శిప్ర వాక్యం

కుంభకోణాలకు ‘రక్షణ’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత రక్షణ రంగంలో అవినీతి కుంభకోణాలు చోటుచేసుకోవడం చాలా ఏళ్లుగా చూస్తూనే ఉన్నాం. స్వాతంత్య్రం వచ్చాక 1948లో ప్రథమ ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ హయాంలో రక్షణ శాఖలో జీపుల కుంభకోణం మొదలైంది. దీనికి సూత్రధారి కేరళకు చెందిన అప్పటి రక్షణ మంత్రి వి.కె.కృష్ణమీనన్. ఆయన రెండు ఒప్పందాలను రక్షణ రంగానికి సంబంధించి కుదుర్చుకున్నాడు. అవి 25 మిషెల్ బాంబర్లు, రక్షణ రంగంలో వాడేందుకు కార్లు. ఇవి ఎంతకూ ఇండియాకు చేరకపోవటంతో దీనిపై ముందుగా ఒక కమిటీ నియమించారు. జిఎస్ భార్గవ, చెనగళ్ల శివరావు దీనిని నిర్వహించారు. వీటి సారాంశమే సురేంద్రనాథ్ ద్వివేది రచించిన ‘ఇండియాలో రాజకీయ అవినీతి’ అనే గ్రంథం అవతరణ. ఈ పుస్తక రచన నెహ్రూ కోపానికి కారణమయింది. కృష్ణమీనన్ మీద నెహ్రూకు ఉన్న ప్రేమ కారణంగా 1954లో మీనన్‌కు పద్మవిభూషణ్ పురస్కారం, 1957లో రక్షణ శాఖ బాధ్యతలు అప్పగించారు. దీని వెనుక భారత కమ్యూనిస్టుపార్టీ ప్రేరణ ఉండటం గమనార్హం. నెహ్రూ తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణయం ఫలితంగా 1962లో చైనాలో జరిగిన యుద్ధంలో ఇండియా ఓడిపోయింది. రూ. 80 లక్షల వ్య యం చేసే జీపుల స్కాంలో దోషి అయిన కృష్ణమీనన్‌ను పక్కనపెట్టి ఉంటే దేశానికి ఈ దుర్గతి పట్టి ఉండేది కాదు.
గత కొనే్నళ్లుగా బోఫోర్స్ శతఘు్నలు, ఆగస్తా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ల కొనుగోళ్లలో అవినీతి జరిగినట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో- కృష్ణమీనన్ హయాం నుండి కొనసాగుతున్న అవినీతి పరంపరను దేశం గుర్తుచేసుకోవలసి ఉంది. అవినీతి అనేది కాంగ్రెస్ సంస్కృతి.
***
అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణం యూపీఏ హయాంలో జరిగింది. ఇటలీకి చెందిన వెస్ట్‌ల్యాండ్ కంపెనీ నుంచి నాసిరకమైన హెలికాప్టర్లను కొనుగోలు చేసేందుకు అప్పటి కాంగ్రెస్ పాలకులు కారకులనే ఆరోపణలు వచ్చాయి. ఈ హెలికాప్టర్ల కొనుగోలులో ఇటలీకి చెందిన మిషెల్ జేమ్స్ క్రష్ట్ఫర్ దళారీగా వ్యవహరించాడు. 2009, జూలై 19న క్రిష్ట్ఫర్ రాసిన ఓ లేఖలో అప్పటి భారత ప్రధాని పేరు, హిల్లరీ క్లింటన్ పేర్లు ఉన్నాయి. ‘పని’ త్వరలో అవుతుందని మిషేల్, ఓస్రో (కంపెనీ అధినేత)కి హామీ ఇచ్చిన జాబు ఇది. ‘్భరత రక్షణ మంత్రి అసమర్ధుడు. ఆయన నూరు శాతం మన వెనుక ఈ డీల్‌లో నిలబడ్డాడు’ అని మిషేల్ ఈ లేఖలో పేర్కొన్నాడు. అంటే భారత ప్రధాని, రక్షణ మంత్రులను తోలుబొమ్మలుగా భావించి ఈ ఎంఐ8 వీవీఐపీ హెలిలీకాప్టర్ల కొనుగోలు ఒప్పందం చేయించింది ఎవరు?
