శిప్ర వాక్యం

వైనాడ్ ఎవరికి ‘వాటర్లూ?’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తుషార్ వెల్లపల్లి కేరళలోని వైనాడ్ ప్రాంతంలో హిందూ సామాజిక కార్యకర్త. ఆయన 2019 మే నెలలో జరిగే సార్వత్రిక ఎన్నికలలో వైనాడ్ నియోజకవర్గంనుండి హిందూ ధార్మిక సంస్థ పక్షాన ఎన్నికల బరిలోకి దిగాడు. లోక్‌సభకు ఈయన పోటీచేయడానికి జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యత లభించింది. ఎందుకంటే ఇక్కడినుండి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఏప్రిల్ 4వ తేదీ నామినేషన్ వేసాడు. ఈ నియోజకవర్గంలో లోగడ బి.జె..పి.కి తొమ్మిది శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇప్పుడు 2019లో శబరిమలైలోని మహిళల ప్రవేశానికి సంబంధించి ఉద్యమం జరిగింది. హిందూ సామాజిక కార్యకర్తలను అటు నక్సలైట్లు ఇటు సి.పి.యం నాయకులు పొట్టనబెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. వైనాడ్ అడవుల్లో మావోయిస్టు స్థావరాలున్నాయి. ఇక ఓట్లపరంగా చూస్తే 23 శాతం క్రైస్తవులు, 28 శాతం ముస్లింలు ఉన్నారు. ఈ ఓటర్ల మద్దతుతోనే దశాబ్దాలుగా కాంగ్రెసుపార్టీ అధికారంలోకి వస్తున్నది. కేరళ కాంగ్రెస్ అనబడే క్రైస్తవ పార్టీకి ఎ.కె.ఆంటోనీ నాయకుడు. ఈయన సోనియాగాంధీకి సన్నిహితుడు. ఉత్తరాది వదిలి దక్షిణాదికి రాహుల్‌గాంధీ రావటం సి.పి.యం. జీర్ణించుకోలేకపోతున్నది. వైనాడ్ కాంగ్రెస్‌కు వాటర్లూ అని సి.పి.యం. నాయకుడు ప్రకాశ్‌కారత్ ప్రకటించారు. ఈ అమూల్‌బేబీ గురించి భయం ఎందుకు? అన్నాడు సీనియర్ సి.పి.యం. నేత వి.ఎస్.అచ్యుతానందన్.
ఇటు తమిళనాడు అటు కర్ణాటక సరిహద్దుల్లో ఈ నియోజకవర్గం ఉండటంవలన ఈ రెండు రాష్ట్రాలనుండి కాంగ్రెసు ధనాన్ని కార్యకర్తలకు తరలించాలని ప్రయత్నిస్తున్నది. త్రిశూల్ జిల్లా సి.పి.యం. హత్యా రాజకీయాలకు ప్రసిద్ధి చెందింది. ఇక వైనాడ్‌లో ఐసిస్ రిక్రూట్‌మెంట్ సెంటర్లు ఉన్నారు. కేరళలోని ముస్లింలీగ్ 1947నాటి ముస్లిం లీగ్ కాదు ఇదొక మంచి సెక్యులర్ పార్టీ అని తిరువనంతపురంలోని కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు శశిధరూర్ ఈ ఉగ్రవాద సంస్థను సమర్ధించడానికి కారణం వారి ఓట్లను ఆశించి అని వేరే చెప్పనక్కరలేదు. ఇప్పుడు స్థానిక ముస్లింలు కాంగ్రెసు వెంట ఉంటే సి.పి.యం. అదృశ్యం అవుతుంది. సి.పి.యం వెంట ఉండే రాహుల్‌గాంధీ రాజకీయ జీవితం ముగుస్తుంది. ఐతే టైమ్స్‌నౌ సర్వే ప్రకారం కేరళలో 16 సీట్లు కాంగ్రెసు 3 లేక 4 పార్లమెంటు సీట్లు మాత్రమే సి.పి.యం. గెలుచుకోబోతున్నది.
