శ్రీకాకుళం

నైరేడ్‌లనైరేడ్‌లో శిక్షణపై మహారాష్ట్ర గవర్నర్ ప్రశంసలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంతకవిటి, జనవరి 21: నైరేడ్ శిక్షణపై మహారాష్ట్ర గవర్నర్ సి.హెచ్.విద్యాసాగరరావు ప్రశంసల జల్లు కురిపించారు. శనివారం రాజాంలోని జిఎంఆర్ సంస్థకు చెందిన ఇంజనీరింగ్ కళాశాల, కేర్ ఆసుపత్రులను పరిశీలించిన అనంతరం నైరేడ్‌కు బ్యాటరీతో నడిచే కారులో వచ్చారు. నైరేడ్ ఇడి సాయికుమార్ పుష్పగుచ్చంతో స్వాగతం పలికి గవర్నర్‌కు ఆహ్వానం పలికారు. అనంతరం నైరేడ్‌లో నైపుణ్యతా శిక్షణా పనితీరును ప్రాజెక్టు ఆఫీసర్ నాగరాజు గవర్నర్‌కు వివరించారు. హోమ్ నర్సింగ్, టైలరింగ్‌తో పాటు పలు విభాగాల్లో శిక్షణ పొందుతున్న యువతీ యువకులతో గవర్నర్ ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నైపుణ్యం కలిగిన శిక్షణ ఉన్నత చదువులకన్నా విలువైందన్నారు. గల్లీ నుంచి ఢిల్లీదాక ప్రతి విభాగంలో అత్యుత్తమ శిక్షణ కలిగిన వారికి మెండైన ఉపాధి అవకాశాలున్నాయన్నారు. యువత ఆలోచనలకు పదునుపెట్టి సాధనతో కూడిన శిక్షణ జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుస్తుందన్నారు. నర్సింగ్ విద్యార్థులతో మాట్లాడుతూ అందరితో స్నేహభావం అలవర్చుకోవాలన్నారు. అనంతరం వంటగదులు, డార్మిటరీని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జి ఎం ఆర్ సంస్థ చైర్మన్ గ్రంథి మల్లిఖార్జునరావు, బిజినెస్ చైర్మన్ నాగేశ్వరరావు, ఆంధ్రాబ్యాంక్ జోనల్ మేనేజర్ రాధాకిషన్, లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకటేశ్వరరావు తదితరులున్నారు.
నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు
పోలాకి, జనవరి 21: రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలతో ప్రభుత్వ భవనాలు నిర్మిస్తుందని నిర్మాణాల్లో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర కార్మిక శాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. పోలాకి ప్రాధమిక ఆరోగ్య కేంద్రం నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.1.30 కోట్లతో అధునాతనంగా భవనం నిర్మించాలని అధికారులు ఆదేశించారు. అలాగే పోలాకి మండలాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడమే ధ్యేయంగా పెట్టుకున్నామన్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాలు అభివృద్ధి చేసి సస్యశ్యామలంగా తీర్చిదిద్దడం సీఎం చంద్రబాబు ఆలోచననన్నారు. సమర్థవంతమైన నాయకుడిగా దేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు మంచి పేరుతుందన్నారు. రాష్ట్రంలో చేస్తు న్న అభివృద్ధిని చూడలేక వైకాపా అధ్యక్షులు జగన్మోహన్‌రెడ్డి ప్రతీ జిల్లాలో సమావేశం ఏర్పాటు చేసి రైతులకు రెచ్చగొట్టడం మంచిది కాదన్నారు. శ్రీకాకుళంజిల్లాకు రూ.500 కోట్లతో తాగునీటి సరఫరా కోసం వాటర్‌ట్యాంకు నిర్మించి పైపులైన్లు వేసి వేసవి నాటికి సరఫరా చేస్తామన్నారు. మరో రెండున్నరేళ్లలో ప్రతీ ఎకరాకు సాగునీరు అందించడం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొన్నటివరకు ఎటువంటి ప్రభుత్వ భవనాలు నిర్మించలేదని ఆ ఘనత ఇప్పుడు సీ ఎం చంద్రబాబునాయుడుకే దక్కిందన్నారు. ప్రభుత్వ సంక్షేమపథకాలను ప్రజానీకానికి పార్టీ కార్యకర్తలు అవగాహన కల్పించాలని కోరారు. అదే విధంగా హిరమండలం వంశదార ప్రాజెక్టు పనులకు అడ్డుపడకుండా సహకరించాలని కోరారు. జూన్ 15 నాటికి వంశదార రెండవ దశ పూర్తి చేసి సాగునీరు అందిస్తామన్నారు. అనంతరం పోలాకి గ్రామంలో డంపింగ్‌యార్డు చెత్తనుండి సంపద కేంద్రాన్ని ప్రారంభించారు. ఈకార్యక్రమంలో ఎమ్మె ల్యే బగ్గు రమణమూర్తి, ఏ ఎం సి అధ్యక్షులు భైరి భాస్కరరావు, జెడ్పిటీసీ గొండురామన్న, వంశదార ప్రాజెక్ట్ వైస్ చైర్మన్ వెంకటప్పలనాయుడు, సర్పంచ్ కల్పన, వైద్యాధికారులు బలగమురళీ, శిమ్మ ఇందుసింహా, ఎంపిడివో లక్ష్మీపతి, తహశీల్దార్ రామారావు పాల్గొన్నారు.