జాతీయ వార్తలు

రాజ్యసభలో మద్దతు ఇవ్వం:శివసేన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ:పౌరసత్వ బిల్లుపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ ట్విట్టర్‌లో చేసిన విమర్శలతో శివసేన కూడా తన వైఖరిని మార్చుకున్నది. ఎందుకంటే మహారాష్టల్రో ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన శివసేన ఈ బిల్లుకు లోకసభలో మద్దతు తెలిపింది. దేశ ప్రయోజనాల దృష్ట్యా మద్దతు తెలిపినట్లు పేర్కొంది. అయితే రాహుల్ విమర్శలతో తన వైఖరి మార్చుకున్నట్లు శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే ప్రకటించారు. రాజ్యసభలో ఈ బిల్లుకు మద్దతు ఇవ్వబోమని ప్రకటించారు. విపక్షాలు చేసిన సూచనలకు అనుగుణంగా బిల్లులో మార్పులు చేయాల్సిందేనని ఉద్ధావ్ థాకరే విలేకరుల సమావేశంలో ప్రకటించారు. లోకసభలో ఓటేసినట్లు రాజ్యసభలో ఓటు వేయబోమని శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ ప్రకటించారు.