***
రాజకీయ నాయకుల ఊకదంపుడు ఉపన్యాసాలు పక్కనపెడితే అధికారిక గణాంకాలు చూస్తే మనకు వాస్తవాలు బోధపడుతాయి. ‘బి.జె.పి. అగ్ర కులాల పక్షపాతి-దళిత వ్యతిరేకి’ అని ప్రచారం జరుగుతున్నది. ఇది నరేంద్ర మోడీకి దళితుల ఓట్లు దూరం చేయాలని మాయావతి వంటి దళిత నాయకులు చేస్తున్న కుట్రలో భాగమే మరి వాస్తవాలేమిటి?
* తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్‌ని పాలిస్తున్నప్పుడు పదిరికుప్పం, చుండూరు, నీరుకొండ ప్రాంతాల్లో దళితులపై దాడులు జరిగాయి.
2017లో ప.గో.జిల్లా గరగపర్రులో డా.అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడానికి వీలులేదని పోరాటం చేసింది తెలుగుదేశం నాయకులే. 2012లో వైఎస్‌ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీకాకుళం జిల్లా లక్ష్మీపురంలో దళితులపై దాడులు జరిగాయి. టి.ఆర్.ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణాలో సిరిసిల్లలో దళితులపై దాడులు జరిగాయి. అందులో ముగ్గురికి కిడ్నీ డామేజ్ కాగా 13 మంది చిత్రవధకు గురైనారు. కేరళలో సి.పి.యం, పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెసు నాయకుల దాడిలో దళితులు హత్యలకు గురిఅయినారు. ఐనా ఈ వార్తలను కొన్ని పత్రికలు తొక్కిపెట్టాయి.
సుప్రీంకోర్టు ఎస్.టి, ఎస్.సి. అత్యాచార నిరోధక చట్టంలో కొన్ని మార్పులు సూచించింది. వాటిని దళితులు వ్యతిరేకించి భారత్ బంద్ జరిపారు. వెంటనే బి.జె.పి ప్రభుత్వం 102వ రాజ్యాంగ సవరణ చట్టంచేసి దళితుల మనోభావాలను గౌరవించారు. అంతేకాదు అంబేద్కర్ పంచతీర్థాలు (జన్మభూమి విద్యాభూమి కార్యభూమి దీక్షాభూమి నిర్వాణ భూమి)లను బి.జె.పి. నిర్మించింది. మాయావతి మాత్రం దళితుల పేరు చెప్పుకొని లక్షల కోట్ల ఆస్తులు కూడబెట్టుకున్నది. ‘నాకు పూలదండలు వద్దు నోట్లదండలు వేయండి’ అని కోరింది. అటల్‌బిహారీ వాజపేయి, నరేంద్ర మోడీలు ప్రధానమంత్రులుగా ఉన్నప్పుడు దళితులు భారత రాష్టప్రతులు అయినారు. బి.జె.పి. జాతీయ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ దళితుడు. ఆమాటకొస్తే నరేంద్రమోడీ అట్టడుగు ఆర్థిక సామాజిక వర్గానికి చెందిన నిరుపేద. మరి బి.జె..పి దళిత విరోధి అని కాంగ్రెసు, కమ్యూనిస్టు, బహుజన సమాజవాది (బి.ఎస్.పి) పార్టీలు ప్రచారం చేయటం ఎంతవరకు సమంజసం?
***
తెలంగాణాలోని గద్వాలకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు డి.కె. అరుణ మాట్లాడుతూ కాంగ్రెసులో అంతర్గత ప్రజాస్వామ్యం లేదనీ అణచివేత ధోరణి ఉన్నదని ఆరోపించారు. ఆమాట దాదాపు ముప్పది సంవత్సరాల క్రితమే శ్రీమతి నన్నపనేని రాజకుమారి అన్నారు. ‘గాంధీభవన్ బ్రాందీభవన్‌గా మారింది కాబట్టి నేను పార్టీ వదిలి పెడుతున్నాను’ అని ఆమె ప్రకటించారు. నిజమే! కూరలో కరివేపాకు అనే సామెత మనకు గుర్తుంది. జీవితమంతా నిర్విరామంగా పార్టీకోసం ధారపోసిన అజాతశత్రువు తెలుగువారి ముద్దుబిడ్డ పి.వి. నరసింహారావు మరణిస్తే కనీసం ఆయన అంత్యక్రియలు కూడా శ్రీమతి సోనియాగాంధీ, అహ్మద్‌పటేల్ సరిగ్గా జరగనీయలేదు. అంత కక్ష ఎందుకు? ఎందుకంటే తన అభిమతానికి భిన్నంగా పి.వి. భారత ప్రధాని అయినాడు. అందుకు? దళిత నాయకుడు అజాతశత్రువు అమాయకుడు అయిన టి. అంజయ్యను హైదరాబాదు బేగంపేట విమానాశ్రయంలో కిందికి గుంజి నిందిస్తే అంజయ్య ఏడుస్తూ వెళ్లిపోయిన సన్నివేశం నాకింకా గుర్తుంది. మరి కాంగ్రెసు కమ్యూనిస్టులు దళిత మిత్రులు- బి.జె.పి. దళిత విరోధి అనే ప్రచారం దుర్మార్గం కాదా?
