు. రాజకీయ జన్మను ప్రసాదించిన కన్నతల్లిలాంటి పార్టీకి ద్రోహం చేసిన వారిని ప్రజలు తగిన విధంగా బుద్దిచెబుతారని కార్యకర్తలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. గురువారం నగరంలో ఏ రాజకీయపార్టీలో చూసినా సాయన్న చర్చనే ప్రధానంగా కనిపించింది.

ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినంత మాత్రాన టిడిపికి నష్టం లేదు

సికింద్రాబాద్, డిసెంబర్ 3: తెరాస అరాచకాలకు అంతులేకుండా పోయిందని నగర టిడిపి అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ పేర్కొన్నారు. గురవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంతలో పశువులను కొనుగోలు చేసినట్లు బేరసారాలు సాగిస్తూ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని మాగంటి తీవ్ర స్థాయిలో తెరాసపై మండిపడ్డారు. గ్రేటర్‌లో క్యాడర్‌లేని తెరాసకు ఎన్నికల్లో విజయం సాధించడానికి చేయని అక్రమాలే లేవని అన్నారు. నిజాయితీ, నైతిక విలువల కోసం మాట్లాడే సిఎంకు వాటి అర్థం సైతం తెలియదని అన్నారు.
తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను అనైతికంగా పార్టీలోకి ఆహ్వానించడం ఎంతవరకు సమంజసమని అన్నారు. వలస వచ్చిన నేతలతో పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామాలు చేయించాలని అన్నారు. మా పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను మీ పార్టీలో ఎలా కొనసాగిస్తారని ప్రశ్నించారు. గడిచిన 18 నెలల కాలంలో తెలంగాణలో ఎంత అభివృద్ధి జరిగిందని ప్రశ్నించారు. నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్నారని చెబుతున్న సాయన్నకు అభివృద్ధి ఎక్కడ జరిగిందో తెలియదా అని అన్నారు. కుంటిసాకులు చూపడం సరికాదని, టిటిడి బోర్డు సభ్యుడిగా సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వరస్వామి ముందు ప్రమాణం చేసి మాట తప్పిన సాయన్న మూల్యం చెల్లించక తప్పదని అన్నారు. కంటోనె్మంట్ ప్రజలు నమ్మి ఓట్లు వేస్తే నేడు వారి అభివృద్ధి కోసమని చెబుతూ పార్టీ మారడం సిగ్గుచేటని అన్నారు. కంటోనె్మంట్ నియోజకవర్గ ప్రజలు సాయన్నను పార్టీ మారమని పురమాయించారా? బ్రతిమిలాడారా? అని మాగంటి ప్రశ్నించారు. తమ స్వార్థప్రయోజనాల కోసం పార్టీలు మారుతున్న నేతలకు ప్రజలు రాబోయే కాలంలో తగిన బుద్ధి చెబుతారని మాగంటి పేర్కొన్నారు.

భామా కలాపం నవరసాల సుధాకలశం

హైదరాబాద్, డిసెంబర్ 3: 3వ శతాబ్దంలో నందికేశ్వరుని అభినయ దర్పణం తెలుగులో రాయబడిందని, నాగార్జున కొండలలోని శిల్పాల నాట్య భంగిమలతోను, 10వ శతాబ్దంలోని విజయాదిత్యుని కాలంలో నృత్యవిద్య ఉందని, ఆనాటి దేవాలయాల్లోని నాట్య శిల్పాల ఆధారంగా ఆ కాలంలోనే నృత్య కళ ఉందని విశదమవుతోంది అని తమిళ రాష్ట్రంలోని ప్రముఖ నాట్యాచారిణి, సినీ నటి నవీనా నటరాజన్ అన్నారు. గురువారం జూబ్లీహిల్స్‌లోని నటరాజ కళామందిరంలో ఆమె భామా కలాపం గురించి ఉపన్యాస సహిత నృత్యాన్ని ప్రదర్శించింది. ఈ సందర్భంగా నవీన మాట్లాడుతూ భామాకలాపం నవరసాల సుధాకలశం అన్నారు. 13వ శతాబ్దంలో సిద్దేంద్రయోగి నృత్యంపై విశేష పరిశోధన చేశారని, అందులో భాగంగా భామా కలాపం ప్రత్యేకంగా ప్రజాధరణ పొందిందని ఆమె చెబుతూ ‘్భమనే సత్య భామనే...’ అంటూ నృత్యంచేసి ఈ వాక్యంలో సత్యభామ గర్వం, అహంకారంను నర్తకి ముఖరవళిలోను, హస్తపాద విన్యాసంలోను ప్రదర్శించింది. భామా కలాపంలో సత్యభామ అహంకారంతోపాటు తదుపరి వ్యాఖ్యాలలో విరహ వేధన, బాధను చెప్పుకుంటోంది. ఈ అంశం తెలుగు సంస్కృతి పదాలతో మిళితమైన సాహిత్యం కన్పిస్తోంది. ఈ భామా కలాపంలో కృష్ణుడు, సత్యభామ, మదనిక అనే మూడు పాత్రలు కన్పిస్తాయి. ఈ మూడు పాత్రలను తన అభినయంలో నవీన ప్రదర్శించింది. తన స్వామి ఎక్కడున్నాడో వేదికి చెప్పండి అంటూ తన స్వామి గుర్తులు చెబుతూ శంఖు, చక్రాలు ధరించినవాడు, నెమిలి పింఛము ఉన్నవాడు అని తన అభినయంలో ఆ స్వామిని వర్ణిస్తుంది. ఆతని పేరు చెప్పమన్నప్పుడు ‘సిగ్గాయనే భామ సిగ్గాయనే...’ అంటూ అభినయంలో సత్యభామ సిగ్గుపడే అంశాలను ప్రదర్శించింది. విరహాన్ని ప్రదర్శించడంలోను, ఆనందంతో చిందులు వేయడంతోను, స్వామి వస్తున్నారని తెలిసి తన ఆనందాన్ని అభినయంలో ప్రదర్శించిన తీరును నవీన అభినయంలో చక్కగా ప్రదర్శించిందని ప్రేక్షకులు ప్రశంసించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన విశ్రాంత ఐఎఎస్ అధికారి చంద్రశేఖరరావు నర్తకి నటరాజన్‌ను సత్కరించి జ్ఞాపికను, లక్షరూపాయల చెక్కును అందజేశారు. మూడు గంటలపాటు సాగిన ఈ కార్యక్రమం మూడు గంటలపాటు ప్రేక్షకులకు కనువిందు చేసింది.