జాతీయ వార్తలు

శివపాల్ యాదవ్‌కు బీజేపీ అండదండలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో: సమాజ్‌వాదీ సెక్యులర్ మోర్చా నాయకుడు, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ బాబాయి శివపాల్ యాదవ్‌పై యూపీ మంత్రి ప్రకాశ్ రాజ్‌బర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సమాజ్‌వాదీ పార్టీ నుంచి చీలిపోయి కొత్త పార్టీ పెట్టుకున్న శివపాల్ యాదవ్‌కు బీజేపీ కొమ్ముకాస్తోందని ఆయన ఆరోపించారు. ‘‘శివపాల్ యాదవ్‌కు అధికారిక బంగ్లాతో పాటు జడ్‌ప్లస్ సెక్యురిటీ కల్పించడం చూస్తుంటే.. ఆయనకు బీజేపీ అండదండలు పుష్కలంగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఆయన బీజేపీతో కలిసి పనిచేయడం మొదలుపెట్టినట్టు స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి...’’ అని పేర్కొన్నారు.