శిప్ర వాక్యం

ఎవరిని ఎవరు ఓడించారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాంగ్రెస్ పార్టీని నరేంద్ర మోదీ ఓడించాడా? లేదు.. కాంగ్రెస్ వారే తమ సొంత అభ్యర్థులను ఓడించారు. ఈ విషయాన్ని రాజస్థాన్‌కు చెందిన మేయర్ జ్యోతి ఖండేల్‌వాల్ బహిరంగంగా ప్రకటించారు. జైపూర్‌లో మీడియాతో ఆమె మాట్లాడుతూ, తన వాదనకు సంబంధించి సాక్ష్యాధారాలను చూపెట్టి కాంగ్రెస్‌లోని లుకలుకలను బహిర్గతం చేశారు. రాజస్థాన్ పీసీసీ ఉపాధ్యక్షురాలు అర్చనాశర్మ, ఆమె భర్త జైపూర్‌లో తమ పార్టీ ఓటమికి కారణం అని ఆమె ఆరోపించారు. ఇక- మధ్యప్రదేశ్‌లోని గుణ నియోజకవర్గంలో జ్యోతిరాదిత్య సింధియా ఓడిపోవటం అసంభవం. స్థానిక కాంగ్రెస్ నేతలే ఆయనను ఓడించారు. ఎందుకు? అంటే- ఆ వివరాలు ఆ పార్టీ నేత, మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ వద్ద, ప్రస్తుత సీఎం కమల్‌నాథ్ వద్ద, పార్టీ అధినేత రాహుల్ గాంధీ వద్ద ఉన్నాయి. కర్నాటకలో జెడిఎస్-కాంగ్రెస్ సంకీర్ణ కూటమిని నడుపుతున్న ముఖ్యమంత్రి కుమారస్వామి తండ్రి అయిన దేవెగౌడను కాంగ్రెస్ నాయకుడు సిద్ధరామయ్య ఓడించాడు? ఇందుకు చాలా కారణాలున్నాయని కుమారస్వామి అంగీకరిస్తున్నారు.
ఢిల్లీలో లోక్‌సభ బరిలో నిలిచిన కాంగ్రెస్ నాయకులు అజయ్ మాకెన్, షీలా దీక్షిత్, కపిల్ సిబల్ వంటివారు ఎందుకు ఓడిపోయారు? వీరి ఓటమికి కారణాలను నరేంద్ర మోదీపైనే నెట్టలేము. ఏపీలోని గుంటూరు, కృష్ణా జిల్లాల్లో సొంత సామాజిక వర్గం వారే చంద్రబాబు నాయుడుకు వ్యితిరేకంగా ఎందుకు ఓట్లు వేశారు? అశోక్‌గజపతి రాజు వంటి సీనియర్ తెదేపా నేతల ఓటమి అసంభవం. వీరు ఎందుకు పరాజయం పొందారు? అంటే లంకలోనే విభీషణులున్నారు. మిగతా రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ను కాంగ్రెస్ వారు, ఏపీలో తెదేపాను అదే పార్టీవారు ఓడించారు. ఇందుకు మిగతా విపక్షాలు సైతం అతీతం కాదు. ఏపీలో ‘్ఫ్యన్’ (వైకాపా) గాలిలో భాజపా వారు సేదతీరారు.
శాంతి భద్రతలు రాష్ట్రాలకు సంబంధించిన అంశం. అయితే బెంగాల్, కేరళ ప్రభుత్వాలు తామే సమస్యలను సృష్టిస్తున్నాయి. బెంగాల్‌లో మమతా బెనర్జీ ముఖ్యమంత్రి అయ్యాక ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలు సుమారు వందమంది హతమయ్యారు. బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధిస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచన కేంద్రానికి వచ్చింది. అలా చేస్తే ప్రజల్లో మమతా బెనర్జీపై సానుభూతి పెరిగి ఎన్నికల్లో లబ్ధి పొందే వీలుందని ఆ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు కేంద్రానికి చెప్పాడట! రాజకీయ పో రాటంలో ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. మమతా బెనర్జీ పాలనకు వ్యితిరేకంగా పోస్టుకార్డు ఉ ద్యమం జరిగింది. దీనివల్ల ప్ర యోజనం ఏమిటి? కేంద్ర భద్రతాదళాలనే లెక్కచేయని మమత పోస్టుకార్డు ఉద్యమానికి స్పందిస్తుందా? ప్రధాని పదవిని ఆశించి భంగపడిన ఆమె ఇపుడు మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. హింస ద్వారా రాజ్యాధికారం వస్తుందనే సిద్ధాంతాన్ని బెంగాలీ రాజకీయవేత్తలు నమ్ముతున్నారు. దాదాపు నాలుగు దశాబ్దాలపాటు సీఎం పదవిని నిర్వహించిన సీపీఎం నేత జ్యోతిబసు హయాంలోనూ హింసాత్మక రాజకీయాలు నడిచాయి. నక్సల్బరీ సాయుధ పోరాటం బెంగాల్‌లోనే పుట్టింది. ‘మనకున్నదొకేదారి చారుముజుందారి’ అనే నినాదాలను అప్పట్లో వరంగల్‌లోని గోడలపైనా రాశారు. అరాజకశక్తులు బెంగాల్ ప్రజాజీవితాన్ని కలుషితం చేశాయి. ఇపుడు అనేక కుంభకోణాల ఆరోపణలను ఎదుర్కొంటున్న మమత సైతం పాలనపై పట్టు కోల్పోవడంతో శాంతి భద్రతలు దిగజారుతున్నాయి.
