శిప్ర వాక్యం

ఆర్థిక నేరాలకు అంతం ఎపుడు..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రక్షణ రంగంలో అవినీతి జరిగితే ఆ విషయాలు ఎవరి దృష్టికీ వచ్చే అవకాశాలు ఉండవు. కారణం రక్షణ వ్యవహారాలన్నీ ‘గోప్యం’గా ఉంటాయి. దీంతో బోఫోర్స్ శతఘు్నల కొనుగోలు నుండి జలాంతర్గాముల కొనుగోళ్ల వరకూ రక్షణశాఖలో వేల కోట్ల రూపాయల అవినీతి వ్యవహారాలు జరిగాయి. యూపీఏ హయాంలో బోఫోర్స్, అగస్టా కుంభకోణాలు, ఇపుడు ఎన్డీఏ ప్రభుత్వంలో ‘రాఫెల్ ఒప్పందం’ సంచలనాత్మకంగా మారాయి.
జవహర్‌లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు కె.కృష్ణమీనన్ రక్షణమంత్రిగా వ్యవహరించారు. అప్పుడు జీపుల కొనుగోలు కుంభకోణంలో ఆయన ఇరుక్కున్నాడు. రక్షణశాఖకు నాసిరకం జీపులు కొన్నట్లు ఆరోపణలు వచ్చినా, కృష్ణమీనన్‌ను నెహ్రూ వెనుకేసుకొని వచ్చాడు. కృష్ణమీనన్ వామపక్ష భావాలు కలవాడు కావడంతో ఆయనపై ఆనాడు కమ్యూనిస్టులు ఈగ వాలనివ్వలేదు. కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ హవా ప్రారంభమయ్యాక అవినీతి బాగోతాలు ఎక్కువయ్యాయి. ప్రతి కుంభకోణంలోనూ తెరవెనుక ఒక ఇటలీ బ్రోకర్ ఉండేవాడు. మొన్నటి ఖత్రోచి నుండి నేటి మైఖేల్ క్రిష్టియన్ వరకు బ్రోకర్లు ఇటలీకి చెందినవారే. అగస్టా హెలికాప్టర్ల కుంభకోణంలో జరిగిన అవకతవకలకు సంబంధించి విదేశీ కోర్టు తమ పౌరులకు శిక్ష విధించింది. ఈ సందర్భంగా ‘సిగ్నోరా గాంధీ’ పేరు వెలుగులోకి వచ్చింది. ‘సిగ్నోరా’ అంటే ‘శ్రీమతి’ అని ఇటలీ భాషలో అర్థం. ఈ మొత్తం కుంభకోణానికి ఆమె చోదకశక్తి అని మైఖేల్ పేర్కొన్నాడు. దుబాయిలో ఉన్న ఆయనను ఈ ఏడాది జూలై 18న అరెస్టు చేశారు. అంతర్జాతీయ నియమాల ప్రకారం అతడిని ఇండియాకు రప్పించే ప్రయత్నాలు మొదలైనాయి.
మైఖేల్ క్రిస్టియన్ రాసిన ‘నోట్’లో ప్రణబ్ ముఖర్జీ, వీరప్ప మొయిలీ, సోనియా గాంధీ, అహ్మద్ పటేల్ వంటి సీనియర్ కాంగ్రెస్ నాయకుల పేర్లు ఉన్నాయి. కొంతమంది కాంగ్రెస్ నేతలకు 8 శాతం కమీషన్ల పేరిట భారీగానే నిధులు అందాయట! మైఖేల్ తరఫున వాదించిన మహిళా న్యాయవాది మాట్లాడుతూ పెద్దచేపలను వదిలేసి, మధ్యదళారీలను పట్టుకున్నారు అన్నట్టు ఆమె అభిప్రాయపడింది. ఈ ముడుపులకు సంబంధించి ఒక్క రూపాయి కూడా ఇండియాకు చేరలేదు. విదేశాల్లో ఎవరెవరో బీనామీ వ్యక్తుల పేర్లమీద ఆయా విదేశీ బ్యాంకుల్లోనే జమ చేశారట! ఈ విషయాల్లో కొన్నింటిని ఇటలీ కోర్టు నిర్ధారించింది. కోర్టు వ్యాఖ్యలకు సోనియా, అహ్మద్ పటేల్ ఏం సమాధానం చెపుతారు? ఈ కుంభకోణంలో ఎయిర్ ఫోర్స్ మాజీ అధిపతి త్యాగి, ఆయన కుమారుల పేర్లు కూడా ఉన్నాయి. త్యాగి తిన్న డబ్బు ఎంత? రాజకీయ నాయకులకు ఇచ్చింది ఎంత? అని కొందరు ప్రశ్నించినా ఫలితం లేకుండా పోయింది. ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరాలు దాటినా ఒక్క నిందితుడు కూడా జైలుకుపోలేదు.
