శ్రీకాకుళం

అధికారం కంటే అభివృద్ధే ప్రధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్), డిసెంబర్ 26: భారతీయ జనతా పార్టీ మోదీ ప్రభుత్వం అధికారం కంటే అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తోందని బీజేపి ఎమ్మెల్సీ సోమువీర్రాజు అన్నారు. స్థానిక హోటల్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గోదావరీ జలాలు అందరికీ అందించేందుకు బీజేపి సస్యశ్యామల యాత్ర ప్రారంభించిం దని విద్యాసాగర్, కృష్ణంరాజు వివిధ ప్రాంతాల నుండి ఈ యాత్రలు కొనసాగించారన్నారు. గోదావరి జలాలు ఒక్కటే శరణ్యమని గోదావరి జలాలు కృష్ణా జిల్లాకు ఇచ్చే అవకాశం ఉందని నెల్లూరుకు కూడా అవకాశం ఉందని మిగిలిన జలాలు రాయలసీమకని తెలియజేశారు. ఉత్తరాంధ్రా జిల్లాలో సాగు, మంచినీరు అందించే ఉద్దేశంతో రాష్ట్ర విభజన సమయంలో గోదావరి జలాలు తెలంగాణకు ఎంత ముఖ్యమో ఆంధ్రప్రదేశ్‌కీ అంతే ముఖ్యమని బిజెపి పోరాటం చేసినట్టు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పోలవరం మీదే ఆదారపడి ఉందని ముంపు మండలాలను ఆంధ్రప్రాం తంలోనే కలిపారన్నారు. బిజెపి రాష్ట్ర కార్యదర్శి పైడి వేణుగోపాలం, జిల్లా అధ్యక్షుడు కోటగిరి నారాయణరావు, నగరఅధ్యక్షుడు చల్లా వెంకటేశ్వరరావు, రెడ్డి భాగ్యలక్ష్మి, వెంకటేశ్వరరావు, నాగేశ్వరరావు, రెడ్డి నారాయణరావు, రవిబాబ్జీ ఉన్నారు.

కౌలు రైతు ముసుగులో దోపిడీ
సారవకోట, డిసెంబర్ 26: రైతుకు గిట్టుబాటు ధర చెల్లించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి దీనికి సంబంధించి సొమ్మును రైతు ఖాతాలో జమ చేస్తుందని కొనుగోలు కేంద్రాలను సద్వినియోగ పరుచుకోవాల్సిన బాధ్యత రైతులపై ఉందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి వివరించారు. సోమవారం సారవకోట పిఎసిఎస్ కార్యాలయం వద్ద అధ్యక్షుడు నక్క రామరాజు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి, మాట్లాడారు. గత సంవత్సరంలో జరిగిన అక్రమాల వలన ఈ ఏడాది నిబంధనలను కఠినతరం చేయాల్సి వచ్చిందని స్పష్టంచేశారు. కౌలు రైతు ముసుగులో మిల్లర్లు కోట్లాది రూపాయలను దోచుకున్నారని నిజమైన రైతుకు డబ్బు అందించడంలో తీవ్ర జాప్యం చేయడం వలన ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ఎకరాకు 32 బస్తాల ధాన్యాన్ని రైతు విక్రయించేందుకు ప్రభు త్వం అవకాశం కల్పించిందన్నారు. వెబ్‌ల్యాండ్ ఈ క్రాఫ్ జాబితాలను అనుసరించి రైతుకు గల విస్తీర్ణాన్ని బట్టి ధాన్యానికి కనీస మద్దతు ధర చెల్లిస్తున్నట్టు పేర్కొ న్నారు. గ్రామస్థాయి నుండి తహశీల్దార్ వరకు రెవెన్యూ సిబ్బంది కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.