శిప్ర వాక్యం

‘కమ్యూనిస్టు ముక్త్భారత్’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ‘కాంగ్రెస్ ముక్త్భారత్’ అనే నినాదాన్ని వినిపించినా, ఆచరణలో అది సాధ్యపడలేదు. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ మూడు రాష్ట్రాలూ భాజపా చేతి నుంచి జారిపోవడానికి అనేక కారణాలున్నాయి. ‘కాంగ్రెస్ ముక్త్భారత్’ సంగతేమో గానీ- ‘కమ్యూనిస్ట్ ముక్త్భారత్’ అనే మాట నిజం అవుతోంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీల ఉనికి ప్రశ్నార్థకం అవుతుందనే అంచనాలు ఊపందుకుంటున్నాయి. గత నెలలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఓ ప్రముఖ ఆంగ్ల టీవీ చానల్ ప్రకటించిన సర్వేలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకొన్నట్లే భవిష్యత్‌లో అనూహ్య రాజకీయ పరిణామాలు చోటుచేసుకొంటాయన్నది ఆ సర్వే సారాంశం.
ఒకప్పుడు వామపక్షాలకు కంచుకోటలైన త్రిపుర, పశ్చిమ బెంగాల్‌లో కమ్యూనిస్టులు అధికారం కోల్పోయారు. కేరళలో మాత్రం లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం కొనసాగుతోంది. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో మమతాబెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి 34 సీట్లు, భాజపాకు 7 దక్కుతాయని, సీపీఎంకు ఒక్కసీటు కూడా రాదని ప్రస్తుత సర్వేలు వెల్లడిస్తున్నాయి. త్రిపురలోని రెండు లోక్‌సభ స్థానాల్లోనూ భాజపా విజయ కేతనం ఎగురవేయనుంది. కేరళలో 16 చోట్ల కాంగ్రెస్, 4 చోట్ల సీపీఎం ఆధిక్యత కనపరచే పరిస్థితులున్నాయి. ఈ పరిస్థితుల్లో జాతీయ స్థాయి పార్టీ హోదాను సీపీఎం కోల్పోయే పరిస్థితి ఎదురవుతుంది.
మరో సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీకి నాలుగు ఎంపీ స్థానాలు, వైకాపాకు 16 సీట్లు వస్తాయని సర్వేల్లో వెల్లడైంది. ఇక తెలంగాణలో తెరాస 16 చోట్ల, మిగిలిన ఒక్క స్థానాన్ని మజ్లిస్ పార్టీ గెలిచే పరిస్థితి ఉందట! అంటే తెలంగాణలో కాంగ్రెస్, భాజపాలకు ఒక్క సీటు కూడా దక్కే అవకాశం లేనట్టే. తమిళనాడులో డీఎంకే 39 స్థానాలు గెలుచుకుంటుందని, సినీనటులు రజనీకాంత్, కమల్‌హాసన్‌ల ప్రభావం ఏమీ ఉండదని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ రాజస్థాన్‌లో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి జనం మళ్లీ భాజపాకే బ్రహ్మరథం పడతారట! మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజెపై ఉన్న ఆగ్రహం కారణంగానే రాజస్థాన్ ఓటర్లు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించారట. మోదీపై ఉన్న అభిమానంతో రాజస్థాన్ ఓటర్లు ఎంపీ ఎన్నికల్లో భాజపా వైపు మొగ్గు చూపుతారట! కాగా, దేశంలోనే అతిపెద్ద రాష్టమ్రైన ఉత్తరప్రదేశ్‌లో భాజపా పాతిక సీట్లను మాత్రమే తన ఖాతాలో వేసుకుంటుందని అంచనా. ఇక్కడ ఎస్పీ-బీఎస్పీ కూటమి తమ ఓట్లకు గండి కొడుతుందని భాజపా నేతలు ఆందోళన చెందుతున్నారు.
***
మన దేశానికి పాకిస్తాన్‌లో ఎల్‌ఒసి ఉన్నట్లే చైనాలోనూ సుదీర్ఘమైన సరిహద్దు ఉంది. పాకిస్తాన్ 1948లో బలవంతంగా ఆక్రమించిన కొన్ని ప్రాంతాలను చైనాకు దత్తత ఇచ్చింది. అందులో లడఖ్‌లోని కొన్ని ప్రాంతాలున్నందున మన సరిహద్దుకు ఆనుకొని చైనా రహస్య సొరంగం నిర్మించింది. దీనికి నాలుగు ద్వారాలున్నాయి. ఇందులో క్షిపణులు, సైనిక పటాలాల బంకర్లు, ఆయుధ, ఆహార సామాగ్రిని చైనా సమకూర్చింది. ఈ సొరంగం గురించి భారత రక్షణ విభాగానికి తెలియదట! ఇటీవల ఒక అంతరిక్ష ఉపగ్రహం కొన్ని ఫొటోలను విడుదల చేయటంతో యావత్ ప్రపంచం నివ్వెరపోయింది. ఈ సొరంగం వల్ల ఇండియాపై చైనా తేలికగా దాడిచేయవచ్చు. దాడిచేసే దూరం తగ్గుతుంది. దీనిని నిరోధించే స్థితిలో భారత్ లేదు.
