బిజినెస్
ముంబయి, ఫిబ్రవరి 4: ఖాయిలా పరిశ్రమలకు కొత్త నిర్వచనం అవసరమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బిఐ) డిప్యూటీ గవర్నర్ కెసి చక్రబర్తి అన్నారు. ఇక్కడ ఎస్‌ఎమ్‌ఇ చాంబర్ ఆధ్వర్యంలో జరిగిన సదస్సుకు ఆయన హాజరయ్యారు. పరిశ్రమలు ఆర్థిక ఇబ్బందులకు గురై ఖాయిలా పడిన సమయంలో ఆ సంస్థ ఆ స్థితికి రావాడానికి గల కారణాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉందన్నారు.
స్వయంకృతాపరాధమైతే సాయం చేయడం వృధా అనే ధోరణిలోనే పైవిధంగా మాట్లాడగా, సంస్థ విలువ 50 శాతం కోల్పోతే ఖాయిలా పరిశ్రమగా భావిస్తున్నారని, 50 శాతం క్షీణిస్తే ఆ సంస్థ మరణించినట్లేనని అభిప్రాయపడ్డారు. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు బ్యాంకుల నుంచి తగిన సహకారం అందాలని, అన్ని బ్యాంకులు ఆ దిశగా సహకరించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.
Add new comment