AADIVAVRAM - Others

సాహసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక కొండ ప్రాంతంలోని గుహలో ఓ భూతం కాపురముండేది.
అది రాత్రిపూట ఊరిలోనికి జొరబడి అక్కడి వారికి ఏవేవో భయంకర అరుపులు, శబ్దాలతో నిద్రాహారాలు లేకుండా చేసేది. ఎవరి ఇంటి తలుపులు వారు బిగించుకొని బిక్కుబిక్కుమంటూ కాలం గడిపేవారు.
రెక్కాడితే గానీ డొక్కాడని పేద ప్రజలు ఆ భూతం భయంతో పనులు కూడా సరిగా చేసుకోలేక పోయేవారు.
ప్రతి ఒక్కరిలోనూ ఆ భూతం బెడద తప్పితే బాగుండుననుకొనేవారు. ఓ ముగ్గురు వ్యక్తులు ఆ భూతం అంతుచూసి హతమార్చాలనుకొని బయల్దేరారు.
ఆ సంగతి తెలిసిన ఊరి పెద్దలు ‘మీ శ్రేయస్సుని కోరి చెబుతున్నాం. ఈ సాహసం మానుకోండి. ఆ కొండ ప్రాంతంలో క్రూర మృగాలు విచ్చలవిడిగా తిరుగుతూంటాయి. విష సర్పాలు సెగలు కక్కుతూ చెట్లకు వేలాడుతూంటాయి. కొలనులోని చేపలు, కప్పలు విషపూరితంగా ఉంటాయి. పిల్లా పాపలతో ఈ విధంగానైనా జీవించాలంటే వెనక్కి పొండి’ అని హితవు పలికారు.
పెద్దల మాటను త్రోసిపుచ్చి ఆ ముగ్గురూ కొండ ప్రాంతానికి చేరుకొన్నారు.
కొండ ప్రాంతం చేరుతూండగా గుండెలు అదిరిపడేటట్లు పులి గాండ్రింపు వినపడింది.
మొదటి వాడికి ముచ్చెమటలు పోసి వెనక్కి దౌడు తీశాడు.
మరి కొంత దూరంలో చెట్లకు వేలాడుతూన్న బుసలుకొట్టే సర్పాలను, భయంకరమైన కూతలు విని రెండవ వాడు పరుగు పెట్టాడు.
మూడో వ్యక్తి మాత్రం ధైర్యంగా కత్తిని చేత్తో పట్టుకొని ముందుకు నడిచాడు. ఒకచోట కాలికి మనిషి పుర్రె భయంకరంగా తగిలింది. దాన్ని పక్కకు నెట్టి గుహలోకి ప్రవేశించాడు.
‘ఏయ్... ఎవర్నువ్వు? నా గుహలోకి ప్రవేశించటానికి ఎన్ని గుండెల్రా?’ అంటూ భయంకరంగా ఓ స్వరం వినిపించింది.
ఆ వ్యక్తికి గుండె ఝల్లుమంది. అయినా ధైర్యం తెచ్చుకొని ‘రోజూ రాత్రిపూట ఊళ్లోకి జొరబడి నిద్రాహారాలు లేకుండా చేస్తున్నావ్. నీ అంతు చూట్టానికే వచ్చాను’ అంటూ ధైర్యంగా పలికాడు.
‘నేనొక భూతాన్ని. మీ ఊళ్లోని పేదలకు మేలు చేద్దామని అనుకుంటుంటే... ఎవరూ నాకు అవకాశం ఇవ్వడం లేదు. నువ్వు వచ్చావ్‌గా.. నేను దూకేస్తాను’ అని బెదిరించింది.
‘ఎందుకు దూకుతావ్? దూకి నన్ను చంపుతావా.. చంపు!’ అన్నాడు ధైర్యంగా.
‘నీకు ఛావంటే భయం లేదా?’
‘అవును. నాకు ఛావంటే పిసరంత భయం కూడా లేదు. కుటుంబ సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నాను. నువ్వు చంపితే హాయిగా చచ్చిపోతాను’ అన్నాడు.
‘్భష్! నీ ధైర్యానికి మెచ్చాను. దూకేస్తున్నా’ అనటం... అతడిపై ధనరాశులు వర్షంలా కురవటం ఒకేసారి జరిగాయి.
అతడి ధైర్య సాహసాలకు లక్ష్మీదేవి మెచ్చి అతణ్ణి కరుణించింది. కనకవర్షం కురిపించింది. ఆ సొమ్ములను తీసుకొచ్చి ఆ ఊరులోని పేద ప్రజలకు పంచి పెట్టి తనూ సుఖంగా జీవించాడు.
-ఆరుపల్లి గోవిందరాజులు