భారత సైనిక పాటవం కన్నా దాదాపు మూడురెట్ల పటిమ చైనాకు ఉంది. అందుకని భారత్‌పై చైనా ఏక్షణంలోనైనా మెరుపుదాడి చేయవచ్చు. గ్వాడార్ (పాకిస్తాన్) పోర్టులో చైనా అణ్వస్త్ర జలవాహకాలను అమర్చింది. అంటే చైనా ద్విముఖ దాడికి సిద్ధపడుతున్నది. ఆసియాలో ఇండియా బలమైన ఆర్థికశక్తిగా ఎదగటం చైనాకు ఇష్టం లేదు. ఈ ముప్పునుండి ఇండియా ఎలా తప్పించుకోగలదు? పాకిస్తాన్‌లో చైనా ఎకనమిక్ కారిడార్ పూర్తిచేసింది. ఇండియాలో రెడ్‌కారిడార్ నిర్మాణం జరిగింది. భారత్‌లో కొంతమంది అగ్ర నాయకులను ఎన్నికల సమయంలో చంపించడానికి చైనా వ్యూహరచన చేసిందట!
***
ఆంధ్రప్రదేశ్‌కు 10 లక్షల కోట్ల రూపాయలను కేంద్రం మంజూరు చేసిందని మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ఈ విషయమై నిజానిజాలు నిగ్గుతేల్చేందుకు చర్చకు సిద్ధం అన్నారు. అయితే, నిధులు అందలేదని చంద్రబాబు ప్రభుత్వం చెబుతున్నమాట ఎంతవరకు నిజం? కొత్తగా ఏర్పడిన ఏపీకి నిధుల అవసరం ఉంటుంది. కానీ, ఇచ్చిన నిధులు ఇవ్వలేదు అన్నట్లు లేదా వాటిని దారిమళ్లించటం తగదు. నిధులకు సంబంధించి ‘కాగ్’ నివేదికలు, యుటిలిటీ సర్ట్ఫికెట్లు కూడా ఉంటాయి. ఇక బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజకీయ లబ్ధికోసం కేంద్రంపై నిప్పులు చెరుగుతోంది. తమకు కేంద్రం అన్యాయం చేసిందని ఆమె ఆరోపిస్తోంది. అసలు విషయం ఏమిటంటే రోజ్‌వాలీ చిట్‌ఫండ్ కుంభకోణంలో ఆమె సన్నిహితులను అరెస్టుచేశారు. శారదా చిట్‌ఫండ్ స్కాం, నారదా టేపుల స్కాం అభియోగాలు ఉండనే ఉన్నాయి. యూపీఏ హయాంలో కేవలం లక్ష కోట్లు మాత్రమే బెంగాల్‌కు కేటాయించగా ఎన్‌డిఏ వచ్చాక 2.8 లక్షల కోట్లను 14వ ఆర్థిక సంఘం కేటాయించింది. ఈ గణాంకాలను దాచిపెడితే ఎలా? 2.26 లక్షల మంది జనధన్ పథకం కింద బెంగాల్‌లో లబ్ధిపొందారు. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని కేంద్రం ప్రవేశపెడితే దాన్ని మమత ఎందుకు అమలుచేయటం లేదు? సుదీర్ఘకాలం కమ్యూనిస్టుల కబంధ హస్తాల్లో నలిగిపోయిన బెంగాల్ ప్రజలకు ఇప్పుడు మమతా బెనర్జీ పాలన శాపంగా మారుతోందన్న విమర్శలు చెలరేగుతున్నాయి.
