AADIVAVRAM - Others

బుద్ధిమంతుడు సిద్ధే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పట్నంలో ఉంటున్న జయ, జయరాం దంపతులకు సిద్ధు ఒక్కడే కొడుకు. ఏడేళ్ల సిద్ధు ఎంతో బుద్ధిమంతుడు. వాడికి తాతయ్య, నానమ్మ అంటే ఎంతో ఇష్టం. వారి ముద్దు మురిపాలు అంటే మరీమరీ ఇష్టం. అందుకే పల్లెలో ఉంటున్న వారి దగ్గరికి తరచూ వెళ్లాలని ఉంటుంది. తాతయ్య చెప్పే కబుర్లు, నానమ్మ చెప్పే కథలు వింటూ ఈ లోకాన్ని మరిచిపోతుంటాడు. అందుకే నెలకొక మారైనా తండ్రి జయరాంను ఒప్పించి వారి దగ్గరకు వెళ్లి వస్తుంటాడు. పల్లెటూరంటే తల్లి జయకు ఇష్టం ఉండదు. ఆవిడ పట్నం విడిచి రాదు. పట్నం అంటే గిట్టని నానమ్మ తాతయ్య పల్లె విడిచి రారు. ఇదంతా సిద్ధూకున్న పెద్ద సమస్య.
రెండేళ్లు గడిచిపోయాయి. నానమ్మ దేవుని దగ్గరకు వెళ్లిపోయింది. దాంతో తాతయ్య ఒంటరివాడై పోయాడు. అందువల్ల తాతయ్యను ఒప్పించి పల్లె నుండి పట్నానికి తెచ్చారు. సిద్ధు మటుకు పట్టుబట్టి తాతయ్య గదికి మారాడు. గదిలో ఒక మూలన తన చదువు కొనసాగిస్తూ చిన్నాచితకా పనుల్లో తాతయ్యకు సాయంగా ఉండసాగాడు. సమయానికి మంచినీళ్లు, మందు బిళ్లలు అందించేవాడు. బడిలేని సమయాల్లో తాతయ్యనే అంటిపెట్టుకొని ఉండేవాడు.
ఒకరోజు జయ ‘ఏమండీ! మామయ్య దిగులుగా ఉంటున్నారు. ఆయనగారిని పల్లెలోనే ఉంచేద్దామండి’ అన్నది.
జయరాం ఆలోచిస్తుంటే అక్కడే వున్న సిద్ధు ‘అదేం లేదు. నానమ్మ లేదు కదా. అందుకే దిగులు. మరి నాలుగు రోజులు పోనీయండి. మార్పు వస్తుంది’ అన్నాడు. అంతటితో ఆ ప్రస్తావన మళ్లీ రాలేదు.
వారం గడిచిపోయింది.
ఒకరోజు జయ ‘ఏమండీ! మామయ్య అస్తమానం ఏదో నములుతుంటారు. అదేదో సిద్ధూకు ఇస్తే వాడు కూడా తింటాడు కదా!’ అన్నది.
జయరాం జవాబు చెప్పేలోగా సిద్ధు ముందుకొచ్చి ‘అదేం లేదమ్మా. ఊరికే అలా దవడలాడిస్తూ ఉంటాడు. ముసలాళ్లకు చిగుళ్లు దురదగా ఉంటాయట! పళ్లు లేవు గదా! నేనడిగితే చెప్పాడు’ అన్నాడు.
జయరాం కొడుకును ప్రేమగా చూశాడు. జయ సిద్ధూ చలాకీతనానికి మురిసిపోయింది.
పది రోజులు గడిచిపోయాయి.
ఒకరోజు జయరాం డజను అరటిపళ్లు తెచ్చి, తండ్రికి అందించాడు. జయ చూసింది. ‘అదేంటండీ! డజను తెచ్చారు కదా. అందులో సగం సిద్ధుకిచ్చారు కాదూ. వాడూ తింటాడు కదా’ అంది.
వెంటనే ‘అదంతా ఆ తాతమనవలే చూసుకుంటారు. మనకెందుకు చెప్పు?’ అన్నాడు జయరాం.
సిద్ధు తల్లిదండ్రుల మాటలు విన్నాడు. ‘లేదమ్మా! రోజుకు మూడేసి తిన్నా తాతయ్యకే నాలుగు రోజుల్లో ఐపోతాయి. ఐనా అమ్మా! తాతయ్య నోట్లో పళ్లే లేవు కదా. గట్టివి తినలేడు మరి. మెత్తని అరటిపళ్లయినా తిననీ. నాకేం. నేను అన్నీ తినగలను’ అన్నాడు ధీమాగా.
ఆ మాటలు విన్న జయరాం దంపతులు ఆశ్చర్యపోయారు.
సిద్ధు మాటలు విన్న తాతయ్య మటుకు నిండు మనస్సుతో దీవించాడు. ఈలోకంలో సిద్ధలాగే ఆలోచించే మనవలుంటే ముసలాళ్లు నాలుగు రోజులు ఎక్కువే జీవించగలరు అనుకున్నాడు.

-వాసాల నరసయ్య