శిప్ర వాక్యం

మరోసారి మోదీ హవా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలాకోట్‌లోని జైషే ఉగ్రవాద శిబిరాలపై మన వాయుసేన ఆకస్మిక దాడి జరిపిన తర్వాత దేశ రాజకీయ వాతావరణంలో గణనీయమైన మార్పులు వచ్చాయి. ఈ పరిస్థితులు మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమికి ఉపకరిస్తాయని రాజకీయ విశే్లషకులు అంచనా వేస్తున్నారు. వాయుసేన జరిపిన సర్జికల్ స్ట్రయిక్స్ వల్ల దేశంలోని వివిధ ప్రాంతాల్లో భాజపాకు అనుకూల పవనాలు వీస్తున్నాయన్న సర్వేలు వెలువడుతున్నాయి. ఈ సర్వేల ప్రకారం చూస్తే- మోదీ మరోసారి ప్రధాని అవుతారన్న భావన కలుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితిని పరిశీలిస్తే తెలంగాణలో 16 ఎంపీ సీట్లను టిఆర్‌ఎస్ గెలుచుకుంటుందని గతంలో అంచనావేశారు. ఐతే, ఇప్పుడు టిఆర్‌ఎస్ 13 సీట్లు మాత్రమే గెలుచుకోబోతోందట! కాంగ్రెస్ ఒకచోట, భాజపా రెండు సీట్లలో సత్తా చూపవచ్చని, మజ్లిస్ ఒక చోట గెలుస్తుందని అంచనా. ఏపీలో మెజారిటీ ఎంపీ స్థానాల్లో వైకాపా విజయ కేతనం ఎగురవేసే పరిస్థితి ఉందంటున్నారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 283 స్థానాలు, రాహుల్ గాంధీ నేతృత్వంలోని యూపీఏ కూటమికి 135 సీట్లు దక్కవచ్చని ఓ సర్వేలో తేల్చారు. సీట్ల సంఖ్య తగ్గినా మోదీకే అధికార పీఠం ఖాయమంటున్నారు.
ఎన్నికల తర్వాత ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఏపీ, తెలంగాణ, త్రిపుర, బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో పూర్తిగా అదృశ్యం కాబోతున్నాయట! బెంగాల్‌లో భాజపా 11 సీట్లు గెలుస్తుందంటున్నారు. హిందీ బెల్ట్‌లో భాజపా బలపడుతుండగా, ఢిల్లీలో ఆమ్‌ఆద్మీ పార్టీ కనుమరుగు కాబోతున్నది. తమిళనాడులో అన్నా డీఎంకే- భాజపా కూటమికి మంచి ఫలితాలు వస్తాయంటున్నారు.
***
రాజకీయాల్లో అశ్లీల భాషను వాడవచ్చునా? రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రధానమంత్రిని నపుంసకుడు అని తిట్టవచ్చునా? కర్నాటకలో ఈమధ్య జరిగిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సభలో ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ సమక్షంలో కొందరు ఎమ్మెల్యేలు ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. రాహుల్ సైతం తన స్థాయిని మరచి విమర్శలు చేశారు. మోదీని ‘నీచ కులస్థుడు’ అని గతంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ నిందించాడు. ప్రియాంక గాంధీ ఒక ఎన్నికల సభలో మాట్లాడుతూ, మోదీని గెలిపిస్తే భారత రాజ్యాంగాన్ని రద్దుచేస్తాడని అన్నారు. ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రాతో పాటు రాహుల్ గాంధీపై అవినీతి ఆరోపణలు, కోర్టు కేసులున్నాయి. కాబట్టి ఆమెకు భయం ఉండటం సహజం. సర్వేల్లో పేర్కొన్నట్లు మోదీ గనుక మళ్లీ ప్రధాని అయితే- చాలామంది విపక్ష ప్రముఖులు రాజకీయ సన్యాసం తీసుకోవాల్సిందే.
