శ్రీకాకుళం

ఎలక్ట్రానిక్ మీడియాలో ఎన్నికల ప్రకటనలకు అనుమతి పొందాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, ఫిబ్రవరి 20: ఎలక్ట్రానిక్ మీడియా, కేబుల్ నెట్‌వర్క్‌లలో ఎన్నికల ప్రకటనలను ప్రసారం చేయడానికి విధిగా అనుమతి పొందాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి పి.లక్ష్మీనృసింహం సోమవారం ఒక ప్రకటన లో తెలిపారు. ఏ ప్రకటనైనా అనుమతి లేనిదే కేబుల్ నెట్‌వర్క్‌ద్వారా ట్రాన్స్‌మీట్ లేదా రీ-ట్రాన్స్‌మిట్ చేయరాదన్నారు. కేబుల్ టెలివిజన్ (రెగ్యూలేషన్) చట్టం,1995 సెక్షన్-6కు విరుద్ధం అవుతుందన్నారు. కేబుల్ ఆపరేటర్ చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించినా లేదా ఉల్లంఘిస్తున్నట్లు ఏ ఆధీకృత అధికారి విశ్వసిస్తే కేబుల్ ఆపరేటర్ పరికరాలను స్వాధీనం చేసుకోవచ్చునన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులు, రాజకీయ పార్టీలు దేశ చట్టానికి అనుగుణంగా లేని, నైతిక ఔచిత్యానికి భంగం వాటిల్లే, అభిప్రాయాలను దెబ్బతీసే లేదా ఏవగింపు కలిగించే విషయాలను, ఘర్షణలు సృష్టించే అవకాశం ఉన్న ప్రకటనలు ఇవ్వరాదని అన్నారు. మత, కుల, వర్గ, భాషపరమైన విబేధాలుండే అంశాలను ప్రసారం చేయరాదన్నారు. వీటిపై కేబుల్ ఆపరేటర్ లేదా టీవి ఛానెల్స్ అవగాహన కలిగి ఉండాలని, ఇటువంటి అంశాలను ప్రసారం చేయరాదని అన్నారు. కేబుల్ ఛానల్స్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రసారాలను భారత ఎన్నికల సంఘం పర్యవేక్షిస్తుందని చెప్పారు. మీడియా సర్ట్ఫికేషన్, మోనిటరింగు కమిటీ(ఎంసిఎంసి) ప్రకటనల సర్ట్ఫికేషన్, ఇతర ఉల్లంఘనలను పరిశీలిస్తుందన్నారు. పెయిడ్ న్యూస్‌లను పరిశీలిస్తుంది. ఈ కమిటీలు జిల్లా, రాష్టస్థ్రాయిలలో పనిచేస్తాయని చెప్పారు. జిల్లాలో అన్ని వార్తాపత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా, కేబుల్ ఛానల్స్, సినిమాహాల్స్, రేడియో ఎఫ్‌ఎం , ఎస్‌ఎంఎస్,సోషల్ మీడియా, వీడియో వేన్(ఆడియో విజువల్ డిస్‌ప్లే ఆఫ్ పొలిటికల్ ఆడ్వర్టైజ్‌మెంటు/కాంపెయిన్ మెటీరియల్ ఇన్‌పబ్లిక్ ప్లేస్) అన్నింటిని పరిశీలిస్తుందన్నారు. ప్రచురితమైన, ప్రసారం చేసిన అంశాల ఖర్చులను రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ లేదా డి ఏవిపి ధరలలో ఏదొక దానిని తీసుకుని అభ్యర్థి ఖర్చులలో జమ చేస్తారన్నారు. ఇటువంటి పరిణామాలకు గురికాకుండా ముందుగానే ప్రకటనలకు అనుమతులు పొందాలన్నారు. అనుమతులను పొందడానికి కింద తెలిసిన విషయాలను పాటించాలన్నారు. నమోదిత జాతీయ, రాష్ట్ర రాజకీయపార్టా తరఫున పోటీచేసే అభ్యర్థి ప్రకటన ప్రసారాలు ప్రారంభించడానికి ప్రతిపాధించిన తేదీకి మూడు రోజులు ముందుగా ఎన్నికల సంఘానికి/ డిజిగ్నేటెడ్ అధికారికి నిర్ణీత దరఖాస్తును సమర్పించాలి. నమోదుకాని రాజకీపార్టీ లేదా స్వతంత్ర అభ్యర్థి ప్రసారం చేయడానికి ముందు ఏడు రోజులు ముందుగా దరఖాస్తు చేయాలి. దరఖాస్తుతోపాటు దాని అటెస్టెట్ స్క్రిప్ట్‌తో ఎలక్ట్రానిక్ ఫారంలో ప్రతిపాదించిన ప్రకటన రెండు కాఫీలు జతపరచాలి. ప్రకటన నిర్మాణ ఖర్చు, బ్రేక్‌అప్‌ల వివరాలు, ప్రతి బ్రేక్ అప్‌కు ప్రతిపాదించిన రేటు, ఎలక్ట్రానిక్ మీడియా, కేబుల్ నెట్‌వర్క్‌లో ప్రకటన ప్రసారానికి అయ్యే మొత్తం ఖర్చు, పార్టీ/అభ్యర్థి ఎన్నికల లబ్దికోసం ప్రకటన ఉంటే స్టేట్‌మెంట్, రాజకీయ పార్టీ లేదా అభ్యర్థి కాకుండా ఏ వ్యక్తి ప్రకటన జారీచేస్తే, ఆ వ్యక్తి రాజకీయ పార్టీ లేదా అభ్యర్థి లబ్ధికోసం కాదని, సదరు ప్రకటనను ఏ రాజకీయ పార్టీచే లేదా అభ్యర్థిచే స్పాన్సర్ చేయబడితే అందుకు సంబంధించిన లేదా వినియోగించకపోతే లేదా చెల్లించకపోతే అందుకు సంబంధించిన ప్రమాణ పత్రం సమర్పించాలి. అన్ని చెల్లింపులు చెక్ లేదా డిమాండ్ డ్రాప్ట్ రూపంలో జరిగిందని స్టేట్‌మెంట్ సమర్పించాలి. ఈ అంశాలను మీడియా సర్ట్ఫికేషన్, మోనిటరింగ్ కమిటీ(ఎంసిఎంసి) పరిశీలిస్తుందన్నారు. జిల్లా ఎన్నికల అధికారి నేతృత్వంలో కమిటీ పనిచేస్తుందన్నారు.