స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్మఫలప్రదాతా!
మాకు శుభప్రదాతవు కమ్ము
విభూషన్నగ్న ఉభయాన్ అను వ్రతా దూతో దేవానాం రజసీ సమీయసే
యత్తే ధీతిం సుమతిమావృణీమహే- థ స్మా నస్ర్తీవరూథః శిరో భవ॥ ॥
భావం:- ఓ అగ్నీ! దివ్యపురుషులకు దూతవై పుణ్య-పాపకర్ముల కర్మల ననుసరించి వారికి ఉత్తమ- అధమగతులను కల్పిస్తూ నీవు ఊర్ధ్వ అధో లోకాలలో అంతట వ్యాపించియున్నావు. కాబట్టి నినే్న ధ్యానిస్తాం. నీ జ్ఞానానే్న పొందుతాం. ప్రకృతి, జీవుడు, పరబ్రహ్మ అనే త్రిపుటిలో సర్వోన్నతుడవైన పరబ్రహ్మవు నీవే. నీవు మాకు కల్యాణప్రదుడవు కమ్ము.
వివరణ:- ఈ మంత్రంలో పరమాత్ముని కర్మఫల ప్రదానశీలం ‘విభూషన్ ఉభయాం అను వ్రతా ‘‘పాప -పుణ్యకర్ములను వారి కర్మానుసారంగా సత్కరిస్తాడు’’అని నిర్దేశింపబడింది. అంటే వారి పాప- పుణ్య కర్మానుగుణంగా లోకంలో వారికి సుఖ దుఃఖాలు భగవంతుడు సిద్ధంచేసి ఉంచుతాడని భావం. ఈ భావాన్ని ఈ మంత్రంలో వేదం ‘విభూషన్’ అన్న ఒక్క చిత్రమైన మాటలో వ్యక్తీకరించింది. ఇందలి ‘వి’ అనే ఉపసర్గకు ‘విగత’ అని ‘విశేషేణ’అని రెండర్థాలున్నాయి. పుణ్యాత్ములకు ‘విశేషణ’ అని పాపాత్ములకు ‘విగత’హీనమైన అని అర్థాలన్వయిస్తాయి. ఆ ప్రకారంగా పుణ్యాత్ములకు వారి పుణ్యకర్మలకనుగుణంగా విశేషంగాను, పాపకర్ములకు వారి పాపకర్మలకనుగుణంగా ‘విగత’హీనంగాను కర్మఫలాలను కల్పించి సుఖ దుఃఖాలను అనుభవింప చేస్తాడన్న విశాలమైన అర్థాన్ని ‘విభూషన్’అన్న ఒక చిన్న పదంలో ఇమిడించి భగవంతుని కర్మఫల దాతృత్వాన్ని వేదం ప్రకటించింది.
ఈ కర్మఫల దాతృత్వంలో దైవం పక్షపాత వైఖరిని వహించడు. అంతేకాక ‘యథాతథ్యతో- ర్థాన్ వ్యదధాచ్ఛాశ్వతీభ్యః సమాభ్యః’ (శు.య.వే.40-8) ‘‘సనాతన జీవులకు యథాతథ రూపంగా సుఖదుఃఖ విషయాలను సిద్ధంచేస్తాడు’’ అని శుక్లయజుర్వేదం పరమాత్ముని నిష్పక్షపాతాన్ని పేర్కొంది. అంటే ఏ జీవి దేనిని పొందేందుకు అధికారం కలిగియుందో తదనుగుణమైన సుఖానుభవ లేదా దుఃఖానుభవాన్ని లోకైకనాథుడు ఆ జీవికి పొందింపచేస్తున్నాడని అంతరార్థం.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు