క్రీడాభూమి

టైటిలే నా లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండోనేషియా ఓపెన్‌కు సిద్ధమైన షట్లర్ సింధు

న్యూఢిల్లీ, నవంబర్ 30: మకావూ ఓపెన్ గ్రాండ్ ప్రీలో వరుసగా మూడోసారి టైటిల్ కైవసం చేసుకొని, హ్యాట్రిక్ సాధించడం ఎంతో సంతోషంగా ఉందని, అదే విధంగా మంగళవారం నుంచి ప్రారంభమయ్యే డెన్మార్క్ ఓపెన్‌లోనూ టైటిల్ సాధించడమే లక్ష్యమని భారత స్టార్ షట్లర్ పివి సింధు పేర్కొంది. కాలి గాయం కారణంగా ఈ ఏడాది ఆల్ ఇంగ్లాండ్, ఇండియన్ ఓపెన్ వంటి మేజర్ టోర్నీలకు దూరమైన ఆమె మకావూ ఓపెన్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగి, ఫైనల్‌లో జపాన్ క్రీడాకారిణి మనాత్సు మితానీని ఓడించడం ఎంతో సంతృప్తినిచ్చిందని అన్నది. ఫిట్నెస్ సమస్య లేదన్న విషయం కూడా స్పష్టమైందని 20 ఏళ్ల ఈ హైదరాబాదీ పిటిఐకి ఫోన్ ద్వారా ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది. మితానీ చేతిలో పరాజయాలను ఎదుర్కొన్న సందర్భాలున్నాయని, ఇటీవలే జపాన్ ఓపెన్‌లో ఆమె చేతిలో ఓడానని సింధు గుర్తుచేసింది. మకావూలో ఆమెను ఓడించినందుకు ఎంతో ఆనందిస్తున్నానని తెలిపింది. మకావూ టోర్నీలో స్టేడియం ఆటకు అనువుగా లేదని, గాలి వీస్తున్నందున్న షటిల్‌కాక్ దిశను మార్చుకోవడం ఇబ్బందులు సృష్టించిందని వచ్చిన విమర్శలపై అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, అందులో నిజం లేకపోలేదని అన్నది. అయితే, ఫిర్యాదు చేయాల్సిన స్థాయిలో సమస్యలు రాలేదని తెలిపింది. అంతేగాక, సమస్య అందరికీ ఒకే రీతిలో ఉంటుందని వ్యాఖ్యానించింది. మితానీతో జరిగిన ఫైనల్‌లో రెండో సెట్‌లోనే విజయాన్ని నమోదు చేసి ఉండేదానినని సింధు తెలిపింది. అయితే, రెండు కీలక సమయాల్లో కాక్‌ను నెట్‌కు కొట్టడంతో సెట్‌ను కోల్పోవాల్సి వచ్చిందని చెప్పింది. కీలకమైన చివరి సెట్‌లో మళ్లీ ఫామ్‌లోకి వచ్చినందుకు సంతోషిస్తున్నానని తెలిపింది. గాయం వల్ల ఎదురైన సమస్యలను తప్పిస్తే ఈఏడాది సంతృప్తికరంగానే సాగిందని చెప్పింది. ఆస్ట్రేలియా, ఇండోనేషియా, చైనీస్ తైపీ టోర్నీల్లో రాణించలేక పోయినప్పటికీ, డెన్మార్క్ ఓపెన్‌లో ఫైనల్ వరకూ చేరిన విషయాన్ని గుర్తు చేసింది. అదే విధంగా మకావూలో టైటిల్ సాధించానని అన్నది. ఇండియన్ బాడ్మింటన్ లీగ్ (ఐబిఎల్)తో వచ్చే ఏడాదిని ఆరంభిస్తానని ఓ ప్రశ్నకు సమాధానం చెప్పింది.
పది లక్షల నజరానా
మకావూ ఓపెన్‌లో వరుసగా మూడోసారి విజేతగా నిలిచిన తెలుగు తేజం పివి సింధుకు భారత బాడ్మింటన్ సంఘం (బాయ్) పది లక్షల రూపాయల నగదు బహుమతిని ప్రకటించింది. దేశ కీర్తి ప్రతిష్ఠలను ఇనుమడింప చేసిన సింధు భవిష్యత్తులో మరిన్ని పతకాలను కైవసం చేసుకుంటుందని సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ధీమా వ్యక్తం చేసింది. (చిత్రం) పివి సింధు