శిప్ర వాక్యం

మోదీజీ.. ‘సత్వర చర్యల’కు సిద్ధం కండి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవల కర్నాటకలోని జయనగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి మునిరెడ్డి విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆ ఉపఎన్నిక ప్రచారం సందర్భంగా- ‘విభేదాలన్నీ విస్మరించి ముస్లింలంతా మూకుమ్మడిగా ‘హస్తం’ గుర్తుకు వోట్లు వేసి, మతతత్వ భాజపాను ఓడించాలి..’ అంటూ పిలుపునిచ్చారు. సరిగ్గా.. అలాగే ముస్లింలంతా కాంగ్రెస్‌కు అండగా నిలిచారు. ‘హిందువులారా మీరంతా ఏకమై.. మతతత్వ ముస్లిం లీగ్ బలపరిచిన కాంగ్రెస్‌ను ఓడించండి’ అని భాజపా అనకూడదు. ఎందుకంటే రాహుల్ ‘సెక్యులర్’, మోదీ ‘కమ్యూనల్’.. ఇదీ నిర్వచనం.
ఇంతకూ ‘సెక్యులర్’ అంటే ఏమిటి? సర్వధర్మ సమభావన. భారత్‌లో పార్సీ మతస్థులకు ఆశ్రయం లభించింది. ప్రపంచమంతా యూదులను తరిమివేస్తే భారత్‌లో నేటికీ ‘ఓల్డ్ టెస్ట్‌మెంట్’ పారాయణ చేసేవారు కోట్లమంది ఉన్నారు. పాకిస్తాన్‌లో ముస్లిం మహిళలకు ప్రాథమిక హక్కులు లేవు. కానీ, మన దేశంలో జకీర్ హుస్సేన్, అబ్దుల్ కలాం, అన్సారీ వంటి ముస్లిం నేతలెందరో ఉన్నత పదవులు అధిష్ఠించారు. చైనాలో ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడుతున్న విద్యార్థులను అక్కడి సైనిక ప్రభుత్వం కాల్చి చంపింది. భారత్‌లో కమ్యూనిస్టులు ఒకవైపు ప్రజాస్వామ్య ఫలాలను అనుభవిస్తూ, మరొకవంక సమ్మెలు, ఆందోళనలు, విధ్వంస కలాపాలు జరుపుతున్నారు. మనదేశంలో ముస్లింలు పాతిక కోట్లమంది ఉన్నారు. వారికి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. మైనారిటీ కోటా కింద ప్రత్యేకంగా విద్య, ఉద్యోగావకాశాలున్నాయి. కానీ- పాకిస్తాన్, బంగ్లాదేశ్, సౌదీ అరేబియా, దుబాయి, టర్కీల్లో హిందువులకు స్వేచ్ఛగా వోటు వేసే హక్కు ఉందా? కనీసం పాకిస్తాన్‌లో జీవించే హక్కు ఉందా? వందలాది అమాయకులను హతమార్చిన నరహంతకుడిని పాతికేళ్లు విచారించి చివరకు ఉరిశిక్షను ఖరారు చేస్తే అతనికి క్షమాభిక్ష పెట్టి వదిలిపెట్టాలంటూ భారత రాష్టప్రతి వద్దకు అర్ధరాత్రి కమ్యూనిస్టులు రాయబారానికి వెళ్లిన సంఘటన నిన్న మొన్నటిదే!