కొనుగోళ్ల వివరాలు..
2010 ఫిబ్రవరిలో రోమ్‌లోని భారత రాయబారి నుండి 12 ఎడబ్ల్యు 101 వివిఐపి హెలికాప్టర్ల కొనుగోళ్ళలో అవినీతి జరిగిందనే విషయంపై నివేదికను పంపవలసిందిగా భారత రక్షణ మంత్రిత్వ శాఖ కోరింది.
2012 ఫిబ్రవరి: ఈ కాంట్రాక్టును నిర్ధారించటమైనది (రిఫరెన్స్: 1999 ఆగస్టు- ప్రతిపాదన.
రిఫరెన్స్: సెప్టెంబరు 2006- ప్రధాని మన్మోహన్‌సింగ్ ఆమోదం- 8నుండి 12 ఛాపర్లకు సంఖ్య పెంపు.)
ఫిబ్రవరి 2012: పత్రికలలో అవినీతి కథనాలు ప్రారంభం.
ఫిబ్రవరి 2013: ఇటాలియన్ పోలీసు గ్లూసెప్పి ఓర్సు (ఎన్‌మెకానికా సి-ఇ.ఒ)ను అరెస్టు చేశారు.
ఇటలీ పోలీసులు స్వాధీనం చేసుకున్న మిషేల్ డైరీలలో-
* 60 లక్షల మిలియన్లు ఐ.ఎ.ఎఫ్‌కు ముడుపులు చెల్లించినట్లు ఉంది.
* 8.4 మిలియన్లు ఉన్నత స్థాయి అధికారులకు ముడుపులు అందాయి.
* 16 మిలియన్లు ‘ఒక రాజకీయ కుటుంబానికి’ అందాయి. ఆ కుటుంబంలో ఒకరి పేరు సిగ్నోరా గాంధీ.
మార్చి 2013: భారతదేశంలోని సిబిఐ యంత్రాంగం ఎస్.పి. త్యాగిపై కేసు నమోదు చేసింది.
నవంబరు 2013:- మరొక పనె్నండు మంది మీద క్రిమినల్ కేసులు సిబిఐ నమోదు చేసింది.
జనవరి 2014: అగ్రిమెంటు ఉపసంహరణ
సెప్టెంబర్ 2014:- ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్టరేటు గౌతమ్ ఖైతాన్‌ను అరెస్టుచేసింది.
రిఫరెన్స్: 3600 కోట్ల ముడుపుల వ్యవహారం.
2014 అక్టోబరు: ఇటాలియన్ కోర్టు
బర్సి- బ్రూనోస్పాగ్ నోలినిలను నిర్బంధించటం.
ఏప్రిల్ 2016:- నాలుగు సంవత్సరాల ఐదు నెలలు ఓర్సికి జైలుశిక్ష విధించిన ఇటలీ కోర్టు
ఫిబ్రవరి 2017:- భారతదేశంలో ఎ.సి.త్యాగి సహా మరొక 11 మందిపై సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది.
2018 డిబంబరు-4. మిషేల్ జేమ్స్ క్రిస్టియన్‌ను అరబ్ ఎమిరిటస్ నుండి ఇండియాకు తరలించటం.
2019 జనవరి:- మిషేల్ అరెస్టుతో వాస్తవాలు వెలుగు చూడటంతో పార్లమెంటులోను బయటా ఫ్రాన్సుకు చెందిన రాఫేల్ యుద్ధ విమానాల కొనుగోలులో అనిల్ అంబానీకి ముడుపులు ముట్టాయని కాంగ్రెస్ పార్టీ గొడవ ప్రారంభించింది.
