రివ్యూ

అదొక్కటే తక్కువైంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* శౌర్య (బాగోలేదు)

తారాగణం:
మంచు మనోజ్, రెజీన కసాండ్ర, బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్, సుబ్బరాజు, సుధ, ప్రభాస్ శీను, బెనర్జీ తదితరులు
సంగీతం:
కె వేద
నిర్మాత:
మల్కాపురం శివకుమార్
దర్శకత్వం:
దశరథ్

మోహన్‌బాబు వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మంచు మనోజ్‌కు పోటుగాడు తప్ప కెరీర్‌పరంగా పెద్ద ప్లస్‌లు లేవు. హిట్ కోసం ఇప్పటికీ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడు. యాక్షన్ సీన్లు వదిలేసి తనదైన ప్రతిభ చూపించేందుకు సాఫ్ట్‌గా సిద్ధమైన మనోజ్ కెరీర్‌కు -‘శౌర్య’ ఎలాంటి హెల్ప్ అవుతుందో చూద్దాం. దశరథ్ దర్శకత్వంలో రూపొందిన శౌర్యలో అందాల భామ రెజినా హీరోయిన్.
కథ :
ప్రతి సంఘటన వెనుక -మూడు కథలుంటాయన్న లైన్ బేస్ పాయింట్ చేసుకున్న సినిమా ఇది. కథలోకెళ్తే.. ఉన్నదాంతో హ్యాపీగా బతికే ఫ్యామిలీలో ఉంటాడు శౌర్య (మంచు మనోజ్). హీరోయిన్ నేత్ర (రెజీన)కు అట్రాక్ట్ అవుతాడు. సైలెంట్ చూప్తుల్లో ఇద్దరూ ప్రేమలో పడతారు. పెద్దవాళ్ల నుంచి వీళ్లకూ సమస్య వస్తుంది. వాళ్ల ఇబ్బంది తప్పించుకోడానికి వేరే దేశం వెళ్ళాలని నిర్ణయించుకుంటారు. ఏలాగూ దేశం వదిలేస్తున్నాం కనుక -చివరిగా శివరాత్రి జాగారం చేద్దామని నిర్ణయించుకుని దేవాలయానికి వస్తారు. ఉదయానికి నేత్రపై హత్యాయత్నం జరుగుతుంది. చావు బతుకుల్లో ఉన్న నేత్రని ఆస్పత్రిలో చేర్చి, నేత్ర గొంతు కోసింది తానేనని శౌర్య సరెండర్ అవుతాడు. అసలు సమస్య అక్కడే మొదలవుతుంది. శౌర్య ఎందుకు నేత్రని చంపాలనుకున్నాడు? ఫైనల్‌గా కేసుని కృష్ణప్రసాద్ (ప్రకాష్‌రాజ్) ఎలా సాల్వ్ చేసాడు? అన్నదే మిగతా సినిమా.
సినిమాలో మనోజ్ సాఫ్ట్ అండ్ ‘హెవీ వెయిట్’ రోల్ చేశాడు. పాత్ర కోసమే అలా మారానని చెప్పిన మనోజ్ మాటలు అర్థంకావు కనుక వదిలేద్దాం. యాక్షన్ సన్నివేశాలు వదిలేసి వైవిధ్యాన్ని ప్రదర్శించాడని చెప్పడం తప్ప, పాత్రను గొప్పగా చేశాడని మాత్రం చెప్పలేం. పాత్రకి తగినట్టు అనుకుంటే -ఓకే. మామూలుగా ఎనర్జిటిక్ పాత్రలు చేసే మనోజ్ ఈ సినిమాలో సైలెంట్ పాత్ర చేసి వైవిధ్యం అనిపించాడు. రెజీన పక్కా హోలీ గర్ల్‌గా కనిపించింది. గ్లామర్ డోస్ పక్కనపెట్టేసి నటనకి ప్రాధాన్యమున్న పాత్రలో మెప్పించింది. కథకు కీలకమైన పాత్ర చేసిన ప్రకాష్‌రాజ్ సినిమాకు కొంత బలాన్నిచ్చాడు. మిగిలిన పాత్రల్లో నాగినీడు, సుబ్బరాజు, నందు, శ్రవణ్, సత్యప్రకాష్‌లు ఫరవాలేదనిపించారు. బ్రహ్మానందం హాస్యం మరోసారి అట్టర్‌ఫ్లాప్ అయ్యింది.
ఫ్యామిలీ ఆడియన్స్‌ని టార్గెట్ చేసి సినిమాలు రూపొందించే దర్శకుడు దశరథ్ ఈసారి శౌర్యతో కొత్తదనాన్ని ప్రయత్నించాడు. అయితే సినిమాలోని మెయిన్ ప్లాట్, థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ గతంలో వచ్చిన కొన్ని సినిమాల్లోనివిలా తోస్తాయి. దశరథ్ లైన్ థ్రిల్ కలిగించేదే అయినా, బిగుతైన కథగా మలుచుకోవడంలో వైఫల్యాలు కనిపిస్తాయి. గోపీమోహన్‌తో కలిసి చేసిన కథ పెద్దగా ఆకట్టుకోదు. డైరెక్షన్ పరంగా దశరథ్ కెరీర్లోనే ఈ చిత్రం వీక్ అన్న భావన ఆదినుంచే కలుగుతుంది. ట్విస్ట్‌లతో కొన్ని సన్నివేశాలు వర్కవుటైనా, ఈ సన్నివేశం కూడా ఎంగేజింగ్‌గా అనిపించదు. మల్హర్ భట్ జోషి సినిమాటోగ్రఫీ కనువిందు చేయలేకపోయింది. వేద బాణీలు ఒకటి రెండు బావున్నాయి. నేపథ్య సంగీతమూ కొత్తగా ఏమీ లేదు. ఎస్‌ఆర్ శేఖర్ ఎడిటింగ్ ఓకే. నిర్మాత మల్కాపురం శివకుమార్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
రొటీన్‌గాకాకుండా ఏదోకటి కొత్తగా చేయాలనే ప్రయత్నంలో దశరథ్ తనకు తెలిసిన ప్రేమకథకి థ్రిల్స్‌ని యాడ్ చేశాడు. థ్రిల్స్ మీద దృష్టి పెట్టి లవ్ అండ్ ఎమోషన్స్‌ని వదిలేశాడు. ప్రీ క్లైమాక్స్ 20 నిమిషాలే ఆడియన్‌కి కొంచెం ఆసక్తి కలిగిస్తుంది.

-త్రివేది