పాకిస్తాన్, చైనా, నేపాల్, అమెరికా, యూరప్, శ్రీలంక, మయన్మార్, అరబ్ దేశాలు భారత్‌లోని హిందూ జాతిని గుర్తించటం లేదు. ఇండియా అంటే ఒక సంకర దేశం. దీనికి ‘ప్లూరలిజం’ అని పేరు. కేరళ సీఎం పినరయ్ విజయన్ హిందూ ఆలయాల్లో సామాజిక కార్యకలాపాలు జరుపుకోకూడదని శాసించాడు. హిందువులల సంప్రదాయ ఉత్సవం ‘ఓనం’పై ఆంక్షలు విధించాడు. అనంత పద్మనాభస్వామి గుప్తనిధుల వివరాలు తెలియటం లేదు. ఇక- తమిళనాడులో యజ్ఞాలు చేయకూడదు, సూర్యుడికి అర్ఘ్యాలు ఇవ్వకూడదు. తమిళ బడుల్లో సంస్కృతం, హిందీ, తెలుగు బోధించకూడదు. ఎద్దులను హింసించే జల్లికట్టు ఆటపై సుప్రీం కోర్టు నిషేధం విధిస్తే తమిళులు చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. కాని కశ్మీర్‌లో మన భద్రతాదళాలను ఉగ్రవాదులు రోజూ హతమారుస్తుంటే ఆ రాష్ట్రంలో కనీస స్పందన లేదు. కర్నాటకలో టిప్పు సుల్తాను జయంతి ఉత్సవాలు జరుపుతారు. కానీ, గోపూజ చేయకూడదు. ‘ప్రత్యేక హోదా- ఆంధ్రుల హక్కు’ అని ఏపీలో ఉద్యమాలు నడుపుతున్న రాజకీయ నాయకులు తిరుపతి, అన్నవరం, విజయవాడ, సింహాచలం ఆలయాల్లో నిధుల దుర్వినియోగంపై ఎందుకు గళం విప్పరు.
గుజరాత్‌లో ఆయుధాల వ్యాపారి జిగ్నేశ్ మెమానీ దళితులను రెచ్చగొట్టి చట్టబద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చేప్రయత్నాలు చేస్తున్నాడు. ఇతనికి అంతర్జాతీయ మాఫియా నుండి మాత్రమే కాదు, కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల నుండి కూడా నిధులు అందుతున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులకు జిగ్నేశ్ నిధులు, ఆయుధాలు సమకూరుస్తున్నాడన్నది అభియోగం. మహారాష్టల్రో ‘నవనిర్మాణ సమితి’ నాయకుడు ఉద్ధవ్ థాకరే బిజెపిని ఓడించండంటూ పిలుపునిచ్చాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ములాయం సింగ్ యాదవ్- నిషిద్ధ ‘సిమీ’ సంస్థలోని యువకులు తమ సమాజ్‌వాది పార్టీ యువ విభాగం వారని బహిరంగంగానే ప్రకటించాడు. అయోధ్యలో రామాలయాన్ని నిర్మించాలనే హిందువులను కాల్చిచంపితే తప్పేమిటని కొందరు ప్రశ్నిస్తున్నారు. హిందూ దేశంలో మెజారిటీ మతస్థులకు రక్షణ లేని దుస్థితి ఇది. అగ్రకులాల వారిపై విద్వేషం చిందిస్తూ పుస్తకాలు రాసిన క్రైస్తవ మతప్రచారకుడు కంచె ఐలయ్యకు తెలుగు రాష్ట్రాల్లో ఘన సన్మానాలు చేశారు. ఈ సంఘటనలన్నీ దేనికి సంకేతం? భారత్‌లో అంతర్గతంగా శాంతిభద్రతలు క్షీణించాయని విదేశీ శక్తులు స్వైరవిహారం చేస్తున్నాయని తేలటం లేదా?
కశ్మీర్‌ను భారతదేశం నుండి విడదీసి పాకిస్తాన్‌లో కలిపేందుకు గత అరవై సంవత్సరాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాజాహరిసింగ్ తన స్వతంత్ర రాజ్యాన్ని 1947లో ఇండియన్ యూనియన్‌లో విలీనం చేసిన డాక్యుమెంటు కేంద్రం వద్ద ఉంది. కానీ కశ్మీర్‌లోని ప్రధాన నగరాల్లో హిందువులు నేడు లేరు. కశ్మీర్ లోయ నుండి హిందువులంతా తరిమివేతకు గురయ్యారు. పాకిస్తాన్ సైనికాధికారి ‘్భరతదేశాన్ని ముక్కలు ముక్కలు చేస్తాం’అని ఒక టీవీ చానల్‌లో బహిరంగంగా ప్రకటించినా మన నేతల నుంచి స్పందన శూన్యం! మన దేశంలో చాలామంది నేతలకు దేశభక్తి లేదు. వీరిలో చైనా భక్తి ఉంది. విపరీతమైన ప్రాంతీయ దురభిమానాలు, కులగజ్జి వీరిలో అధికమైంది.
