శిప్ర వాక్యం

‘అశ్లీల మార్క్సిజం’ ఓ అవలక్షణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమాజంలో కొన్ని ఆర్థిక వర్గాలున్నాయి. అవి- 1. నిరుపేదలు 2.మధ్యతరగతి వారు 3. ఉన్నతవర్గం 4. కుబేరులు. ఈ వర్గాలనే ‘పూర్ - మిడిల్ క్లాస్ - అప్పర్ మిడిల్ క్లాస్ - రిచ్’ అని పిలుస్తారు. వర్గరహిత సమాజం స్థాపించాలంటే ధనికుల సంపదను నిరుపేదలకు పంచాలి. గనులు, కర్మాగారాలు, పరిశ్రమలపై ఆధిపత్య వర్గం ఒకటి ఉంటే శ్రామిక వర్గం మరొకటి వుంది. ఈ రెండు వర్గాల మధ్య ఘర్షణ అనివార్యం. రాజ్యాల నిర్మాణం- పాలక వర్గాలు- పురోహిత వర్గాలు- వీరంతా దరిద్రులను పీడించేవారే- అందుకని సాయుధ విప్లవం ద్వారా సమ సమాజం నిర్మించాలి. ఇంచుమించు ఇదే మార్క్సిజం సిద్ధాంతంలోని సారాంశం.
1917లో రష్యాలో సాయుధ విప్లవం ద్వారా స్టాలిన్, లెనిన్ ప్రభృతులు అప్పటి జార్ చక్రవర్తి ప్రభుత్వాన్ని కూల్చివేసి ‘సోషలిష్టు రాజ్యం’ పేరుతో నూతన వ్యవస్థను మొదలుపెట్టారు. అలాగే, 1948లో చైనాలో తత్పూర్వం వున్న రాజరికాన్ని నిర్మూలించి మావో సేటుంగ్ నేతృత్వంలో కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని స్థాపించారు. కాగా, అమెరికాలో పెట్టుబడిదారీ వ్యవస్థ ఉంది. ఇక్కడ కొంతమంది సంపన్నుల అధీనంలో మొత్తం రాజ్యాధికారం, ఆర్థిక వనరులు కేంద్రీకృతమై ఉన్నాయి. ఇందుకు ప్రత్యామ్నాయంగా కార్మిక రాజ్యం రావాలని ఆకాంక్షించారు. దీనికే కమ్యూనిస్టు ప్రభుత్వం అని పేరు. రష్యా, చైనా, క్యూబా, లిబియా వంటి చాలా దేశాల్లో సోషలిస్టు ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఇవి తతూర్వం ఉన్న రాజరికం కన్నా నిరంకుశంగా ప్రజల ప్రాథమిక హక్కులను హరించాయి. స్వంత పార్టీలో కూడా ఎదురుతిరిగిన వారిని నిర్దాక్షిణ్యంగా హతమార్చారు. వాక్ స్వాతంత్య్రం, పత్రికా స్వేచ్ఛ, భావ ప్రకటన, ఆర్థిక స్వాతంత్య్రం వంటివి కమ్యూనిస్టు దేశాల్లో ఉండవు. కళ, విద్య, వైద్యం, ఉపాధి- అన్నింటినీ ప్రభుత్వమే నియంత్రిస్తుంది.
ఛార్లెస్ డికెన్స్ ‘ఏ టేల్ ఆఫ్ టూ సిటీస్’ అనే నవల వ్రాశాడు. ఇది ‘రెండు మహానగరాలు’ పేరుతో తెలుగులోకి అనువాదంగా వచ్చింది. అప్పటి రాజరిక వ్యవస్థను ఫ్రెంచి విప్లవకారులు కూల్చివేయటం ఇందలి ఇతివృత్తం. ఆ తర్వాత అంతకన్నా భయంకరమైన నిరంకుశ ప్రభుత్వం నెపోలియన్ పార్టీ నేతృత్వంలో వచ్చింది. సరిగ్గా కమ్యూనిజం విషయంలో కూడా ఇదే జరిగింది. సైనిక నియంత - కమ్యూనిస్టు రాజ్యాధిపతి ఇరువురూ ఒకడే అనాడు. ఇలాప్రజల ప్రాథమిక హక్కులు సామ్యవాద దేశాల్లో హరింపబడ్డాయి. భారత్‌కు సంబంధించినంత వరకు 1925 తర్వాత మెల్లగా కమ్యూనిస్టు ఉద్యమం ప్రారంభమైంది. ప్రధానంగా వీరు రైతు కూలీల తరఫున పోరాటాలు చేశారు. జమీందారీ వ్యవస్థ నిర్మూలించాలని కోరుకున్నారు. ‘దునే్నవాడిదే భూమి- అన్నానికి హామీ’ వంటి నినాదాలు ఇచ్చారు. ఇందుకోసం కొందరు నాయకులు శ్రమించి పనిచేశారు. గాంధేయ అహింసా ఉద్యమాలను, నేతాజీ సుభాష్ చంద్రబోస్ పోరాటాలను కూడా వీరు వ్యతిరేకించారు. ఈ దశలోనే కేశవరావు బలీరాం హెడ్గేవార్ నేతృత్వంలో భారత జాతీయ సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమం మొదలయింది. దీనికే ‘రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్’ అని పేరు. వీరిని కమ్యూనిస్టులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఎందుకంటే జాతీయవాదం బలపడితే అంతర్జాతీయ సోషలిస్టు సామ్రాజ్యం నిర్మాణం కాజాలదు- అని వీరి మూల సిద్ధాంతం.
