శ్రీకాకుళం

ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, ఫిబ్రవరి 20: స్థానిక సంస్థలు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలుగుదేశంపార్టీ జిల్లా కార్యనిర్వహక కార్యదర్శి మొదలవలస రమేష్ వినతిపత్రం అందించారు. సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి 1983నుండి తెలుగుదేశం పార్టీని నమ్ముకుని పనిచేస్తున్నానని, ఈసారి ఎమ్మెల్సీ అభ్యర్థత్వాన్ని తనకు కేటాయించాలని కోరారు. దీనిపై సిఎం సానుకూలంగా స్పందించి అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నామని, అందరికీ అవకాశాలు వస్తాయని, మీరంతా పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని సూచించినట్లు తెలియవచ్చింది. ఆమదాలవలస నియోజకవర్గంలో కీలకనేతగా ఎదిగిన మొదలవలస రమేష్ తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ వచ్చారు. ఈయనకు ఎమ్మెల్సీ కేటాయించాలని అభిమానులు కూడా కోరుతున్నారు.

నేటి నుండి జిల్లా స్థాయి క్రీడలు
* జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి.శ్రీనివాసకుమార్
బలగ, ఫిబ్రవరి 20: నేటినుండి డా.బి.ఆర్.అంబేద్కర్ జిల్లా స్థాయి పోటీలు జరగనున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి.శ్రీనివాసకుమార్ పేర్కొన్నారు. స్థానిక కోడిరామ్మూర్తి స్టేడియంలో ఫిబ్రవరి 21, 22 తేదీల్లో జిల్లా స్థాయి పోటీలు జరుగుతాయన్నారు. ఇందులో పాల్గొనేందుకు ఆసక్తి గల క్రీడాకారులు తమపేర్లను నమోదు చేసుకోవచ్చన్నారు. ఇప్పటికే అవకాశం కోల్పోయిన క్రీడాకారులతోపాటు గ్రామీణ, మండలాల్లోని ఆసక్తి గల క్రీడాకారులు ఇందులో పాల్గొనవచ్చని చెప్పారు. వారు మండల ఇన్‌ఛార్జిలను కలిసి తమ పేర్లను నమోదుచేసుకొని పిఆర్‌ఎఫ్ ఫారాలను, జిరాక్స్ ప్రతులను జిల్లా స్థాయి పోటీలలో సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఫిబ్రవరి 21 మంగళవారం కబడ్డీ, వాలీబాల్ పోటీలు జరుగుతాయని, 22 బుధవారం అథ్లెటిక్స్, ఫుట్‌బాల్, హ్యాండ్‌బాల్ క్రీడలు ఉంటాయని ఆయన చెప్పారు.