శిప్ర వాక్యం

ఉత్పత్తి-కులవృత్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశంలో దారిద్య్రరేఖకు దిగువన సగానికిపైగా జనాభా వుంది. వారికి విద్య, ఉద్యోగం, ఉపాధి, ఆరోగ్యం, ధరల తగ్గింపు వంటి సౌకర్యాలు కావాలి. అందుకు రిజర్వేషన్లు ఒక పరిష్కారం అని పాలక వర్గాలు భావిస్తున్నాయి. కొన్ని కులాలకు మాత్రమే ఆ రక్షణ లభిస్తే మొత్తం జాతిలోని దరిద్రం సంపూర్ణంగా తొలగిపోదు. కొన్ని కుటుంబాలు మాత్రమే కొంతవరకూ లాభపడగలవు. హైదరాబాదులో గత ఏడాది డిసెంబర్ 3న తెలంగాణ ప్రభుత్వం ఒక సమావేశాన్ని నిర్వహించింది. అందులో వెనుకబడిన తరగతుల (బీసీ) రిజర్వేషన్ల గూర్చి చర్చించింది. ఈ వర్గాల్లో సంచార జాతులు, పారిశుద్ధ్య జాతులు, ఉత్పత్తి జాతులు ఉన్నట్లు వర్గీకరించారు. అయితే- వినోద రంగంలో ఉన్నవారు, పారిశ్రామిక జాతులు, విద్య- వైద్య వృత్తులలో ఉన్నవారు, రాజకీయ వర్గాలకు సంబంధించి ఎలాంటి వర్గీకరణ జరగలేదు.
1.వినోద జాతి: వీరు జానపద కళాకారులు. పటం కథలు, ఒగ్గు కథ, బుర్రకథ, హరికథ, వీధి నాటకాలు వంటివి వీరు ప్రదర్శిస్తూ ఉంటారు. ఇంకా టీవీ, చలనచిత్రం వంటి మాధ్యమాల ద్వారా తమ కళలను ప్రదర్శిస్తూ ఉంటారు.
2.సంచార జాతులు: వీరు స్థిరంగా ఒక చోట ఉండరు. భుక్తికోసం విభిన్న ప్రాంతాలకు వలసపోతూ వుంటారు. వీరిలో కూలీలు కూడా ఉంటారు.
3.ఉత్పత్తి జాతులు: వీరిది వస్తూత్పత్తి కావచ్చు, వ్యవసాయోత్పత్తి కావచ్చు.
4.పారిశుద్ధ్య జాతులు: వీరిలో వీధులు ఊడ్చేవారు, డ్రైనేజీ పనులు చేసేవారు, కుక్కులను పట్టుకొనేవారు, దోమల మందులు చల్లేవారు (మున్సిపల్ కార్మికులు) ఉంటారు.
5. విద్యారంగం: స్కాలర్‌షిప్‌లతో విద్యను అభ్యసించేవారు, రిజర్వేషన్ల సాయంతో ఉద్యోగాలు సంపాదించేవారు.
6.సేవారంగం: వైద్యం కావచ్చు, సమాజ సేవ కావచ్చు, అన్నదాన కేంద్రాలు కావచ్చు.
7.అక్షరసేన: వేటితో సంబంధం లేకుండా రచనా వ్యాసంగం చేస్తూ జీవించేవారు.
8.రాజకీయ వర్గాలు: ఎన్నికలలో పోటీ చేయటం, కార్యకర్తలుగా పనిచేయటం వంటివి.
9.న్యాయవాద వృత్తి,
10. వ్యాపార రంగం.
ఇలా చాలా వర్గాలను విభజించవచ్చు. అలాగే బ్రాహ్మణులలో- 1. పౌరోహిత్యానికి పరిమితమైనవారు 2.విద్యారంగం 3.సాహిత్య రంగం 4.కళారంగం ప్రసార ప్రచార మాధ్యమాలు 5.రాజకీయాలు 6.వ్యాపారం 7.వైద్యం, 8.వంటలు చేసేవారు. ఇతర శ్రామిక వృత్తులతో జీవించేవారు.
సారాంశం: బ్రాహ్మణుడే బ్రా హ్మణుడు అనే నిర్వచనం నేడు లేదు. వాచ్‌మెన్‌గాను, కూలీలుగాను బ్రాహ్మణులు పనిచేస్తున్నారు.
