శిప్ర వాక్యం

‘డ్రాగన్’ కుట్ర ఇదీ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భ్రమలు తొలగిపోయాయి.. చైనా ఎప్పటికీ భారత్‌తో మైత్రి నెరపజాలదని తేలిపోయింది. చైనాకు పాకిస్తాన్ వలస దేశం. అంచెలంచెలుగా భారత భూభాగాలను ఆక్రమించుకొని ఆసియాలో తన సార్వభౌమాధికారాన్ని స్థాపించుకోవడానికి చైనా యత్నిస్తోంది. ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తర తెలంగాణలోని నల్లమల, కేరళలోని మల్లపురం, వైనాడ్ ప్రాంతాల్లో ఉగ్రవాద స్థావరాలను ఏర్పాటుచేసి భారత అంతర్గత భద్రతకు చైనా సవాలు విసిరింది. యూపీఏ ప్రభుత్వం కాని, ఎన్డీఏ సర్కారు కాని ఈ ముప్పు నుండి దేశాన్ని తప్పించలేకపోయాయి. ‘హిందూ- చీనీ భారుూ భారుూ’ అని అలనాడు దేశ ప్రథమ ప్రధాని నెహ్రూ చెప్పిన ‘పంచశీల’ మంత్రం పఠించే అమాయకులు ఇంకా భారత్‌లో ఉండటం మన దౌర్భాగ్యం.
మసూద్ అజార్ అంతర్జాతీయ ఉగ్రవాది అని ఫ్రాన్స్, బ్రిటన్, అమెరికాలు అంగీకరించాయి. మసూద్‌ను నిర్బంధించాలని ఐక్యరాజ్యసమితిలో గతంలో ప్రతిపాదన వచ్చింది. దీన్ని ప్రతిపాదించింది ఇండియా కాదు ఫ్రాన్స్. ఈ వాదానికి చైనా గండికొట్టింది. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇటీవల ఒక ప్రకటన చేస్తూ, మసూద్ అనారోగ్యంతో కదలలేని స్థితిలో ఉన్నాడని పేర్కొన్నారు. పాక్ సైనికాధికారి అసిష్ మహమ్మద్ మాత్రం మసూద్ ఆరోగ్యంగా ఉన్నాడని నిర్ధారించారు. గత పదేళ్లలో చైనా ఐరాసలో తన వీటో అధికారాన్ని వినియోగించుకోవటం ఇది నాల్గవసారి. చైనా ఎందుకింత దుర్మార్గానికి పాల్పడుతోంది? భారత్ రక్షణ పరంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఆసియాలో బలమైన శక్తిగా ఎదగటం చైనాకు ఇష్టం లేదు. చైనా సైనిక నియంతృత్వ కమ్యూనిస్టు దేశం. ఇండియా ప్రజాస్వామిక దేశం.
1900లో స్వామి వివేకానంద ఓ సందర్భంగా మాట్లాడుతూ, ‘భవిష్యత్తులో భారత్‌కు ముప్పు తప్పదు’ అని హెచ్చరించారు. 1962లో అస్సాం వరకు చైనా చొచ్చుకొని వచ్చింది. ఇప్పుడు బ్రహ్మపుత్రపై డ్యామ్‌ను నిర్మించింది. ఆ డ్యామ్ గేట్లు తెరిస్తే అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ వంటి ప్రాంతాలు జలదిగ్బంధంలో ఉంటాయి. దుర్మార్గుల ముందు మన మంచితనం వ్యర్థం అయింది.