కమ్యూనిస్టులు ఆర్థిక సమానత్వం అనే అంశంపై దృష్టి సారించారు. స్థానిక సంస్కృతి నాగరితా సాహిత్యాలను నిర్మూలిస్తే తప్ప నూతన సృష్టి జరుగదని తీర్మానించారు. అందుకే రామాయణ భారత భాగవతాలను కాళిదాస భాస భవభూతి రవీంద్ర అరవింద్ వివేకానందులను పత్రికలలో ముద్రించడానికి వీలులేని అశ్లీల భాషలో తిట్టారు. సామ్యవాదపు మత్తులో కమ్యూనిస్టులు వ్యక్తి నిర్మాణాన్ని విస్మరించారు. ‘నీవు దేశభక్తునివి కాకూడదు. ప్రేమానురాగాలను వదలిపెట్టాలి. తాగినా, వ్యభిచరించినా, హత్యలు చేసినా తప్పులేదు. సంప్రదాయవాదులను వర్గశత్రువులను బలంగా ద్వేషించాలి. హింస విప్లవానికి మంత్రసాని’- ఇలాంటి సిద్ధాంతాలను ప్రచారం చేశారు. దీనికి తొలి దశలో రష్యా, ఆ తర్వాత చైనా సామ్రాజ్యవాదం బాగా సహాయ సహకారాలు అందజేశాయి. 1990లో యునైటెడ్ సోషలిస్టు సోవియట్ యూనియన్ (యుఎస్‌ఎస్‌ఆర్) కూలిపోయేసరికి కమ్యూనిస్టులకు చైనా మాత్రమే గురుపీఠంగా మిగిలిపోయింది.
తెలుగు ప్రాంతానికి సంబంధించి ‘అశ్లీల కమ్యూనిజం’ ఆవిర్భావ వికాసాలకు ఇది నేపథ్యం. నిజానికి ఇది అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది. సరిగ్గా ఈ దశలో భారత రాజకీయ రంగంలోకి బాబా సాహెబ్ అంబేద్కర్ ప్రవేశించారు. ఆనయ ‘కులం - వర్ణం’ అనే అంశాలపై ప్రధానంగా దృష్టి సారించారు. తమ వర్గ పోరాటానికి అంబేద్కర్ అడ్డంకి అని కమ్యూనిస్టులు భావించి ఆయనను వ్యతిరేకించారు. చాలా దశాబ్దాల తర్వాత వ్యూహాత్మకంగా ‘లాల్ -నీల్ జిందాబాద్’ అనే నినాదాన్ని కమ్యూనిస్టులు అందుకున్నారు. ఇక ముస్లిం సంతుష్టీకరణ విషయంలో అన్నివర్గాలవారు ఒకరితో ఒకరు పోటీపడ్డారు. దేశ విభజన తర్వాత కూడా పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఓట్ల రాజకీయం దృష్ట్యా ముస్లిం క్రైస్తవ వర్గాలపై ఈ అగ్ర నాయకులు ఆధారపడ్డారు. వ్యక్తి శీలానికి (పర్సనల్ కారెక్టర్) వీరెవరూ ప్రాధాన్యాన్ని ఇవ్వలేదు. కేవలం ఆర్థిక అసమానతల తొలగింపు చాలు అని భావించారు. కుల వివక్ష లేని సమాజం రావాలంటే పురోహిత వర్గాల ఆధిపత్యం పోవాలని తీర్మానించారు. ముఖ్యంగా బహుజన నాయకులూ, కమ్యూనిస్టులూ బ్రాహ్మణ సామాజిక వర్గంపై దుమ్మెత్తిపోశారు. ఇది భరించలేని బ్రాహ్మణ యువకులు పెద్ద సంఖ్యలో అమెరికా, బ్రిటన్, న్యూజీలాండ్ వంటి దేశాలకు వలస వెళ్లిపోయారు. ఇక దేశంలో మిగిలిన బ్రాహ్మణ నాయకులు నంబూద్రిపాద్, ఏచూరి సీతారాం, హిరేన్ ముఖర్జీ, సోమనాధ చటర్జీ వంటివారు కమ్యూనిస్టు మతం పుచ్చుకుని కమ్యూనిస్టు