శ్రీకాకుళం

వేసవిలో తాగునీటి సమస్య తలెత్తరాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, ఫిబ్రవరి 17: వేసవిలో జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తరాదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ పి.రామాంజనేయులు అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లాపర్యటనకు విచ్చేసిన కమిషనర్ జిల్లా అధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో ఉపాధి హామీ, తాగునీరు అంశాలపై జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఏ ప్రాంతం నుంచి తాగునీటి సమస్య ఉన్నట్లు ఫిర్యాదులు ఉండరాదన్నారు. ముందుగానే ఆయా ప్రాంతాలలో నీటి సమస్యను గుర్తించి ప్రణాళికలను రూపొందించాలని ఆదేశించారు. ఉపాధి హామీ పనులను నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా పూర్తిచేయాలన్నారు. అనేక గ్రామ పంచాయతీలలో పనులు చేపట్టలేదని, వాటిలో పనులు చేపట్టి ఉపాధి కల్పించాలన్నారు. పంట సంజీవిని చేపట్టడం ద్వారా ఎక్కువ పనులు లభిస్తాయన్నారు. ఈ నెలాఖరుకు కనీసం 1.50లక్షల మంది పనుల్లో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని ఎంపిడిఓలకు ఆదేశించారు. ఎంపిడిఓలు వేతనదారులు పెరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. వర్మీ కంపోస్టు యూనిట్లను ఉపాధి హామీలో భాగంగా విస్తృతంగా చేపట్టాలన్నారు. ప్రత్యేక మరుగుదొడ్లు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. మలవిసర్జన రహిత గ్రామాల జాబితాలను, ప్రతిపాదిత గ్రామాల వివరాలు అందించాలన్నారు. పంచాయతీలలో పనులు చెల్లింపుపై అంచనాలు వేయాలన్నారు. ఈ సమావేశంలో కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం, జెడ్పీ సిఇఓ బి.నగేష్, జిల్లా నీటి యాజమాన్య సంస్థ హెచ్.కూర్మరావు, డిపిఓ కోటేశ్వరరావు, హౌసింగ్ పిడి నర్శింగరావు, డిఆర్‌డిఏ పిడి కిషోర్‌కుమార్ అధికారులు, మండల పరిషత్ అధికారులు, ఉపాధి హామీ అధికారులు పాల్గొన్నారు.

విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో
ఎస్‌బిహెచ్ ఏటిఎం దగ్ధం
* తప్పిన పెను ప్రమాదం
హిరమండలం, ఫిబ్రవరి 17: హిరమండలంలోని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్(ఎస్‌బిహెచ్) ఏటిఎం విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో దగ్ధమైంది. శుక్రవారం సాయంత్రం పెను ప్రమాదం తప్పినట్టు అయింది. ఎస్‌బిహెచ్ బ్యాంకు ఆవరణలో ఏటిఎంను బ్యాంకు అధికారులు ఏర్పాటుచేశారు. ఏటిఎం వెనుక భాగంలో పరికరాల నుంచి చెలరేగిన నిప్పులు ఏటిఎంకు తాకడంతో పొగలు కమ్ముకున్నాయి. ఏటిఎంకు అనుసంధానంగా బ్యాంకు ఉన్నందున బ్యాంకు మేనేజర్ గదికి కూడా పొగలు రావడంతో బ్యాంకులోని సిబ్బంది, ఖాతాదారులు భయాందోళనలకు గురై బయటకు పరుగులు తీశారు. ఏటిఎంలో ఖాతాదారులు కూడా బయటకు పరుగులు తీశారు. పొగలు కమ్ముకోవడంతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఫైర్ వాయువును ప్రయోగించి మంటలను అదుపు చేశారు. అగ్నిప్రమాదం జరిగిందన్న వార్త వ్యాపించడంతో బ్యాంకువద్దకు ప్రజలు పరుగులు తీశారు. హిరమండలం ఎస్‌ఐ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సిబ్బంది బ్యాంకువద్దకు చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత పరిశీలించగా ఏటిఎంలోని పలు పరికరాలు కాలిపోయినట్టు గుర్తించారు. అలాగే ఏటిఎం దగ్ధమైంది. బ్యాంకు పనిచేసే సమయంలో ప్రమాదం జరగడంతో బ్యాంకులో లావాదేవీలు నిలిచిపోయాయి. ఏటిఎంలో నగదుకు ఎటువంటి నష్టం జరగలేదు. పరికరాలు నాసిరకంగా ఉండడంవల్లే ప్రమాదం జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు బ్యాంకు మేనేజర్ బెహరా తెలిపారు.

ప్రజల మన్ననలను పొందండి
* సిఎం చంద్రబాబు పిలుపు

శ్రీకాకుళం, ఫిబ్రవరి 17: ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ వర్క్‌షాప్ శుక్రవారం విజయవాడలోని కనె్వన్షన్ సెంటర్‌లో జరిగింది. ఈ వర్క్‌షాష్‌లో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ప్రభుత్వ విప్ కూన రవికుమార్, ఎమ్మెల్సీ కావలి ప్రతిభాభారతీ, జెడ్పీ చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మీ, ఎంపి రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్యేలు బెందాళం అశోక్, బగ్గు రమణమూర్తి, కలమట వెంకటరమణ, టిడిపి జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీష పాల్గొన్నారు. వర్క్‌షాప్‌లో నియోజకవర్గాల వారీగా పార్టీ సేకరించిన ఫీడ్‌బ్యాక్‌ను ఆధారంగా తీసుకొని ఆయా ప్రాంతాల్లో 80శాతం ప్రజలు తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులుగా ఉండేలా నేతలంతా పనిచేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రజల మన్ననలను పొందే విధంగా ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలులో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిమిడి కళావెంకటరావుపాల్గొనగా, టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన మరిన్ని అంశాలపై డాస్ బోర్డు ప్రజెంటేషన్ నిర్వహించారు. మాట్లాడారు.