***
మన దేశానికి స్వాతంత్య్రం తీసుకొని రావాలన్న సంకల్పంతో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 130 ఏళ్ల క్రితం ఆవిర్భవించింది. ఎన్నో ఏరులు సెలయేళ్లు కలిసి మహానదిగా మారినట్లు- మితవాద, అతివాద, ఉగ్రవాదాది భిన్న మార్గాలవారంతా ఒకే గొడుగు నీడన పనిచేశారు. ఎవరు ఏ మార్గం అనుసరించినా అందరి లక్ష్యం ఒకటే- దేశానికి స్వాతంత్య్రం రావటం. 1947లో స్వాతంత్య్ర సిద్ధి జరిగాక ఎవరిదోవ వారు చూసుకున్నారు. అప్పటివరకు కాంగ్రెస్ పంచన ఉన్న షేక్ ముజిబుర్ రహమాన్, మహమ్మద్ ఆలీ జిన్నా, షౌకత్‌ఆలీ వంటివారు ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ముస్లిములు, హిందువులు వేరే వేరే జాతులు- మతస్థులు కాబట్టి ప్రత్యేక దేశాలు ఉండాలన్నది వారి సిద్ధాంతం. ఆమేరకు ఇండియా, పాకిస్తాన్‌లు ఏర్పడ్డాయి. ఐనా భారతదేశంలో గణనీయంగా ముస్లిములు మిగిలిపోయారు. మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ తమ జీవితమంతా ముస్లిముల సంక్షేమం కోసమే పరితపించారు. ‘నేను హిందువును అయినా ముస్లిం మతవిశ్వాసాలు కలవాడిని’ అని నెహ్రూ చేసిన ప్రకటన చరిత్ర విద్యార్థులందరికీ సుపరిచితమే. రఫీ అహ్మద్ కిద్వాయ్, వౌలానా అజాద్, ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్, జాకీర్ హుస్సేన్ ఇలా ఎందరో ముస్లిం నేతలు అగ్రశ్రేణి పదవులు అధిరోహించారు. ఐనాసరే హిందూ, ముస్లిం సఖ్యత సాకారం కాలేదు. హిందువులు, ముస్లింలు కలిసి మెలిసి ఎందుకు జీవించలేకపోతున్నారు.
‘మాది బౌద్ధమతం- హిందూమతం కాదు’ అంటున్నది మాయావతి. బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవిత చరమాంకంలో బౌద్ధమతం స్వీకరించారు. మాయావతి, కాన్షీరాంలు దళిత క్రైస్తవులు. బౌద్ధం వారికొక ముసుగు మాత్రమే. ఆమాటకొస్తే గౌతమ బుద్ధుడు హిందూధర్మంలో సంస్కర్తగా జన్మించాడు. అహింస ఆయన మూల సిద్ధాంతం. ఇండియాలోని ముస్లింలు పాకిస్తాన్‌ను మిత్రదేశంగానూ, భాజపా- ఆర్‌ఎస్‌ఎస్-విహెచ్‌పి-్భజరంగదళ్ వంటి సంస్థలను శత్రువులుగానూ భావిస్తున్నారు. ఇండోనేషియా ముస్లిం దేశం. అక్కడ నేటికీ రామాయణాన్ని చదువుతారు. వారు తమ పిల్లలకు రాముడు, సీత, హనుమాన్ వంటి పేర్లు పెట్టుకుంటారు. తమది భారతీయ సంస్కృతి, ముస్లిం మతం అంటారు ఇండోనేషియా ప్రజలు. వారి అధ్యక్షుని పేరు సుకర్ణుడు.
ముస్లిం అయినంత మాత్రాన హిందువులను ద్వేషించాలా? గోవులను వధించాలా?? హిందువుల విశ్వాసాలను అవమానించాలా?? హిందూ దేవాలయాలను ధ్వంసం చేయాలని ముస్లిం మత గ్రంథాల్లో ఎక్కడా చెప్పలేదు. విగ్రహారాధన వద్దని మహమ్మద్ ప్రవక్త చెప్పాడు. అంతమాత్రాన విగ్రహాలను పూజించే ‘చాదస్తులను’ చంపాలని ఎక్కడా రాయలేదు.
