శ్రీకాకుళం

కేబినెట్‌పై ఉత్కంఠ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం: తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి రెండున్న ఏళ్ళు కావస్తున్నా రెండోసారి కేబినెట్ కూర్పు ఆ పార్టీ అధినేత జరపలేదు. ఎప్పటి నుంచో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వారసత్వపు రాజకీయాలను ఆహ్వానించేందుకు లోకేష్‌ను మంత్రివర్గంలో కుర్చీ కేటాయించాలని పార్టీ శ్రేణులు పట్టుపడుతున్న నేపథ్యంలో మంగళవారం అమరావతిలో జరగనున్న కేబినెట్ సమావేశంపై జిల్లా తెలుగుతమ్ముళ్ళు పలు అంశాలను చర్చించుకుంటున్నారు. ఈసారి కేబినెట్ సమావేశానికి ప్రత్యేకత ఉంటోందని, ఇందులో లోకేష్‌కు మంత్రివర్గంలోకి తీసుకునేలా ఏకవాక్య తీర్మానంతో లైన్‌క్లియర్ చేస్తారని సీనియర్లు భావించడం ఒక అంశమైతే...సిక్కోల్ రాజకీయాల్లో పెనుమార్పులు సంభవిస్తాయంటూ మరో అంశంతో ఉత్కంఠను రేపుతున్నారు. లోకేష్‌తోనే మంత్రి వర్గ కూర్పు సరిపెట్టుకోకుండా జిల్లాకు చెందిన టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎచ్చెర్ల ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావుకు బెర్త్ కేటాయించడం ఖాయమని తమ్ముళ్ళు కుండబద్దలు కొట్టినట్టు చెబుతున్నారు. రాష్ట్ర అధ్యక్ష పదవీబాధ్యతలను హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్పకు అప్పగిస్తారన్న ఊహాగానాలు వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరూ కాపుసామాజికవర్గానికి చెందినవారు కావడంతో సామాజిక సమతూల్యత సమస్య కూడా తలెత్తదని, విజయనగరం జిల్లా మంత్రి కిమిడి మృణాళినిపై వేటు వేస్తారంటూ పుకార్లు పెట్టారు. పెళ్ళిళ్ల సీజన్ కావడంతో ఏ కల్యాణమండపం వద్ద పచ్చచొక్కాలు కలిసినా కేబినెట్ సమావేశం, ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపిక, నామినేటెడ్ ఉద్యోగాలకు లైన్‌క్లియర్ అంశాలను ప్రస్తావించుకుంటూ వాడిగావేడిగా చర్చించుకుంటున్నారు. ఇదిలాఉండగా, జిల్లా మంత్రి కింజరాపుఅచ్చెన్నాయుడుకు పదోన్నతి ఖాయమని కొందరు అంటుంటే - మరికొందరు కళాకు హోంమంత్రి వరిస్తుందని బెట్టింగులకు దిగేవరకూ సిక్కోల్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కార్మికశాఖ మంత్రిగా అచ్చెన్న విపక్షాలను విమర్శలను తిప్పికొట్టడంలోనూ, ప్రతిపక్షనేత జగన్‌కు దూకుడుగా మాటల దాడికి దిగడంలోనూ బాబువద్ద మంచి మార్కులు కొట్టేశారు. ఇటీవల వంశధార నిర్వాసితుల ఉద్యమం, జిల్లా ఎమ్మెల్యేలను ఏకతాటిపై నడిపించడంలో వైఫల్యం, భావనపాడు పురోగతి సాధించడంలో వెనుకబడడం అంశాలు ప్రతికూలంగా నిలుస్తాయని పార్టీ నేతలే పేర్కొంటున్నారు. హోంమంత్రి చినరాజప్ప నుంచి కళాకు ఆ మంత్రిత్వశాఖ బదలాయింపు ఉంటుందని తమ్ముళ్ళు పేర్కొంటుండగా, విజయనగరం పార్లమెంటులోగల ఎచ్చెర్లకు అటువంటి కీలకశాఖ ఎలా అప్పగిస్తారంటూ ఇప్పటికే ఎం.పి.గా ఉన్న ఆశోక్‌గజపతిరాజుకు కేంద్రమంత్రి పదవి ఉందంటూ తమ్ముళ్ళు వాదులాడుకుంటున్నారు. అచ్చెన్నకు పదోన్నతి లభిస్తుందా? కళాకు కేబినెట్‌లో ఏ శాఖ కేటాయిస్తారన్న ప్రశ్నలు సిక్కోల్ తమ్ముళ్ళను ఉత్కంఠలోకి నెట్టేస్తున్నాయి. మరికొద్ది గంటల్లో జరగనున్న కేబినెట్‌లో వీటికి సమాధానం దొరుకుందన్న ఆత్రుత తమ్ముళ్ళను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.
ఇదిలా ఉండగా, ప్రభుత్వ విప్ కూన రవికుమార్ కూడా కేబినెట్ పరిశీలనలో ఉన్నారంటూ ఆ సామజికవర్గం నేతలు ఢంకా కొడుతున్నారు. జిల్లాకు కేబినెట్‌లో ముగ్గురికి ఛాన్స్‌రాదని, ఇద్దరికే చోటుదక్కుతుందని ఆ రెండవ స్థానం కళా, కూనల మధ్య అంచనాలు భారీగానే ఉన్నాయి.
రాజాం నియోజకవర్గం ఇన్‌ఛార్జిగా ఉన్న టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యురాలు కావలి ప్రతిభాభారతిని ఎమ్మెల్సీగా రెన్యూవల్ చేస్తారని అక్కడ కేడర్ ధీమా వ్యక్తం చేస్తోంది. చేర్పులుమార్పులు ఉండవచ్చునంటూ మరికొంతమంది అంచనాలు వేస్తున్నారు. పీరుకట్ల విశ్వప్రసాద్ ఎమ్మెల్సీ స్థానం మార్చి చివరి నాటికి ఖాళీ కావడంతో ఆ పదవి ఎవరిని వరిస్తుందో అన్న ఉత్కంఠ ఆశావాహులు, తమ్ముళ్ళను చర్చలతో సిక్కోల్ రాజకీయాలు వేడెక్కిస్తోంది!