ప్రముఖ శాస్తవ్రేత్తలు

గాగ్లియో మార్కోని
గాగ్లియో మార్కోని 1874 ఏప్రిల్ 25న ఇటలీలోని బటన్ అనే నగరంలో జన్మించాడు. తల్లిదండ్రులు ఆదర్శ భావాలు గలవారు. మార్కోనికి చిన్నతనం నుండీ పరిశోధనలంటే ఎంతో ఇష్టం. ఇంట్లోని వస్తువులను, పరికరాలను, ఆటబొమ్మలను విప్పి లోపల అంతా పరీక్ష చేసి, తిరిగి వాటిని అమర్చి, అందులోని టెక్నిక్‌ను తెలుసుకునేవాడు. ఆ పరిశోధనల్లో సోదరుడు కూడా సహాయపడుతుండేవాడు.
ఆ రోజుల్లో జర్మనీకి చెందిన శాస్తజ్ఞ్రుడు హెన్రిచ్ హెర్డ్, ఇంగ్లండ్‌కు చెందిన శాస్తజ్ఞ్రుడు డేవిడ్ హూగ్, ఫ్రాన్స్‌కు చెందిన ఎడ్వర్డ్ బ్రాన్లిలు చేసిన ప్రసంగాల గురించి మార్కోని చదివాడు. అప్పటికి అతని వయసు పదిహేను సంవత్సరాలు మాత్రమే. విద్యుదయస్కాంతాల ద్వారా, శక్తిని ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి పంపించవచ్చు. ఆ సిద్ధాంతం మార్కోని మనసులో బాగా నాటుకుంది.
అప్పటి నుంచీ సోదరుడి సహాయంతో తనకు తోచిన విధంగా ప్రయోగాలు చేయటం ఆరంభించాడు. ఒకసారి కొండల మధ్యలో తాను నిలబడి, సోదరుని నాలుగు మైళ్ల దూరంలో వుంచి సంకేతాలు పంపాడు. ఆ ఫలితాలు ఫలించాయి. మార్కోని ఇటలీ ప్రభుత్వాన్ని కలిసి తన ప్రయోగించి గురించి తెలిపి, ధన సహాయం కోరాడు. దురదృష్టవశాత్తూ అతని కోరికను ప్రభుత్వం తిరస్కరించింది. చేసేది లేక మార్కోని ఇంగ్లండ్ వెళ్లి అక్కడ టెలిగ్రాఫ్ శాఖ వారిని కలిశాడు. వారికి ఆ పరిశోధనపై విశ్వాసం కలిగి, అతనికి కావలసిన సౌకర్యాలను అందజేశారు. 1897 నాటికి పది మైళ్ల దూరం వరకు సంకేతాలు పంపగలిగారు.
ఇది తెలుసుకున్న ఇటలీ రాజు జరిగిన పొరపాటుకు చింతించి మార్కోనిని స్వదేశానికి ఆహ్వానించాడు. దేశభక్తిగల మార్కోని ఆ ఆహ్వానాన్ని మన్నించి ఇటలీ వెళ్లాడు. ఇటలీ రాజా స్థానంలో మార్కోని ముఖ్యమైన పదవులెన్నో నిర్వహించాడు. 1919లో ప్రపంచంలోని మొట్టమొదటి రేడియో స్టేషన్ చెమ్స్‌ఫోర్డ్‌లో స్థాపించారు.
ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ బహుమతిని మార్కోని అందుకున్నాడు. జీవంలేని రేడియోలకు ప్రాణ ప్రతిష్ఠ చేసిన మార్కోని 1937లో మరణించినపుడు యూరప్ ఖండంలోని రేడియోలన్నీ వౌనంగా రోదించాయి. ఆ రోజును సెలవు దినంగా ప్రకటించి ఆ మహనీయునికి నివాళి అర్పించారు.