బ్రాహ్మ్యము కులమా? గు ణమా? అనే చర్చ గతంలోనూ జరిగింది. బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, రెడ్డి, కమ్మ, వెలమ వంటి కులాలకు రిజర్వేషన్లు లేవు. కాపులకు ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల 5 శాతం రిజర్వేషన్ ప్రకటించారు. ‘త్వ్రైవర్ణ్యులు’ అని చెప్పబడేవారిలో పెద్దసంఖ్యలో నిరుద్యోగ యువత ఉంది. తెలుగు రాష్ట్రాల్లో రెడ్డి,కమ్మ కులాలు, గుజరాత్‌లో పటేల్, కర్ణాటకలో లింగాయత్ వక్కళిగ వంటి వారిలో ఎక్కువమంది నిరుద్యోగులున్నారు. తమిళనాడులో సుప్రీం కోర్టు నిబంధనలకు విరుద్ధంగా 59 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. ఇవి కాక ముస్లింలు, ఇతర మైనారిటీలకు రిజర్వేషన్లు వివిధ రాష్ట్రాల్లో ఉన్నాయి. తెలంగాణలో 12 శాతం రిజర్వేషన్లను ముస్లింలకు కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించింది. ఇది రాజ్యాంగ విరుద్ధం. అంటే మత ప్రాతిపదికపై రిజర్వేషన్లు కోర్టు ముందు చెల్లవు. అప్పుడు క్రైస్తవ రిజర్వేషన్లు, బౌద్ధుల రిజర్వేషన్లు, పార్సీ రిజర్వేషన్లను కూడా అంగీకరింపవలసి వస్తుంది. ఈ కారణంగానే పంజాబ్‌లో సిక్కులు, ఆర్య సామాజికులు తాము మైనారిటీ వర్గానికి చెందినవారమని, తాము హిందువులం కాము అని చెప్పుకుంటున్నారు. కర్ణాటకలో లిం గాయత్‌లు తాము వేరే మతం అని వాదిస్తున్నారు. ఈ విధంగా మన దేశంలో రిజర్వేషన్ విధానం సమాజంలో కలతలు రేపుతోంది, విద్వేషాలకు దారితీస్తోంది. ఒక వ్యక్తి ఏకకాలంలో దళితుడిగాను, క్రైస్తవుడిగాను ఉంటూ రెండు ప్రయోజనాలు పొందుతున్నాడు. అంటే విదేశాల నుండి వచ్చే నిధుల కోసం కొందరు క్రైస్తవులం అని చెప్పుకుంటున్నారు. వీరికి ఆధార్‌కార్డు మీద ఒక పేరు, చర్చిలో మరొక పేరు ఉంటుంది- జనార్దన్ రెడ్డి, జాన్‌పాల్ రెడ్డి అన్నట్టుగా.
జనాభా పెరుగుదల, విదేశాల నుండి వలసలు, విద్యారంగం విస్తరించినట్లు ఉద్యోగావకాశాలు లేకపోవడం, ఆర్థిక వికాసం తగ్గటం.. వంటి చాలా కారణాలున్నాయి. మరోవైపుగ్రామీణ వృత్తివిద్యలు నశించాయి. అంటే కులవృత్తులకు దూరమై ఎంతోమంది ఉన్నత చదువుల పట్ల ఆసక్తి చూపుతున్నారు. ఉన్నత చదువులు పూర్తి చేసినవారందరికీ ఉద్యోగాలు రావడం లేదు. ఉద్యోగం రానివారు తిరిగి కులవృత్తులకు పోలేరు. దీంతో వారిలో తిరుగుబాటు ధోరణి మొదలవుతుంది.
కులవృత్తుల రక్షణ
బ్రాహ్మణులు సంప్రదాయ వైదిక వృత్తిని వదిలిపెట్టి వ్యాపారం చేసుకోవలసి వచ్చింది. ఆలయాల్లో పూజారి వృత్తికై ఇతర కులాలు పోటీ పడుతున్నాయి. అంటే- ఇక్కడ పూజకు ‘సాత్వికగుణం’ అనే అర్హత, సిద్ధాంతం పోయి ‘్ధనార్జనకు మార్గం’ అనే దృక్పథం వచ్చింది. అమెరికా వంటి సంపన్న దేశాలలో కూడా దరిద్రం డౌన్‌టౌన్స్‌లో తాండవమాడుతున్నది. దొంగతనం, వ్యభిచారం, డ్రగ్స్ వ్యాపారం వంటి అసాంఘిక కార్యకలాపాలతో అక్కడ కొందరు దరిద్రాన్ని జయించడానికి ప్రయత్నిస్తున్నారు. భారతదేశంలోనూ ఇలాంటి వికృత ధోరణులు మొదలైనాయి. నిన్నటివరకూ సొంత ఊరిలో గౌరవంగా బతికిన రైతు నగరానికి వచ్చి కూలీగా మారిపోయాడు. కులవృత్తుల, చేతివృత్తుల నిర్మూలన పర్యవసానమిది. ఒకడు చేతి మగ్గాలు నేస్తాడు. అతనికి పవర్‌లూం ఇచ్చి కాపాడవచ్చు. ఇలా వృత్తులను ఆధునీకరణం చేసుకోవచ్చు. పరిపాలన అనేది ధన సంపాదనకు మార్గం కావడంతో దానివైపు అన్నివర్గాలు ఆశపడుతున్నాయి. ఆర్ష వర్గ నిర్మూలనలో భాగంగా గతంలో బ్రాహ్మణ వ్యవస్థపై తిరుగుబాటు జరిగింది. దీనిని ఆర్య సామాజికులు కూడా ప్రోత్సహించారు. కమ్మ పురోహితులు 1940లో కృష్ణా జిల్లాలో వచ్చారు. ఇపుడు దళిత పురోహితవర్గం వచ్చింది. ఆలయార్చనకు సత్వగుణం ప్రధానం. మాంసం తినేవారు దైవ సన్నిధిలో నిజమైన అర్చకులు కాగలరా?

- ప్రొ. ముదిగొండ శివప్రసాద్ ఫోన్: 040- 2742 5668