***
రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోళ్లకు సంబంధించి కొన్ని పత్రాలు గల్లంతయ్యాయా? ‘ఔను.. నిజమే’ అని అంటున్నాయి నిఘా వర్గాలు. రాఫెల్ ఒప్పందం 2007లో యూపీఏ హయాంలో జరిగింది. అప్పటి రక్షణమంత్రి ఎ.కె.ఆంటోనీ. ఈ వ్యవహారంలో ఆయుధాల వ్యాపారి సంజయ్ భండారీ, రాహుల్ గాంధీ, రాబర్ట్ వాద్రాల పేర్లు వినిపిస్తున్నాయి. రాజస్థాన్‌లో బికనీర్ భూములు, హర్యానాలో స్కైలైన్, లండన్‌లో విలాసవంతమైన భవనం.. ఇవన్నీ వాద్రాకు ఎవరు బహుమతిగా ఇచ్చారు? ఇదంతా సంజయ్ భండారీ నిర్వాకమేనని సాక్ష్యాధారాలు లభించాయి. ఎవరూ ప్రతిఫలాపేక్ష లేకుండా ఇంతింత భారీ నజరానాలు ఎవరికైనా ఎందుకిస్తారు? 2008లో రాహుల్ గాంధీ జర్మనీ వెళ్లినట్లు ఆధారాలున్నాయి. అక్కడ ఆయన ఎవరెవరితో ఏమేం మాట్లాడాడు? ఈ వివరాలు తెలియటం లేదు. ఇలాంటివారు ఎన్నికలలో గెలిస్తే కేసులన్నీ మాఫీ అయిపోతాయా?
***
మసూద్ అజార్ అంతర్జాతీయ ఉగ్రవాది అనడానికి ఆధారాలు చూపండని చైనా ప్రభుత్వం ఇండియాను కోరింది. జైషే మహమ్మద్ సంస్థ అధినేత అయిన మసూద్‌కు మన పార్లమెంటుపై దాడి, పుల్వామాలో 45 మంది సైనికుల హత్య, ఇతర దారుణాలతో ప్రత్యక్ష సంబంధం ఉంది. ఈ విషయం లోగడ అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఐరాసలకు ఇండియా తెలియజేసింది. ఇనే్నళ్లుగా పాకిస్తాన్‌కు చైనా, అమెరికాలు అధునాతన ఆయుధాలను సరఫరా చేస్తున్నాయి. ఆసియాలో చైనా, అమెరికాలు తమ ఆధిపత్యం నిలవాలని ప్రయత్నిస్తున్నాయి. బలూచిస్థాన్‌లోను, ఇండియాలోను చైనా రెండు రెడ్ కారిడార్ల నిర్మాణం పూర్తిచేసింది. లడక్‌లో చైనా ఎందుకు సొరంగ మార్గాలను నిర్మించింది? అక్కడ న్యూక్లియర్ క్షిపణులను ఎందుకు మోహరించింది? పాక్‌లోని గాద్వా తీరంలో ఎందుకు న్యూక్లియర్ సబ్ మెరైన్‌ను ఉంచింది? భారత్ కన్నా చైనా సైనికపాటవంగా గొప్పదే కావచ్చు. కాని ఆ అంగుష్టమాత్రుల జాతికి భారత వీర సైనికులు ఏ విధంగానూ తీసిపోరు. జనాభాలో చైనాతో సమానంగా భారత్ ఉంది. ఐనా భారత్‌ను చూచి చైనా భయపడటం లేదు. ఎందుకంటే భారత్‌లో లక్షలాది మంది వినియోగదారులు చైనా నుండి దిగుమతి అయిన సెల్‌ఫోన్లు, టపాకాయలు కొనుక్కుంటున్నారు. చైనా వస్తువులపై ఇండియా ఎందుకు నిషేధం విధించలేక పోయింది? డోక్లాంలో చైనా ఆగడాలను ఎందుకు ఇండియా అడ్డుకోలేక పోయింది? ఎందుకంటే ఇండియాలో చైనా అనుకూల వర్గాల వారు పెద్దసంఖ్యలో ఉన్నారు కాబట్టి! చైనాలో ఇండియాకు అనుకూల రాజకీయ పార్టీ లేదు కాబట్టి!!