ఇప్పుడు పాకిస్తాన్‌తో మనదేశం యుద్ధం చేయక తప్పని పరిస్థితి వచ్చింది. లోగడ ఇందిరా గాంధీ బంగ్లాదేశ్ అవతరణ సందర్భంలో పాకిస్తాన్‌తో యుద్ధం చేసినప్పుడు మొత్తం దేశం ఆమెకు అండగా నిలిచింది. అప్పటి ప్రతిపక్ష నాయకుడు అటల్ బిహారీ వాజపేయి ఇందిరమ్మను ‘దుర్గ’ అని అభివర్ణించాడు. అయితే- నేడు ప్రధాని మోదీకి అలా మద్దతునిచ్చే విపక్ష నేతలే లేరన్నది కాదనలేని నిజం. దేశ సరిహద్దుల్లో యుద్ధం జరగడానికి ముందు అంతర్గత శాంతిభద్రతలను పటిష్టం చేసుకోవాల్సి ఉంది. కానీ, ఫెడరలిజం పేరుతో రాజకీయ నాయకులు జాతీయవాదాన్ని భ్రష్టుపట్టించారు. ఈ దశలో మోదీ ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలేమిటి? కొన్ని రాష్ట్రాలకు ఇచ్చిన విశేషాధికారాలను తగ్గించడం, కేంద్రంలో రెండు పార్టీల వ్యవస్థను ఏర్పరచడం వంటి చర్యలను తీసుకోవాలి. అమెరికాలో రిపబ్లికన్లు లేదా డెమొక్రాట్లు మాత్రమే అధికారంలో ఉంటారు. ఇలాంటి విధానం అమలు జరగాలంటే దేశంలో కేవలం ఒక్క రాష్ట్రానికి పరిమితమైన ఒక ప్రాంతీయపార్టీ లోక్‌సభ ఎన్నికలలో పాల్గొనకూడదని రాజ్యాంగాన్ని సవరించాలి. విద్యార్థులకు ప్రతి కళాశాలలోను నిర్బంధ సైనిక శిక్షణ ఇప్పించాలి. దేశంలోని రకరకాల ఉగ్రవాద సంస్థలను నిషేధించాలి. ఆక్రమిత కశ్మీర్‌ను భారతదేశంలో విలీనం చేయాలి. టిబెట్టును, బెలూచిస్థాన్‌ను స్వతంత్ర రాజ్యాలుగా గుర్తించాలి. పాకిస్తాన్‌కు సింధూ నదీజలాలు వెళ్లకుండా ఆపివేయాలి. శాంతిభద్రతలు క్షీణిస్తున్న రాష్ట్రాల్లో రాష్టప్రతి పాలన విధించాల్సిందే. ప్రజలకు తాయిలాలు, సబ్సిడీలు ఇవ్వడం ఆపి త్యాగబుద్ధిని నేర్పాలి. సంగీత, సాహిత్య అకాడమీల్లో వామపక్ష నాయకులను తొలగించాలి. తక్షణం ఆర్టికల్ 370 రద్దు చేయాలి. హిందువుల మనోభావాలకు అనుగుణంగా అయోధ్యలో రామాలయం నిర్మించాలి. ఇలాంటి సత్వర చర్యలు చేపట్టకపోతే భారత్‌లో స్వాతంత్య్రం నిలువదు. ఇక, మన న్యాయస్థానాల్లో విపరీతమైన జాప్యం వల్ల దశాబ్దాలుగా కేసులు పేరుకుపోతున్నాయి. ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల్లో ఆర్థిక నేరగాళ్లపై కేసులు త్వరితగతిన విచారించి, వారికి శిక్షలు అమలు చేయాలి. కొన్ని మత సంస్థల్లో జరుగుతున్న అకృత్యాలను, అవినీతి బాగోతాలను బట్టబయలు చేసి నిందితులపై కేసులు పెట్టాలి.

ప్రొ. ముదిగొండ శివప్రసాద్