శ్రీకాకుళం

మోదీ పాలనతో దేశానికి పెను సవాళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇచ్ఛాపురం, జనవరి 26 : ప్రధాని నరేంద్ర మోదీ పాలనతో దేశానికి పెను సవాళ్లు ఎదురవుతున్నాయని సిపిఐ రాజ్యసభ సభ్యుడు డి.రాజా అన్నారు. ఆరెస్సెస్ సంఘ్ పరివార్ అజెండా ప్రకారం పాలన సాగుతోందని ఆరోపించారు. దీనివల్ల రాజ్యాంగానికి విఘాతం కలుగుతోందని, పార్లమెంటును పక్కన బెడుతున్నారని విమర్శించారు. సామాజిక హక్కుల వేదిక ఆధ్వర్యంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ నేతృత్వంలో చేపట్టిన ప్రజా చైతన్య బస్సుయాత్రను గురువారం ఆయన ఇచ్ఛాపురంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ బిజెపి, టిడిపి ప్రభుత్వాల పాలనలో ఎస్సీలు, ఎస్టీలు, బిసిలు, మైనారిటీలు తీవ్ర వివక్షకు గురవుతున్నారని చెప్పారు. గుజరాత్, జార్ఖండ్, ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతాలలో ఈ వర్గాల వారిపై ప్రభుత్వాలు అప్రకటిత యుద్ధం ప్రకటించాయన్నారు. గుజరాత్‌లో గో-రక్షణ పేరిట దళితులపై అరాచాలకు పాల్పడుతున్నారన్నారు. దేశంలోని దళితులపై ప్రతి 18 నిమిషాలకు ఒకదాడి జరుగుతోందన్నారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో సమాన వాటా ఇవ్వాలని బడుగు, బలహీన వర్గాలు డిమాండ్ చేయాలన్నారు. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు ఇవ్వాలని కోరుతుండగా వాటిపై సమీక్ష జరపాలని వెంకయ్యనాయుడు లాంటి నేతలు అంటున్నారని విమర్శించారు. ప్రణాళిక సంఘాన్ని రద్దుచేసి నీతిఅయోగ్‌ను ఏర్పాటు చేసింది విద్య, వైద్యం, రవాణా ఇలా అన్ని రంగాలను ప్రైవేటుపరం చేయడానికేనని చెప్పారు. పెద్ద నోట్ల రద్దు వల్ల పేదలు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోయారన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, ప్రభుత్వ కార్యదర్శుల నియామకంలో దళితులకు అన్యాయం జరుగుతోందన్నారు. ఈ అన్యాయాలపై ప్రశ్నించేలా ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీలను చైతన్యవంతం చేసేందుకే బస్సు యాత్ర చేపట్టారని అన్నారు. బాధిత వర్గాలన్నీ ఐక్య పోరాటం చేస్తే తప్ప న్యాయం జరగదన్నారు.
మంత్రివర్గం నుంచి అచ్చెన్నను తొలగించాలి
శ్రీకాకుళం జిల్లాలో అరాచకాలకు పాల్పడుతున్న మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును మంత్రివర్గం నుంచి తొలగించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు డిమాండ్ చేశారు. బస్సుయాత్ర సభలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో మంత్రి ఆదేశాల మేరకు పోలీసు రాజ్యం నడుస్తోందన్నారు. జిల్లా ఎస్పీ, కలెక్టర్ అత్యుత్సాహం చూపుతూ దళితులు, మత్స్యకారులను అణచివేస్తున్నారని ఆరోపించారు. నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పునరావాసం కల్పించాకే వంశధార ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉండగా, అందుకు విరుద్ధంగా వ్యవహరించారన్నారు. ప్రాజెక్టు పనులు 95శాతం పూర్తయినా పునరావాసం కల్పించలేదన్నారు. దీనిపై ఆందోళనకు దిగిన బాధితులపై పోలీసులు అరాచాకాలకు పాల్పడుతున్నారన్నారు. వంశధార నిర్వాసితుల నేత సింహాచలంపై 13 కేసులు పెట్టి రౌడీషీట్ తెరిచారని చెప్పారు. ఇలాంటి బెదిరింపులకు లొంగేది లేదన్నారు. భావనపాడులో పోర్టు నిర్మాణం పేరిట 550 ఎకరాలు, థర్మల్ విద్యుత్ కేంద్రం పేరిట పోలాకిలో 5500 ఎకరాలు లాక్కోవటానికి ప్రభుత్వం యత్నిస్తోందని విమర్శించారు. సోంపేట బీల భూములను తిరిగి రైతులకు అప్పగిస్తామన్న సిఎం చంద్రబాబు మాట తప్పారన్నారు. ఈ అరాచకాలన్నింటికి కారకుడైన అచ్చెన్నాయుడును వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. 2013 భూసేకరణ చట్టాన్ని సవరించటానికి యత్నిస్తే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు.
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీలకు సమాన అవకాశాలు సాధించటమే లక్ష్యంగా యాత్ర చేపట్టామన్నారు. చంద్రబాబు రెండున్నరేళ్ల పాలనలో 516 మంది రైతులు, 400 మంది వ్యవసాయ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని చెప్పారు. 6.5 లక్షల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు వస్తాయని బాబు చెప్పారని, కానీ ఒక్క పెద్ద పరిశ్రమ రాలేదన్నారు. కీలకమైన 14 రంగాలన్నీ ధనికులు, భూస్వాముల చేతుల్లో ఉన్నాయన్నారు. విద్యావ్యవస్థ మంత్రులు గంటా శ్రీనివాసరావు, పి.నారాయణ చేతుల్లో చిక్కుకుందని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బిసి సబ్‌ప్లాన్ నిధులను ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందన్నారు. ఈ అన్యాయాలపై బాధిత వర్గాలకు చైతన్యపరిచి న్యాయం సాధించేవరకు పోరాడతామన్నారు. ఎపియుడబ్ల్యూజె రాష్ట్ర అధ్యక్షుడు నల్లి ధర్మారావు అధ్యక్షతన జరిగిన సభలో వివిధ కార్మిక, బిసి సంక్షేమ సంఘాల నేతలు జె.సత్యనారాయణమూర్తి, చాపర సుందర్‌లాల్, ఓబులేసు, చౌదరి తేజేశ్వరరావు, చంద్రపతిరావు, క్రాంతికుమార్, దుర్గ్భావాని, కేశవరావు, ఆవుల శేఖర్, ఆర్.వెంకయ్య, చంద్రా నాయక్, విజయలక్ష్మి, చోహన్‌ఖాన్, కె.సాయిప్రతాప్, ప్రొఫెసర్ కె.ఎస్.చలం ప్రభావతి, సాలిన ఢిల్లీరావు, మడ్డు రవి పాల్గొన్నారు.