బంగ్లాదేశ్ శరణార్థుల సమస్య వంటి అనేక అంశాలు మమతను చుట్టుముట్టాయి. ప్రధాని మోదీపై ఆమె వ్యక్తిగత నిందలను వేశారు. మోదీకి నిరసనగా ‘ప్రజాయుద్ధం’ వస్తుందని మమత హెచ్చరించారు. కేరళ, బెంగాల్‌లో శాంతి భద్రతల సమస్యపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా దృష్టి సారించాలి. బెంగాల్‌లోకి మోదీ, అమిత్ షా అడుగుపెట్టకూడదని మమత హెచ్చరించడం వివాదాన్ని మరింతగా రాజేసింది. మమతకు మద్దతు పలికిన చంద్రబాబు, దేవగౌడలకు ఇటీవలి ఎన్నికల్లో దారుణ ఓటమి ఎదురైంది. తన మేనల్లుడికి రాజ్యాధికారం కట్టబెట్టాలని మమత కుటుంబ పాలనకు తెరలేపింది. ఏక కుటుంబ పాలనను ఎక్కువకాలం ప్రజాస్వామ్యంలో జనం హర్షించరు. అమేధీలో రాహుల్ గాంధీ ఓటమి ఇందుకు సాక్ష్యం. రాబోయే కాలంలో భవానీపూర్ (బెంగాల్)లో మమతకు ఇదే మాదిరి చేదు అనుభవం తప్పదేమో?
***
కేంద్ర మంత్రివర్గంలో విదేశాంగ మంత్రిగా రాంమాధవ్ పదవీ బాధ్యతలు స్వీకరిస్తాడని చాలామంది అనుకున్నారు. కాని ఆ బాధ్యతను జైశంకర్‌కు అప్పగించారు. ఈయన అనుభవస్థుడైన దౌత్య అధికారి. ఆర్భాటం లేకుండా తన పని తాను చేసుకుంటూ పోతుంటాడు. ఒకవైపు పాక్- ఇండో-చైనా సంబంధాలు బాగాలేవు. మరోవైపు ఇరాన్ నుండి చమురు కొనకూడదని ఇండియాపై అమెరికా ఆంక్షలు విధించింది. భారత్‌లో మత మార్పిడులకు అమెరికా, బ్రిటన్, నెదర్‌లాండ్స్, సౌదీ అరేబియా నుండి భారీగా నిధులు వస్తున్నాయి. ఈ దశలో విదేశాంగ విధానం కత్తిమీద సాములాంటిది. కశ్మీర్‌లో ఆర్టికల్ 370ను రద్దు చేస్తే పాకిస్తాన్ యుద్ధ వాతావరణం సృష్టిస్తుంది.
***
2019-2024 మధ్యకాలం భారత్‌కు చాలా కీలకమైనది. కాంగ్రెస్, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు అంతరించే దశకు చేరుకుంటున్నాయి. జాతీయ పార్టీగా భాజపా మాత్రమే మిగులుతుందేమో? వివిధ ప్రాంతీయ పార్టీల నుండి సవాళ్లను భాజపా ఎదుర్కోవలసి ఉంటుంది. ఆక్రమిత కశ్మీర్‌కు రాబోయే ఐదేళ్లలో విముక్తి జరిగి తీరాలి. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగ 42వ సవరణతో ‘సెక్యులర్’ అనే పదాన్ని బలవంతంగా ప్రవేశపెట్టింది. ఇది కమ్యూనిస్టులు చేయించిన విద్రోహం. వెంటనే నూతన రాజ్యాంగ సవరణ ద్వారా ఆ పదాన్ని తొలగించాలి. ‘భారతదేశం’ అంటే సెక్యులర్ దేశం అనే అర్థం. ప్రపంచమంతా తరిమివేయబడిన యూదులకు, పార్సీలకు ఇండియా మాత్రమే రక్షణ కల్పించింది. ప్రపంచంలో ముస్లిములు సుఖజీవనం చేసే ఏకైక దేశం ఇండియా మాత్రమే కాబట్టి సెక్యులర్ నాటకం విరమించటం మంచిది.
*