***
బెంగాల్‌లో పంచాయితీ ఎన్నికల సందర్భంగా దాదాపు వంద మందిని తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు హత్యచేశారు. చనిపోయినవారిలో అరవై మంది ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి కార్యకర్తలు కాగా మిగిలినవారు కమ్యూనిస్టులు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి రవిశంకర ప్రసాద్ అధికారికంగా వెల్లడించారు. బెంగాల్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రశాంతంగా ఎన్నికలు జరుగనివ్వదు కాబట్టి మిలటరీ దళాలను మోహరించవలసిందిగా ఎన్నికల కమిషన్‌కు వివిధ రాజకీయ పార్టీల నేతలు లేఖ ఇచ్చారు. మమతా బెనర్జీ శారదా చిట్‌ఫండ్ కుంభకోణం, నారదా టేప్స్, ఫ్లైఓవర్ల కుంభకోణాల్లో కూరుకుపోయింది. అధికారం నిలుపుకోవాలని ఆమె దేశద్రోహుల సహాయం తీసుకుంటున్నది. అలాంటి వ్యక్తిమీద మోదీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోదు? బెంగాల్‌లోకి ఈడీ, సీబీఐ అధికారులను రాకుండా మమత నిరోధించింది. ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్, భాజపా అధ్యక్షుడు అమిత్‌షాను బెంగాల్ లోకి అడుగుపెట్టనివ్వలేదు. బెంగాల్ భారతదేశంలో భాగం కాదా? భారత రాజ్యాంగం మమతకు వర్తించదా? దేవెగౌడ, చంద్రబాబు వంటి నేతలు మాత్రమే మమతకు మద్దతు ఇస్తున్నారు. కేంద్రంలోని భాజపా సర్కారు తన చేతకాని తనానికి సిగ్గుపడాలి. బెంగాల్‌లో లోక్‌సభ ఎన్నికలు సజావుగా జరిగే అవకాశం లేదంటూ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు భాజపా నేతలు ఫిర్యాదు చేయటం వారి అసమర్థతే. బెంగాల్‌లో ఎప్పుడో రాష్టప్రతి పాలన పెట్టి ఉండవలసింది. దేశద్రోహ నేరం కింద మమతపై చర్యలు తీసుకోవాల్సి ఉంది.
***
మహారాష్టల్రో శరద్ పవార్ మరాఠీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. తాను రాజకీయాల నుండి విరమిస్తున్నట్లు ఇటీవల ఆయన ప్రకటించి అందరినీ ఆశ్చర్యచకితులను చేశాడు. నిజానికి పవార్ ఆరోగ్యం ఏమీ బాగాలేదు. ఈ నిర్ణయం చాలాముందే తీసుకొని ఉండవలసింది. ‘నాకు బదులు నా మనుమడు పార్థు నా నియోజకవర్గంలో పోటీచేస్తాడు’- అని ఆయన ప్రకటించాడు. ఔరా.. ఇదా రహస్యం..! అని ప్రజలు నివ్వెరపోయారు. మహిళా సాధికారత కోసం కృషి చేయాలని కూడా ఆయన సెలవిచ్చారు. ‘మహిళా సాధికారత సాధించేందుకే నా కుమార్తె సుప్రియ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న’ట్టు ఆయన అన్నారు. మహిళా సాధికారత అంటే ఇదా అర్థం? అని జనం అనుకున్నారు.
***
గుజరాత్‌లోని సబర్మతీ ఆశ్రమం వద్ద ఇటీవల కాంగ్రెస్ నాయకులు సోనియా, రాహుల్, ప్రియాంకలు సమావేశమై- 1942 నాటి ఉప్పు సత్యాగ్రహ దినాన్ని స్మరించుకుంటూ ఊరేగింపు జరిపారు. చరఖా- ఉప్పు సత్యాగ్రహం భారత జాతి స్వావలంబనకు ప్రతీకలుగా గాంధీజీ భావించాడు. ఈరోజు ఎవరైనా ఖద్దరు వస్త్రాలను కడుతున్నారా? స్వదేశీ వస్తువులు వాడుతున్నారా? కాంగ్రెస్ నేతలు ఇపుడు స్వదేశీ స్వావలంబన ఉద్యమాన్ని ప్రస్తావించడం ఎన్నికల నాటకంలో అంతర్భాగమేనా? విదేశీ వనిత సోనియాలో స్వదేశీ భావన ఉంటుందా? ఇక, మద్యపాన నిషేధం గురించి అలనాడు గాంధీజీ ప్రచారం చేశాడు. నేడు మద్యం తాగని రాజకీయ నాయకుడు ఉన్నాడా? గోమాంసం తింటే తప్పేమిటి? అని కర్నాటక మాజీ సీఎం, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య ప్రశ్నించాడు. మరి మహాత్మా గాంధీ పేరును స్మరించే అర్హత వీరికి ఉందా?
*

-ప్రొ. ముదిగొండ శివప్రసాద్