శిప్ర వాక్యం

దేవుళ్లంతా ఒకటి కాదు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఏకం సత్ విప్రాః బహుధా వదంతి’ అని ఋగ్వేదంలో ఒక మంత్రం ఉంది. దీని అర్థం ఏమిటంటే- ‘ఉన్నది ఒకటే.. పండితులు వివిధ నామాలతో పిలుస్తున్నారు’ అని. ఋగ్వేదంలో లక్ష్మి, దుర్గ, శివుడు, విష్ణువు ఉషస్సు, అగ్ని, ఇంద్రుడు, అశ్వినీ దేవతలు.. ఇలా ఎందరెందరో దేవీదేవతలున్నారు. ఐనా మొత్తం సౌర మంత్రాలే అని సారాంశం. అయితే, అందరు దేవతలూ ఒకటేననే పరమసత్యాన్ని ఇస్లాం, క్రైస్తవ మతాలు అంగీకరించవు. కొద్ది రోజుల క్రితం లోక్‌సభలో నూతన సభ్యుల ప్రమాణ స్వీకారం సందర్భంగా ఎంఐఎం పార్టీకి చెందిన అసదుద్దీన్ ఒవైసీ ‘అల్లాహో అక్బర్’ అని గట్టిగా అరిచాడు. అల్లా మాత్రమే సర్వేశ్వరుడు అని ఆయన తన గళం వినిపించారు. మరి రాముడు, కృష్ణుడు, శివుడు వంటి దేవతల మాటేమిటి? వాళ్లెవరూ దేవతలు కారా? కొందరు మతోన్మాదులు తమ సిద్ధాంతాలను చెప్పుకోవడానికే పరిమితం కాలేదు. వారు విపరీత చర్యలకు సైతం సిద్ధపడ్డారని మన చరిత్రలో ఎన్నో దాఖలాలున్నాయి.
కరీంనగర్ జిల్లాలో కాళేశ్వరం ఉంది. అక్కడి కాళేశ్వరస్వామి దేవాలయాన్ని కొందరు నేలమట్టం చేశారు. మధురలో శ్రీకృష్ణదేవాలయం విధ్వంసకాండకు బలైంది. అయోధ్యలో రాముడి గుడి నేలకూల్చి అక్కడ మరో మతానికి చెందిన ప్రార్ధనా మందిరం కట్టారు. వారణాసిలో ఇప్పుడు మనం పూజించే కాశీవిశే్వశ్వర లింగం అసలైనది కాదన్న వాదనలు ఉన్నాయి. ఇక్కడి జ్యోతిర్లింగాన్ని ఔరంగజేబు పగలగొట్టాడు. గుజరాత్‌లోని సోమనాథ జ్యోతిర్లింగాన్ని గజనీ మహమ్మద్ ధ్వంసం చేయించాడు. శ్రీరంగంలోని శ్రీమహావిష్ణువు దేవాలయం ధ్వంసమైంది. అక్కడి మూల విరాట్టును వైష్ణవులు తిరుపతి తరలించారు. అదే నేటి గోవిందరాజస్వామి విగ్రహం. ఈ వివరాలన్నీ కంప రాయలు భార్య గంగాదేవి రచించిన మధురా విజయం అనే సంస్కృత గ్రంథంలో ఉన్నాయి. ఇజ్రాయిల్‌లో యూదు మతం ఉంది. వారు క్రైస్తవులను దగ్గరికి రానివ్వరు. చైనాలో మసీదులు, చర్చిలు ఉండవు. రష్యాలో స్టాలిన్ అధికారంలోకి రాగానే 1920లో వందలాది చర్చిలను నేలమట్టం చేశాడు. అన్ని మతాలూ సమానమేనని కమ్యూనిజం అంగీకరించదు. మతం నల్లమందు వంటిది అని వారి సిద్ధాంతం. అందువల్లనే వారు నిరంతరం హిందూ దేవీదేవతలను, వారి పూజా విధానాలను, పండితులను అవమానిస్తూ ఉంటారు. హిందూ మేధావులు, రచయితలు ముస్లింలను అక్కున చేర్చుకుంటూ ఉంటారు. మతం మత్తుమందు అయితే- అన్ని మతాలు మత్తుమందు కావాలి కదా? ఒసామా బిన్ లాడెన్‌లు, అఫ్జల్‌గురులు, జాకీర్ నాయక్‌లు, ముక్దుం మొహిద్దీన్‌లు హిందూ సెక్యులర్ నేతలకు స్నేహితులు. ఒక మతానికి చెందిన దేవుడు అందరికీ దేవుడని లోక్‌సభలో ఎలా అంటారు? క్రైస్తవులలోని ప్రొటెస్టెంటులే క్రీస్తును సర్వరక్షకుడు అని అంగీకరించటం లేదు. ఇక హిందువులు, యూదులు, పార్సీలు ఎట్లా అంగీకరిస్తారు? ఇజ్రాయిల్‌లో యూదులను మతం మార్చడానికి ఏ క్రైస్తవుడైనా ప్రయత్నిస్తే నేడు కఠిన శిక్షలున్నాయి. ఇండియాలో మాత్రం ప్రతి నిత్యం వేల సంఖ్యలో హిందూ మతం నుంచి మత మార్పిడులు జరుగుతున్నాయి. మరి అన్ని మతాలూ ఒకటే, అంతా సమానమే అని చెప్పటం అబద్ధం కాదా? అన్ని మతాలూ ఒకటి కావు, మతపరమైన కోణంలో అందరూ సమానం కాదు.