జనవరి 2019: మిషేల్ డైరీల డికోడ్ అందులోని కోడ్ నేమ్స్ ఎవరివో అతడే వివరించాడు.
10 జనవరి 2019: సిబిఐ డైరెక్టర్ అలోక్‌వర్మను పదవి నుండి కేంద్రం తొలగించింది. సుప్రీం కోర్టు పునర్నియామకం- మళ్లీ తొలగింపు- చివరికి అలోక్ వర్మ రాజీనామా.
రిఫరెన్స్: మమతాబెనర్జీపై కేసులు, అగస్టా వెస్ట్‌లాండ్ చాపర్ కేసులు, 2జి స్పెక్ట్రమ్ వంటి వంటి కీలక కేసుల్లో ఫైళ్ల టాంపరింగ్ ఆరోపణ.
చాపర్‌ల ఎత్తు తగ్గింపు ఎందుకు?
లడఖ్ వంటి ప్రాంతాల్లో ఎగిరే విమానాలు, హెలికాప్టర్లు తాలిబన్లు, ఇతర తీవ్రవాదుల రాకెట్ లాంచర్ల ‘రేంజ్’కి అందకుండా ఎగరాలి. అలాంటివి అమెరికా మాత్రమే తయారుచేయగలదు. రక్షణ శాఖ ఆమేరకు నిబంధనలు రూపొందించి టెండర్లను పిలిచింది. ఐతే సోనియాగాంధీ ఇటలీకి చెందిన స్పింక్ మెకానికా కంపెనీకి కాంట్రాక్టు ఇప్పించారనే ఆరోపణలు గుప్పుమన్నాయి. ఈ విమానాలు అంత ఎత్తున ఎగరలేవు. ఈ విధంగా దేశ ప్రముఖుల (వివిఐపి) ప్రాణాలను తాకట్టుపెట్టి ఇటలీ కంపెనీకి సాయం చేయటం దేశద్రోహం కిందికి వస్తుంది.
వెస్ట్‌లాండ్ చాపర్ల కొనుగోళ్ల గొడవ వెలుగులోనికి రాగానే రాఫెల్ కొనుగోళ్ల కుంభకోణాన్ని కాంగ్రెస్ వారు తెరమీదికి తెచ్చారు. హెచ్.ఎ.ఎల్ స్వదేశీ కంపెనీని కాదని ఎక్కువ మొత్తం చెల్లించి ఫ్రాన్సు నుండి విమానాలు ఎందుకు కొనుగోలు చేశారు? అన్నది కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వేస్తున్న ప్రశ్న. ఇక్కడ కీలకమైన అంశం ఏమిటంటే మామూలు యుద్ధ విమానాలకన్నా అణ్వస్త్ర శతఘు్నలను మోసుకుపోయే యుద్ధవిమానాలు ఎక్కువ ఖరీదులో ఉంటాయి. చైనానుండి ఇండియా తనను తాను కాపాడుకోవడం కోసం అణ్వస్త్ర వాహక విమానాలు (రాఫెల్ కొనుగోళ్లు) జరిగాయి. ఇందుకు సంబంధించిన కాంట్రాక్టు వివరాలు కొన్ని రహస్యమైనవైనా సుప్రీం కోర్టుకు సీల్డ్‌కవర్‌లో సమర్పించటం జరిగింది. మన చైనా బానిసలకు ఈ డీల్ ఇష్టం లేదు. అందుకే రాఫెల్ కుంభకోణం అంటూ నానా అల్లరి మొదలుపెట్టారు. రక్షణ రంగం ఇలా నిర్వీర్యమైతే ఇండియాను చైనా, పాకిస్తాన్‌లు తేలిగ్గా దెబ్బతీసే ప్రమాదం ఉంది. *

ప్రొ. ముదిగొండ శివప్రసాద్