***
కేఏ పాల్ క్రైస్తవ మత ప్రచారకుడు. లోగడ పలు కారణాలతో ఆనాటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డితో వైరం పెట్టుకున్నాడు. తన పార్టీ వచ్చే ఎన్నికల్లో గెలిచాక ముఖ్యమంత్రినవుతానని పాల్ చెప్పుకుంటున్నాడు. మాజీ రాష్టప్రతి ప్రణబ్‌ముఖర్జీకి ‘భారతరత్న’ పురస్కారాన్ని ఇవ్వటాన్ని పాల్ వ్యతిరేకించాడు. ‘ప్రణబ్ భాజపా సానుభూతిపరుడు’ అని ఆయన చేసిన ఆరోపణ అసత్యం. వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఆయనను ప్రణబ్ వ్యతిరేకించాడు. ఇందిరా గాంధీ, సోనియాగాంధీలకు విధేయుడుగా ఉన్నాడు. అయినా మోదీ ప్రభుత్వం ప్రణబ్‌కు అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించింది. ఇది రాజకీయ ‘పద్మ’వ్యూహం అని వ్యాఖ్యానించేవారు ఉన్నారు. ప్రణబ్‌కు ఈ బిరుదు ఇవ్వడం వల్ల బెంగాల్‌లో భాజపా పొందే లాభం ఏమీలేదు. అక్కడ కమ్యూనిస్టు శకం ముగిశాక ఆ స్థానాన్ని తృణముల్ కాంగ్రెస్ ఆక్రమించుకున్నది. ప్రణబ్‌కు ‘భారతరత్న’ ఇవ్వడాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వంటివారు స్వాగతించగా, కేఏ పాల్‌కు ఏమిటి అభ్యంతరం? విదేశాల నుండి మతమార్పిడులకు వస్తున్న నిధులు మోదీ వల్ల ఆగిపోయాయని ఆయనకు కోపమా? దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, ఎన్.టి.రామారావు, కర్ణాటకలో సిద్ధగంగస్వామిజీ, శ్రీ శివకుమారస్వామిజీలకు ‘భారతరత్న’ ఇవ్వాలన్న ప్రజల ఆకాంక్షలు ఫలించలేదు. ఏదో కంటి తుడుపుగా రెండు ‘పద్మశ్రీ’లు ఏపీకి, తెలంగాణకు విదిల్చారు. ఈ వైఖరి తెలుగుజాతిని అవమానించడం కాదా?
చంద్రబాబు మోదీపై యుద్ధం ప్రకటించకుండా ఉంటే ఎన్టీఆర్‌కు ‘భారతరత్న’ వచ్చి ఉండేదా? అస్సాంలో చొరబాటుదారుల పౌరసత్వం రద్దుచేయటం ఆందోళనలకు కారణమైంది. వారిని శాంతింపజేయడానికి భూపేన్ హజారికాకు ‘భారతరత్న’ ఇచ్చారా? ఎన్నికల ముందు ప్రకటించిన ‘పద్మ’ పురస్కారాలు ‘కమలం’ పార్టీకి మేలు చేస్తాయా? గీతామెహతా తనకు ప్రకటించిన పద్మశ్రీని తిరస్కరించింది. కళారంగాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న ఆవేదనలో కొంత నిజం ఉంది. తెలుగు కళా, సినీరంగానికి చెందిన ఎంతోమంది ప్రముఖులకు ఇప్పటి వరకూ కనీసం ‘పద్మశ్రీ’ బిరుదులైనా రాలేదు. కొంతమంది ప్రముఖుల పేర్లతో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ‘పద్మ’ పురస్కారాల కోసం పంపిన జాబితాలు బుట్టదాఖలు అయినాయి. ‘పద్మ’ పురస్కారాలు రాకపోయినా ఎంతోమంది తెలుగు ప్రముఖులు ఇప్పటికీ జనం గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారు. పండిట్ దీనదయాళ్‌జీ శత జయంతి సంవత్సరంలో ఆ మహాపురుషునికి నివాళిగా ‘భారతరత్న’ ఇస్తే బాగుండేది. ‘ఎవరు ఎన్ని విమర్శలు చేసినా గజ చర్మాలు స్పందించలేవు’అన్నారొకరు! కుంభకోణాల్లో ఆరోపణలు ఎదుర్కొన్న వారికి మరణానంతరం ‘భారతరత్న’ పురస్కారాలు ఇచ్చారు. రదశాబ్దాల తరబడి కళలు, సాహిత్యం, చరిత్ర పరిశోధన రంగాల్లో కృషి చేసిన వారికి గుర్తింపు దుర్లభం. ‘నేను తెలుగుదేశం పార్టీ అభిమానిని అన్న సాకుతో లోగడ కాంగ్రెస్ హయాంలో కేంద్ర హోంమంత్రి శివరాజ్‌పాటిల్ నా దరఖాస్తును వెనక్కి నెట్టేశారు..’ అని ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ ఆ మధ్య ఓ సభలో ఆవేదన చెందారు. అందరూ ఇలాగే బహిరంగంగా తమ మనోభావాలను వ్యక్తం చేయగలరా?
*

ప్రొ. ముదిగొండ శివప్రసాద్