సబ్ ఫీచుర్

మన సంవత్సరంలోని ఉత్తరాయణ ప్రారంభమందలి పుష్యమాసము శూన్యమాసమని, లౌకికమైన శుభకార్యములకు మంచిది కాదని పెద్దలు చెప్పుదురు. తరువాత వచ్చు మాఘమాసము ఇహపరములకు రెండింటికినీ ఉత్తమమైనదని శాస్తమ్రు. మాఘపూర్ణిమనాడు మఖా నక్షత్రమందు చంద్రుడుండుట ఈ మాసమునకు ఆదర్శము. అట్లు ప్రతిసారీ జరుగకపోవచ్చును.
హిందూ ప్రజలు తమ జీవనమందు సంపూర్ణమైన ఆయుర్ధాయము, వంశవృద్ధి పితృదేవతల అనుగ్రహముచే కలుగునని భావింతురు. వారిని సంతోషపెట్టు కార్యము ఒకటున్నది. అది మనకు కలిగిన ఆధ్యాత్మిక దృక్పథము. ఊర్ధ్వలోక (ఉత్తమలోక) ప్రాప్తికై మనమాచరించు వైదిక సాంప్రదాయ కర్మలు, ద్విజులకు ఆ మార్గమందు ఉపనయనము చేయుట ఉత్తమము. అంతేగాక వేదవిహితముగ, అనగా సాంప్రదాయకమగు కన్యాదానము చేయుట అందరికీ కూడా మంచిదే. మరియునూ వైరాగ్యాది గుణముల వృద్ధిచేత మనుష్యుడు పాపచింత నుండి దూరము కాగలడు. ఆ ప్రయత్నమే మహాశివరాత్రి. ఉపవాసాదులతోడి శివారాధన. ఇందు పాపక్షయము జీవునికి వైరాగ్యాది తాత్విక దృష్టి లభించగలదు. ఇన్ని సత్ఫలములతో కూడుకున్నది మహాశివరాత్రి. జన్మకొకసారి ఆచరించినను మహాఫలమివ్వగలదని ఈ మహాశివరాత్రి వర్ణించబడుతున్నది.
Add new comment