అన్ని మతాలూ ఒకటే- అంతా సమానమే అయితే- హనుమాన్ చాలీసాను చర్చిలలో, మసీదుల్లో పారాయణ చేయగలరా? హిందూ దేవాలయాల్లోనూ కమ్యూనిస్టు పార్టీ ఆఫీసుల్లోనూ ‘హలలూయా’ అని అనగలరా? సున్నీలు అనే తెగవారు హిందువులను, క్రైస్తవులను, కుర్దులను మాత్రమేకాదు ముస్లిం మతానికే చెందిన షియాలను, సూఫీలను సిరియాలో ఎందుకు చంపుతున్నారు? షియాలు వారి దృష్టిలో అంటరానివారు. అన్యమతస్థులైన క్రైస్తవులపైన, హిందువులపైన ఆత్మాహుతి దాడులు నిర్వహిస్తే తమకు మోక్ష ద్వారాలు తెరిచి ఉంటాయని ఒసామా బిన్ లాడెన్ చెప్పాడు. అందుకే అమెరికాలోని క్రైస్తవుల ఎంపైర్ బిల్డింగ్‌ను నేల కూల్పించాడు. తమిళులు దశాబ్దాలుగా ఉగ్రవాదాన్ని పాలుపోసి పోషిస్తున్నారు. కోయంబత్తూరులో ఐసిస్ ఉగ్రవాద స్థావరాలున్నాయి. దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి, ఆయన అనుచరులు తమిళ ఈలం (ప్రత్యేక తమిళ దేశం) నినాదాన్ని సమర్ధించారు. తన తండ్రి రాజీవ్ గాంధీ హంతకులను సమర్ధించిన డీఎంకే పార్టీతో నేడు రాహుల్ గాంధీ ఎలా పొత్తును కొనసాగిస్తున్నాడు. సౌదీ అరేబియాలో అల్లాహో అక్బర్ అనవచ్చు. అది వారి మతాచారం. కాని భారత్ పార్లమెంట్‌లో ‘అల్లాహో అక్బర్’ అనవచ్చునా?
***
ప్రమాణ స్వీకారం సందర్భంగా ‘వందేమాతరం’ అని అనకూడదు. అలా అనడం ఇస్లాం మతానికి విరుద్ధం అంటూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ షఫీకుర్ రహమాన్ బర్క్ అనటం సంచలనం సృష్టించింది. ఇక్కడ కొన్ని అంశాలు గుర్తించాలి. ఒకటి ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ ఒకనాటి రాంమనోహర్ లోహియా పెట్టిన జాతీయపార్టీ కాదు. ఇదొక పాకిస్తాన్ అనుకూల పార్టీ. ఇక రెండవ అంశం. మన దేశంలోని ముస్లింలు ఎన్నటికీ ‘వందేమాతరం- భారత్ మాతాకీ జై’ అనడానికి ఇష్టపడరు. ఇక మూడవ అంశం కాంగ్రెస్ పార్టీ ముస్లిం సంతుష్టీకరణ మీద తన అస్తిత్వాన్ని కాపాడుకుంటున్నది. రాహుల్ గాంధీ ఆమధ్య ఒక ఎన్నికల సభలో మాట్లాడుతూ, ‘కాంగ్రెస్ ముస్లిముల పార్టీ. అలాంటప్పుడు ముస్లింలు మూకుమ్మడిగా కాంగ్రెస్‌కు కాకుండా భాజపాకు ఎట్లా ఓటువేస్తారు?’ అన్నారు. ‘సబ్‌కా సాథ్ సబ్‌కా వికాస్ సబ్‌కా విశ్వాస్’ అనే నినాదం పాకిస్తాన్‌లో లేదు. చైనాలో లేదు. సిరియాలో లేదు. సౌదీ అరేబియాలో లేదు. ఇదొక కఠోర వాస్తవం.
***
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ చారిత్రక విజయం సాధించడానికి చాలా కారణాలున్నాయి. ముస్లింలు, దళితులు, కమ్యూనిస్టులు జనసేనకు మద్దతునివ్వటం ద్వారా చంద్రబాబుకు పడవలసిన ఓట్లు చీలిపోయాయి. భాజపా వారు చంద్రబాబును ఓడించాలనే పట్టుదలతో వైకాపాకు ఓట్లను బట్వాడా చేశారు. జగన్‌కు ఒక చాన్స్ ఇచ్చి చూద్దామని ప్రజలు నిర్ణయించుకున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు దాదాపు అదృశ్యం అవుతాయి. ఆ శూన్యాన్ని పూరించాలని భాజపా అగ్రనేతలు రంగంలోకి దిగారు. మరి కొద్దిరోజులలో ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి భాజపాలో చేరే తెదేపా, కాంగ్రెస్ నేతల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. *

ప్రొ. ముదిగొండ శివప్రసాద్