-పి.వి.రమణకుమార్

పాఠం
-మల్లాది వెంకట కృష్ణమూర్తి

నెల క్రితం కొన్న కొత్త కారుని తండ్రి నీళ్లతో కడుగుతూంటే హిమేష్ దాన్ని తుడుస్తూ చెప్పాడు.
‘ఇది చాలా గొప్ప మెషీన్ కదా నాన్నా?’
‘అవును. సమయానికి ఎయిర్‌పోర్ట్‌కి, హాస్పిటల్‌కి తీసుకెళ్తుంది. గతంలోలా నడవకుండా సుఖంగా దీంట్లో కూర్చుని ప్రయాణం చేయచ్చు’
‘ఇంకో పదేళ్లు వస్తే కానీ నేను దీన్ని డ్రైవ్ చేయలేను కదా?’ హిమేష్ అడిగాడు.
‘అవును’
కారు రేడియోలోంచి వచ్చిన ఓ వార్తని ఇద్దరూ విన్నారు. ‘నైజీరియా నించి వచ్చిన విద్యార్థులు హాస్టల్ గదిని పోలీసులు రైడ్ చేసినప్పుడు చాలా డ్రగ్స్ దొరికాయి. వారి సెల్‌ఫోన్స్‌లో వాటిని కొన్నవారి వివరాలని పోలీసులు సేకరిస్తున్నారు’
కొద్ది క్షణాల తర్వాత తండ్రి హిమేష్‌కి ఓ పెద్ద సుత్తిని అందించి చెప్పాడు.
‘ఈ సుత్తితో కారు ముందు అద్దాన్ని పగలగొట్టు’
‘ఎందుకు?’ వాడు నిర్ఘాంతపోతూ అడిగాడు.
‘సరదా కోసం’
‘ఏమిటి నాన్నా నువ్వు మాట్లాడేది?’
‘నేను చెయ్యమన్నది నువ్వు ఎందుకు చేయడం లేదు?’
‘కారుని పాడు చేయడం మూర్ఖుల పని కనక’
‘అవును. నీకు తెలివుంది కాబట్టి నేను చెప్పిన పని చేయలేదు. ఇందాక నువ్వు చెప్పినట్లు ఈ కారు గొప్ప యంత్రం. దీన్ని చక్కగా చూసుకోవాలి’
కొడుకు చేతిలోని సుత్తిని అందుకుని పక్కన పెట్టి కొడుకు భుజం మీద చేతిని వేసి చెప్పాడు.
‘ఇప్పుడు మనం రేడియోలో విన్న వార్త, మన శరీరం కూడా దైవ నిర్మితమైన గొప్ప యంత్రం అని గుర్తు చేసింది. దాన్ని మనం పాడు చేయకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనకి ఉంది కదా?’
‘అవును. ఉంది’
‘ఐతే గుర్తుంచుకో. భవిష్యత్తులో నీకు ఎవరో ఒకరు డ్రగ్స్‌ని ఇచ్చే సమయం వస్తుంది. ‘వాళ్లు సరదా కోసం’ అని చెప్పచ్చు. మన కొత్త అందమైన కారుని నువ్వు సుత్తితో పగలగొట్టడం ఎలాంటి పిచ్చి పనో పరమాత్మ ఇచ్చిన ఈ గొప్ప యంత్రాన్ని కావాలని అలాంటి వాటితో నాశనం చేయడం కూడా అలాంటి పిచ్చి పనే’
‘ప్రతీసారి హిమేష్‌కి అందమైన వారి కారుని చూసినప్పుడు తండ్రి చేసిన హితబోధ గుర్తొస్తూంటుంది. దాంతో పెద్దయ్యాక కూడా అలాంటి చెడ్డ అలవాట్లు చేసుకోకుండా తన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోసాగాడు.
కీప్ యువర్ బాడీ ప్యూర్