***
స్వాతంత్య్రం వచ్చాక కాంగ్రెస్ పార్టీని రద్దు చేయవలసిందిగా మహాత్మా గాంధీ కోరినప్పటికీ జవహర్‌లాల్ నెహ్రూ వంటి వారు అంగీకరించలేదు. స్వాతంత్య్ర ఫలాలను తాము అనుభవించవలసిందేనని కాంగ్రెస్ పేరుతో ఎన్నికల్లో గెలిచారు. ఇది నచ్చని కమ్యూనిస్టులు ద్విపాత్రాభినయం వలే- ఒకవైపు పేదల కోసం పార్టీ పెట్టడం, మరొకవైపు కొందరు కాంగ్రెస్‌లోనే ఉంటూ తమ ఎజెండాను నెహ్రూపైకి రుద్దడం చేస్తూ విజయం సాధించారు. స్వాతంత్య్ర సమరయోధుల, త్యాగధనుల శకం 1960 వరకు కొనసాగింది. ఆ తర్వాత కేరళలో పట్టంధాను పిళ్లై, ఆంధ్రప్రదేశ్‌లో టంగుటూరి ప్రకాశం, తెలంగాణ ప్రాంతంలో స్వామి రామానందతీర్థ, యూపీలో కృపలానీ, బెంగాల్‌లో బీసీ రాయ్, తమిళనాడులో కామరాజ నాడార్, సి.రాజగోపాలాచారి వంటి నేతల యుగం ముగిసింది. చెట్టుపేరు చెప్పి కాయలమ్ముకునేవారు కాంగ్రెస్‌లో 1960 నుంచి మొదలైనారు. 1964లో సి.రాజగోపాలాచారి స్వతంత్ర పార్టీ స్థాపించాడు. రామమనోహర్ లోహియా 1950వ దశకంలోనే సోషలిస్టు పార్టీ పెట్టాడు. పండిత దీనదయాళ్ ఉపాధ్యాయ, శ్యాంప్రసాద్ ముఖర్జీల నేతృత్వంలో భారతీయ జనసంఘ్ పార్టీ ప్రారంభమైంది. నెహ్రూ తన కుటుంబ పాలన కోసం అడ్డం వచ్చిన వారినందరినీ అణచివేశాడు. ఇదే ఆధునిక భారతదేశ చరిత్ర.
ఆ తర్వాత- గాంధీయుగం నాటి సత్యం, అహింస, మద్యపాన నిషేధం, కుటీర పరిశ్రమలు, స్వదేశీ ఉద్యమం, రామరాజ్యస్థాపన వంటి ఆదర్శాలన్నీ కాంగ్రెస్‌లో అదృశ్యం అయ్యాయి. పదవుల కోసం తాపత్రయపడే నేతల సంఖ్య రానురానూ పెరిగింది. డబ్బు, పదవుల కోసం పార్టీలు మారడం నేడు ఆనవాయితీగా మారింది. ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోతే విపక్షంగా ఉండేందుకు కాంగ్రెస్ నాయకులు ఇష్టపడడం లేదు. తెలంగాణలో ప్రస్తుత పరిస్థితులే ఇందుకు నిదర్శనం. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కొద్దిపాటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెరాస శిబిరంలోకి వలస పోవడం రాజకీయాల్లో విలువల పతనాన్ని చెబుతున్నాయి. పార్టీ మారినపుడు తమకు, తమ వారసులకు టిక్కెట్లు ఇవ్వాలని వీరు షరతులు పెడుతున్నారు. 1947కు ముందు మహాత్మా గాంధీ వంటివారు నడిపిన కాంగ్రెస్‌కు, ఈరోజు రాహుల్ గాంధీ నడుపుతున్న కాంగ్రెస్‌కు ఎలాంటి సంబంధం లేదు. ఆనాటి చరఖా గుర్తుగల పార్టీకి, ఈనాటి భస్మాసుర హస్తం గుర్తుగల పార్టీకి ఏం సంబంధం ఉంది? కాకుంటే ముస్లిం సంతుష్టీకరణ అనే అంశం ఈనాటి కాంగ్రెస్‌లో మిగిలి ఉంది. కొందరు కాంగ్రెస్ నేతలు పాకిస్తాన్‌కు అనుకూలంగా మాట్లాడడం జాతి ద్రోహమే అవుతుంది. ప్రియాంక గాంధీ అన్నట్టు- జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఉపాధి అవకాశాలు కల్పించటంలో విఫలమైన మాట నిజమే. ఐతే దేశ భద్రతను ‘చిల్లర’ రాజకీయాలంటూ ఆమె విమర్శించడం సరికాదు. అలనాటి కాంగ్రెస్ మహానేతలే కశ్మీర్‌ను పాకిస్తాన్‌కు, టిబెట్‌ను చైనాకు ధారాదత్తం చేసిన మాట వాస్తవం కాదా? పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులపై మన వాయుసేన సర్జికల్ దాడులు జరపగా, ఆ దాడులు నిజమేనా? అని రాహుల్ గాంధీ, ఆయన అనుచరులు ప్రశ్నించడం జాతి ద్రోహం కాదా? రాజకీయ వైరంతో వ్యక్తిగత విమర్శలు చేయడం, శత్రుదేశాలకు మద్దతు పలకడం కాంగ్రెస్ నాయకులకే చెల్లింది. *

-ప్రొ. ముదిగొండ శివప్రసాద్