ఉత్తరాయణం

హడావుడి తాత్కాలికమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంత్రి గంటా శ్రీనివాసరావు రైతు బజార్లు, మార్కెట్లను చుట్టేసి హడావిడి చేసి కృత్రిమ పద్ధతుల్లో పండ్లను మగ్గపెట్టేవారిపై చర్యలు తీసుకున్నారు సరే. కాని అవి తాత్కాలికమే అయ్యాయ. మళ్లీ అక్రమ వ్యాపారులు విజృంభిస్తున్నారు. పాత విధానంలోనే పండ్లను మగ్గపెట్టడం కొనసాగిస్తున్నారు. దయచేసి మంత్రివర్యులు తాత్కాలిక ప్రాతిపదికన కాకుండా తీసుకున్న చర్యలు శాశ్వతంగా ఉండిపోయేకా చూడాలి. అప్పుడే ప్రజలకు మేలు జరుగుతుంది.
- పట్టిసపు శేషగిరిరావు, విశాఖపట్టణం

నిజం చెప్పేవారు నేడు అవసరం
చరిత్రను విస్మరించవద్దు శీర్షికన గౌరుగారి గంగాధర రెడ్డిగారు చాలా మంచి విషయాలు చెప్పారు. నిజం చెప్పే ఇటువంటివారు నేటికాలంలో చాలా అవసరం. బీజాపూర్ సుల్తాన్, ఔరంగజేబ్‌లను ఎదిరించినందుకు ఛత్రపతి మతోన్మాది. అబద్ధాల చరిత్రకారుల వల్ల గొప్పవాడిగా ప్రస్తుతించబడ్డవాడు అక్బర్. ఇతడు ‘వివాహ జిహాద్’ ప్రక్రియ ద్వారా నాటి హిందూ రాజులను హడలెత్తించాడు. అతనిపై పోరాడిన రాణా ప్రతాప్‌ను దారిదోపిడి దొంగగా కూడా ప్రకటించే చరిత్రకారులున్న దౌర్భాగ్యదేశం మనది. ఆశ్రయం అడిగి, పొంది నాటి హిందూ రాజులను నాశనం చేసిన వాస్కోడిగామా పేర్న ఇప్పటికీ ఒక నగరం ఉండడం మన జాతికి ఉన్న ఉదాశీనతకు నిదర్శనం. ‘మేల్కొటే’ నంబూద్రీలకు దీపావళి లేకుండా చేసిన మతోన్మాది టిప్పు సుల్తాన్ మన జాతీయ వీరుడు! అతడికి లేని లక్షణాలను అతికించి ప్రచారం చేయడం ఈ దేశ మీడియా స్వేచ్ఛ! ఈ దేశంలో నిజమైన అల్పసంఖ్యాక మతస్థులు బౌద్ధులు, జైనులు. వారికి అందాల్సిన అనేక రాయతీలను మైనారిటీల ముసుగులో అన్య మతస్థులు పొందడం దేశ పాలనా వ్యవస్థ గొప్పతనం. నిజాలు చెప్పి భారతీయులను మేలుకొలిపే ఏ ప్రయత్నమైనా మైనారిటీ వ్యతిరేక చర్యే. ఇంత దారుణమా! ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇటువంటి దౌర్భాగ్య వ్యవహార శైలి కనిపించదు. మెజారిటీ మతాలవారిని దృష్టిలో పెట్టుకొని ప్రజాస్వామ్య దేశాల్లో చట్టాలు రూపొందిస్తారు. మనది అందుకు పూర్తి విరుద్ధం.
- పి.ఆర్.వి.ఎస్. ఆచార్యులు, నక్కపల్లి, విశాఖపట్టణం

పంచగవ్యాల పరమావధి
ఎనభై నాలుగు లక్షల జీవరాసులలో బ్రహ్మ సృష్టించని పరదేవత, యజ్ఞకుండం నుండి ఆవిర్భవించిన జీవి గోమాత ద్వారా లభించే క్షీరము, దధి, ఘృతము, మూత్రము, గోమయములనబడే పంచగవ్యలను వివిధ పద్ధతుల ద్వారా సేవించడం వల్ల సమస్త శారీరక వ్యాధులను నివారించవచ్చునని అనేక పరిశోధనలు నిరూపించాయ. వీటితోబాటు శారీరక, మానసిక వ్యాయామాలు, భోజనాది క్రతువుల నియమాలను తుచ తప్పక పాటించినట్లయతే ఆరోగ్యం శుభప్రధమవుతుందని ఆయుర్వేద వైద్యులు తెలియజేస్తున్నారు. ఆధునిక ఆంగ్ల వైద్యశాలలో అనేక పరిక్షలకు, సూదుల, గుళికల మందులకు అధికంగా ధనవ్యయం అవడమేగాకుండా వ్యాధులు సంపూర్ణంగా నివారించబడటంలేదు. పంచగవ్యములు, ప్రకృతి మూలికల ప్రయోజనాన్ని ప్రభుత్వం ప్రజలు గుర్తించాలి. వంటింట్లోని పోపుల డబ్బాని మించిన వైద్యశాల మరొకటి లేదని మన అమ్మమ్మలు ఏనాడో నిరూపించిన వాస్తవాన్ని కూడా మరువకూడదు.
- ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్