సీసాలో ఏముంది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శివాజీ, నమ్రత, నిశాదేశ్ ప్రధాన పాత్రల్లో ఇషాక్ దర్శకత్వంలో లక్ష్మీ వేంకటేశ్వర ఫిలింస్ పతాకంపై జగదీష్ నిర్మించిన చిత్రం ‘సీసా’. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 18న విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో శివాజీ మాట్లాడుతూ, ‘బూచమ్మ బూచోడు’ సినిమా తరువాత సంవత్సరం గ్యాప్ తీసుకుని ఈ సినిమాలో నటించానని, కేవలం ఒక్క షాట్‌లో సినిమా మొత్తం వుంటుందని, నిజంగా ఇది అద్భుతమని అన్నారు. ఇషాక్ అద్భుతంగా తెరకెక్కించాడని, మెరీనా బీచ్‌లోని ఓ ఇంట్లో ఈ సినిమా సాగుతుందని, అద్భుతమైన డ్రామా, టెన్షన్, హారర్ అంశాలతో తెరకెక్కిన సినిమా ఇదన్నారు. ఈ సినిమా చూసిన తరువాత టెక్నీషియన్స్ దమ్మేంటో తెలుస్తుందన్నారు. బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ, రెండున్నర గంటలపాటు సింగిల్ షాట్‌లో సినిమా తీయడం విశేషమని, సినిమా లవర్స్ థ్రిల్ ఫీలయ్యే సినిమా ఇది అన్నారు. దర్శకుడు ఇషాక్ మాట్లాడుతూ సింగల్ షాట్‌లో సినిమా చేయడం అంత సులువుకాదని, ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్ అని అన్నారు. ఈ చిత్రాన్ని ఈనెల 18న విడుదల చేస్తున్నామన్నారు. ఈ చిత్రానికి సంగీతం:రాజ్‌భాస్కర్, రైటర్:్భషాశ్రీ, కెమెరా:నౌషద్, ఎడిటింగ్:హరి, నిర్మాత:జగదీష్, దర్శకత్వం:ఇషాక్.