మొన్న మునివాహనాళ్వార్ జయంతి రోజున సికిందరాబాదులో రంగరాజన్ (చిలుకూరు బాలాజీ దేవాలయ అర్చకుడు) ఒక దళితుణ్ణి భుజాలమీదికి ఎక్కించుకొని ఊరేగింపు జరపటం మనమంతా చూచాము.
***
ఎన్నికల కాలంలో విజయంకోసం ఎవరు ఎన్నిరకాల అబద్ధాలైనా చెపుతుంటారు. ఐతే ప్రజలు వివేచనతో అందలి సత్యాసత్యాలను విశే్లషించుకోవాలి. ఒమర్ అబ్దుల్లా నిన్న మాట్లాడుతూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రధానమంత్రి కావాలని కోరాడు. ఇతడు షేక్‌అబ్దుల్లా మనుమడు ఫరూక్ అబ్దుల్లా కొడుకు. వీరు వేర్పాటువాదులు జవహర్‌లాల్ నెహ్రూకు షేక్ అబ్దుల్లాకు మధ్యగల ఆత్మీయత దృష్ట్యా కాశ్మీరు సమస్యను జటిలం చేయటంతోబాటు కాశ్మీరును వేర్పాటువాదుల అడ్డాగా, రావణకాష్టంగా మార్చింది కాంగ్రెసు పార్టీ. 1950లో కాశ్మీరుకు ప్రత్యేక రాజ్యాంగం ప్రత్యేక ప్రధాని ప్రత్యేక జాతీయ జెండా ఉండకూడదని శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ సత్యాగ్రహం చేస్తే ఆయనను జైలులోపెట్టి, హత్యచేయించారు. ఈ పాపం నుండి నెహ్రూ-అబ్దుల్లా తప్పించుకోజాలరు. స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలు దాటినా కాశ్మీరుకు ప్రత్యేక ప్రధానమంత్రి కావాలని ఒమర్ అబ్దుల్లా అంటుంటే అతనికి ఏమీ చేయలేని స్థితిలో భారతదేశంలోని రాజకీయ పార్టీలు ఉండిపోయాయి.
శ్రీమతి ఇందిరాగాంధీ కాలంలోని పార్థసారథి కమిటీ తీర్మానాలు గుర్తున్నాయా? 1990లో 6 లక్షల మంది కాశ్మీరీ పండిట్లను తరిమివేసి డెమోగ్రఫీ మార్చటం గుర్తుందా? నిన్న పుల్వామాలో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ భారత సి.ఆర్.పి.ఎఫ్. జవాన్లను 45 మందిని హత్యచేయటం గుర్తుందా? ఇవేవీ రాహుల్‌గాంధీకి పట్టవు. చైనా డొక్లాంలో భారత భూభాగాలు ఆక్రమిస్తుంటే ఈయన చైనా రాయబార కార్యాలయంలో జరిపిన రహస్య సంభాషణలేమిటో బయటపెట్టారా? ఇస్లామిక్ ఉగ్రవాదం ఈయనకు కన్పడలేదు. సరికదా ‘హిందూ ఉగ్రవాదం’ అనే పదాన్ని ఈయన మిత్రులు శశిథరూర్, మణిశంకర్ అయ్యర్, దిగ్విజయ్‌సింగులు సృష్టించారు.

-ప్రొ. ముదిగొండ శివప్రసాద్