శ్రీకాకుళం

గ్రీవెన్స్ విభాగానికి వినతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(టౌన్), డిసెంబర్ 26: గ్రీవెన్స్ విభాగానికి పలు వినతులు వచ్చాయని జెసి-2 పి.రజనీకాంతారావు తెలిపారు. సోమవారం జెసి-2 ఆధ్వర్యంలో గ్రీవెన్స్ కార్యక్రమం జరిగింది. ముందుగా రణస్థలం నుండి మహతి సునీల్‌నాయుడు తాను బిటెక్ చదువుకున్నానని, తమకు గల పొలాన్ని తోటపల్లి ప్రాజెక్టు నిమిత్తం ప్రభుత్వం తీసుకుందని తనకు ఆర్‌ఆర్ ప్యాకేజ్ కింద గాని, యూత్ ప్యాకేజ్ కింద గాని ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. నరసన్నపేట నుండి టేకి వీరభద్రరావు తాను రంగస్థల కళాకారుడిని 53 సంవత్సరాల అనుభవం ఉందని కళాకారునిగా గుర్తింపు కార్డును సమాచార శాఖ ద్వారా మంజూరు చేయాలని దరఖాస్తు చేశారు.
కొత్తూరు మండలం వీరపాడు గ్రామం నుండి గొర్లె శాంతారావు ప్రాజెక్టులో తమ భూమి కోల్పోయినందుకు తనకు ఆర్‌ఆర్ ప్యాకేజీ వర్తింపజేయాలని కోరారు. హిరమండలం మండలం పెద్దకోరాడ వీధి నుండి కోన రజనీ వితంతు పింఛన్ మంజూరు చేయాలని కోరారు. శ్రీకాకుళం నుండి ఎల్.నారాయణమ్మ తనకు వృద్ధాప్య పింఛన్ మంజూరు చేయాలని కోరారు. పోలాకి మండలం సుసరాం గ్రామం నుండి బొడ్డేపల్లి రమణమూర్తి వికలాంగుడనైన తనకు మూడు చక్రాల వాహనం మంజూరు చేయాలని కోరారు. కొత్తూరు మండలం పారాపురం నుండి మొగలిరాములు నేరడి రెవెన్యూ గ్రూపులోని ఉప్పరపేట గ్రామంలో 26 సెంట్ల భూమి డిస్ట్రిబ్యూషన్ కాలువలో పడిందని భూసేకరణ వారు కొలతలు తీసుకొని మొదట నోటిఫికేషన్‌లో ఉంచి రెండవ నోటిఫికేషన్‌లో పేరు వేయలేదన్నారు. విచారణ జరిపించి తనకు న్యాయం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సెట్ శ్రీ సి ఈవో వివిఆర్‌ఎస్ మూర్తి, హౌసింగ్ పిడి నర్శింగరావు, డిఆర్‌డిఆర్ పెన్షన్ల ఏపిడి ఎంవిఎన్ సోమయాజులు తదితర అధికారులు పాల్గొన్నారు.

ఆంధ్రాలో జాతీయ క్రీడల సందడి

శ్రీకాకుళం, డిసెంబర్ 26: భారత ఒలింపిక్స్ అసోసియేషన్ చైర్మన్ రామచంద్రన్‌తో రాష్ట్ర కార్మిక క్రీడల శాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చెన్నైలో సోమవారం భేటీ అయ్యారు. 2018 సంవత్సరంలో జరగనున్న జాతీయ క్రీడలను ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించాల్సిందిగా మంత్రి అచ్చెన్నాయుడు రామచంద్రన్‌ను కోరారు. జాతీయ క్రీడలను రాష్ట్రంలోనే నిర్వహించేందుకు ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్ సుముఖిత వ్యక్తం చేసినట్టు మంత్రి ఇక్కడి విలేఖర్లకు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి రామచంద్రన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి వెంట శాప్ ఎండి బంగార్రాజు, చైర్మన్ ఆర్‌పి మోహన్ తదితరులు ఉన్నారు.