ఫోనిక్స్ మెకానికా సంస్థకు లండన్‌లో ఆఫీసు ఉంది. మిఖేల్ క్రిస్టియన్ తన కార్యకలాపాలు లండన్ నుండి నిర్వహించినట్లు తెలుస్తున్నది. లండన్‌లో రాహుల్ గాంధీకి ఒక విలాస భవనం గిఫ్టుగా ఇవ్వబడిందని, దానినే ‘లండన్ హౌస్’గా పిలుస్తారని ఇతర పార్టీల వారు చెబుతుంటారు. ఇందుకు సంబంధించిన కొన్ని వివరాలు లోగడ వెలుగులోకి వచ్చాయి. ఆ భవనంలో గదులను అలంకరించేందుకు విదేశాల నుంచి సామగ్రిని రాహుల్ గాంధీ తెప్పించుకున్నట్లు కొన్ని ఆడియో టేపులు దొరికాయి. ఆ భవంతికి, తనకు ఎటువంటి సంబంధం లేదని రాహుల్ అనలేని పరిస్థితి నెలకొంది.
యుపీఏ ప్రభుత్వ హయాంలో ఆర్థిక, హోం శాఖలను నిర్వహించిన చిదంబరంపై సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేసింది. నియమ విరుద్ధంగా ఆయన తన కుమారుడు కార్తీ చిదంబరానికి నిధులు కేటాయించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇదంతా ఎన్డీఏ సర్కారు కక్షసాధింపు చర్య అంటూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ వంటివారు చిదంబరాన్ని వెనుకేసుకొని వచ్చారు. ఈ వ్యవహారంపై నిజనిజాలను న్యాయస్థానమే తేలుస్తుంది. 2006లో మలేషియాకు చెందిన ఎయిర్‌సెల్ మాక్సిస్‌తో చిదంబరం ఒప్పందం కుదుర్చుకున్నారు. దీని విలువ రూ. 3200 కోట్లు. ఐతే ఆ మొత్తాన్ని 180కోట్లుగా చూపారు. అది జరిగిన కొద్దికాలానికే క్విడ్‌ప్రోకో పద్ధతిలో కార్తీ చిదంబరానికి 90 లక్షలు ముట్టాయట! ఈ మొత్తం వ్యవహారం కేంద్ర ఫైనాన్సియల్ కమిటీ దృష్టికి రాకుండానే చిదంబరం ఆమోదించారు. చిదంబరంపై సీబీఐ చార్జిషీటు దాఖలు చేసినప్పటికీ ఆయన ఒక పాత్రధారి మాత్రమే. సూత్రధారులైన పెద్ద చేపలు చాలా ఉన్నాయి. చిదంబరం ముందస్తు బెయిల్ తీసుకొని ఇప్పటివరకు తప్పించుకున్నాడు. లోక్‌సభలో పాలకపక్షంపై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టిన రోజునే ఈ అవినీతి కుంభకోణం వెలుగులోకి వచ్చింది. అందువల్ల దీనిని కాంగ్రెస్ పార్టీ కక్షసాధింపుచర్యగా అభివర్ణించింది.
ఫ్రాన్స్‌కు చెందిన రాఫెల్ ఎయిర్‌జెట్‌ల కొనుగోళ్ల కుంభకోణంలో 130 లక్షల కోట్లు అనిల్ అంబానీకి ముట్టాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. రాఫెల్‌తో అంగీకారం జరిగింది ఎన్‌డీఏ హయాంలోనే అయినా ఒప్పందం మాత్రం యుపీఏ కాలంలో జరిగింది. ఈ ఏడాది ఆగస్టులో బోయింగ్ నేవీ రక్షణవ్యవస్థకు సంబంధించి యుపీఏ హయాంలో అవకతవకలు జరిగాయన్న వార్త వెలుగులోకి వచ్చింది. ఇది రూ. 10 వేల కోట్లకు సంబంధించినది. 17 మంది టెండర్లు వేయగా స్పానిష్ కంపెనీకి- ముడుపులకు ఆశపడిన కొందరు కాంగ్రెస్ నేతలు ఈ కాంట్రాక్టు ఇప్పించారన్నది ఆరోపణ. ఇది కక్ష సాధింపుచర్య అని కాంగ్రెస్ ప్రతినిధులు ఎదురుదాడికి దిగారు.