పార్టీపై తమ ఆధిపత్యం కొనసాగించారు. తెలుగు సీమలో శ్రీశ్రీ, ఆరుద్ర, ఆత్రేయ, బూదరాజు రాధాకృష్ణ, రావి శాస్ర్తీ, చలం, శేషేంద్ర, సోమసుందర్ వంటి సోకాల్డ్ సామ్యవాద రచయితలంతా పోర్నో మార్క్సిస్టు రచనలు చేశారు. జీవితంలోను, సాహిత్యంలోను కళా సౌందర్యాల ఔచిత్యాన్ని పాటించనక్కరలేదు. విశృంఖలత్వం, అరాజకత్వం, అశ్లీలం, అసభ్య పదప్రయోగం చేయవచ్చు. నచ్చనివాటిని తీవ్ర పదజాలంతో నిందించాలి. డబ్బుమీదనే కాదు సౌందర్యం మీద కూడా సామూహిక పంపిణీ ఉండాలి. అంటే వ్యభిచారం తప్పుకాదన్నది వారి సిద్ధాంతం. ఈ సిద్ధాంతాలను చలం, శ్రీశ్రీ, ఆరుద్ర వంటివారు సమర్థించారు. దిగంబరకవులు బూతు రచనలు చేసి దానిని సాహిత్యోద్యమం అని భ్రమింపజేశారు. దేశవ్యాప్తంగా ఇదే ధోరణి కొనసాగింది. సంప్రదాయ సాహిత్య సంస్కృతులకు సమాంతరంగా విధ్వంస అశ్లీల సాహిత్యం నిర్మించారు. ఇందులో కొందరు రచయితలు కూడా ఉండటం గమనార్హం.
ఆధునికోత్తర యుగం (పోస్ట్ మోడర్న్ ఏజ్)లో సాహిత్య రాజకీయ కళారంగాలల్లో నైతిక విలువలకు తిలోదకాలిచ్చారు. కళా సాహిత్యాల చేత రాజకీయాలకు ఊడిగం చేయించి దానికి ‘సామాజిక స్పృహ’ అని పేరు పెట్టారు. ఇంకా ప్లెటానిక్ లవ్, స్ర్తి స్వేచ్ఛ వంటి ఉద్యమాల వెనుక కూడా ‘అశ్లీల మార్క్సిజం’ ఉంది. ఇస్లాంలో బహుభార్యాత్వం ఉంది. అందువల్ల రాచకొండ విశ్వనాథ శాస్ర్తీ వంటి సామ్యవాద రచయితలు ఇస్లాంలో చేరారు. కేరళలో సామ్యవాద ప్రభుత్వం తమ కార్యకర్తలు మహిళలపై అత్యాచారాల్లో పాల్గొన్నప్పటికీ కేసులు పెట్టకూడదంటూ పోలీసు శాఖను ఆదేశించింది. సీత, సావిత్రి, ద్రౌపది వంటి భారతీయ పురాణ మహిళలను అవమానిస్తూ గ్రంథాలు రచించడం అశ్లీల మార్క్సిజంలో అంతర్భాగమే. వీటికి పురస్కారాలు సైతం ఇప్పించుకున్నారు. ఎన్‌టిఆర్ వంటి దేశభక్తుడి పేరుమీద పెట్టిన జాతీయ పురస్కారాలు అశ్లీల మార్క్సిస్టులకు ఇవ్వటం విచిత్రం. ‘ఇందులో నా తప్పు ఏమీ లేదు. కమిటీ రికమెండేషన్ ప్రకారమే ఇచ్చాను’ అని నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. ఆ కమిటీలో ప్రఖ్యాత రచయిత్రులు ఓల్లా, మృణాళిని వంటివారున్నారు. మార్క్స్, ఫ్రాయిడ్ ఒకే నాణెమునకు రెండు ముఖాలు. క్లాస్ స్ట్రగుల్- లిబిడో ఈ రెండూ అర్థ,కామములకు సంబంధించిన ప్రతిపాదనలు. భారతీయులు వీటిని పురుషార్థమలుగా మార్చటం కోసం ముందు ‘్ధర్మాన్ని’ చేర్చారు. దూషణలో, ద్వేషంలో, భావంలో, భాషలో అసభ్యత ‘అశ్లీల మార్క్సిజం’ లక్షణం.

- ప్రొ. ముదిగొండ శివప్రసాద్ ఫోన్: 040- 2742 5668