ఇక, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 53,039 కోట్ల కేంద్ర నిధులకు సంబంధించిన ఎకౌంట్లలో గోల్‌మాల్ చేశారని బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు ఆరోపించారు. ఇది అబద్ధం అని తెలుగుదేశం వర్గాలు ఖండించాయి. ‘హరిత హారం’ పేరిట మొక్కలు నాటే కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వం 3000 కోట్లు దుబారా చేసిందని కాంగ్రెస్, కమ్యూనిస్టు నేతలు ఆరోపించారు. ఈ విమర్శలు తెలంగాణ అభివృద్ధి నిరోధక చర్యలు అని టిఆర్‌ఎస్ కొట్టిపారేసింది.
ఫ్రాన్స్‌తో భారత్ చేసుకున్న రాఫెల్ జెట్ ఫైట్ల ఒప్పందం ఒక్కసారి వార్తల్లోకి రావటానికి కారణం ఏమిటి? మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అగస్తా చాపర్ కొనుగోళ్ళ అక్రమాలను తెరమీదికి తెచ్చింది. అందులో మైకేల్ క్రిస్ట్ఫర్ అనే దళారిని దుబాయ్‌లో అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన ముడుపులు సోనియా గాంధీకి పరోక్షంగా చేరాయనేది ఆరోపణ. దానికి ప్రత్యామ్నాయంగా రాహుల్ గాంధీ రాఫెల్ ఒప్పందం బయటపెట్టాలని ఇటీవల లోక్‌సభలో పట్టుపట్టాడు. రాఫెల్ ఒప్పందం ప్రాథమిక దశ యుపిఎ కాలంలోనే జరిగింది. అప్పుడు ఎ.కె.ఆంటోనీ రక్షణమంత్రి. ఆ అధికార పత్రాన్ని ప్రస్తుత రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో జరిగిన అవిశ్వాస తీర్మాన చర్చ సందర్భంగా బయటపెట్టారు. ఇంతకూ ఇందులో జరిగిన అవకతవకలేమిటి? హిందూస్థాన్ ఏరోనాటిక్స్‌కు కాకుండా ఒక వ్యక్తికి లాభం కలిగేటట్లు ఒప్పందం జరిగిందన్నది ఆరోపణ. ఈ మొత్తం 45వేల కోట్లు. కొనుగోలు చేసిన ఫైటర్ విమానాల సంఖ్య 36. తొలి ఒప్పందం 2008లో జరిగింది. ఇందుకు సంబంధించిన సాంకేతికాంశాలకు గోప్యతను వర్తింపచేయాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు పేర్కొన్నారు. అలాంటిది ఏమీలేదని తనతో ఫ్రాన్స్ అధ్యక్షుడు చెప్పినట్లు రాహుల్ గాంధీ పార్లమెంటులో అన్నారు. రాహుల్ మాటలు సభాహక్కుల ఉల్లంఘన కిందికి వస్తుంది.
ఆర్థిక నేరాలు అనగానే బోయింగ్ నేవీ, బోఫోర్స్, 2-జీ స్పెక్ట్రం, బొగ్గు గనులు, రాఫెల్ వంటి కుంభకోణాలు గుర్తుకువస్తాయి. జూలియస్ అసాంజే లికీలీక్స్, పనామా పత్రాలు జ్ఞాపకానికి వస్తాయి. హైదరాబాద్‌లో కొన్ని కార్పొరేట్ సంస్థలు తమ అస్తిత్వం కోసం ప్రభుత్వానికి మామూళ్లు ఇవ్వటం కూడా ఆర్థిక నేరమే. చర్చిలో పసి పిల్లలను నన్స్ అమ్మటం ఆధ్యాత్మిక నేరం. విరాళాలను భారీగా రాజకీయ పార్టీలు సేకరించటం ఆర్థిక నేరమే. దిల్లీ సీఎం కేజ్రీవాల్ నీతులు చెప్పటంలో మొనగాడు. ఆయన తన పార్టీ (ఆప్)కి విదేశాల నుండి వచ్చిన నిధులకు లెక్కలు చూపలేదు. ఇదేమని అడిగితే తనపై కేంద్రం కక్షసాధింపుచర్యలను చేస్తున్నదని అంటున్నాడు. *

-ప్రొ.ముదిగొండ శివప్రసాద్