శ్రీకాకుళం

స్టేడియం నిర్మాణంలో నిర్లక్ష్యం ఎందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, మార్చి 27: మూడేళ్ళల్లో రూ. 500 కోట్లు, కనీసం రూ. 300 కోట్లు విడుదల చేసినట్టు ఎక్కడైనా ఆనవాళ్ళు జిల్లాలో ఉన్నాయా? రుణాలు చేస్తే అవి భావితరాలకు అప్పులుగానే మిగులుతున్న నేపథ్యంలో ఆ రుణాలు శ్రీకాకుళం జిల్లాకు సర్దుబాటు చేయడంలో ముఖ్యమంత్రి ఎందుకు వివక్ష చూపుతున్నారు. కేవలం రూ. 15 కోట్లతో స్టేడియం నిర్మాణానికి తొమ్మినెలలు నిరీక్షణ ఎందుకు? అసలు అడ్మినిస్ట్రేషన్ అనుమతులే లేకుండా సిఎంచే శంకుస్థాపన చేయించరాదన్న విషయం జిల్లా మంత్రి, నేతలకు తెలియదా?అంటూ వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు కార్పొరేషన్‌లో రాజకీయ ‘క్రీడ’ను సోమవారం ఇక్కడ కోడిరామ్మూర్తి స్టేడియం నుంచి ఆరంభించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి నగర ప్రజలను, క్రీడాకారులను మోసం చేశారని ఆరోపించారు. వారం రోజుల క్రితం కలెక్టర్ పరిపాలనపరమైన అనుమతులకు ఉత్తర్వులు విడుదలైందని బోర్డు పెట్టించారు. తాను ధర్నాకు దిగితే ముందు రోజుల్లో ఆ అనుమతులు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గ్యాలరీని కూల్చేసి క్రీడాకారులకు, ప్రజలను మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వం ఏర్పాటుచేసి మూడేళ్లు గడుస్తున్నా ఎటువంటి అభివృద్ధి చేశారని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన తరువాత కర్నూలు, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి చేయగా ఆ ప్రాంతీయులకు వాటిపై కన్నుపడి తెలంగాణా కావాలని తద్వారా ప్రజలు బాగుపడతారని ఏ.పి. నుంచి విడిపోయారన్నారు. నేడు ఆంధ్రప్రదేశ్ మొదటికొచ్చిందని, మళ్లీ రాష్ట్రం అభివృద్ధి మొదటికొచ్చిందన్నారు. జిల్లా అన్ని విధాల వెనుకబడి ఉందని నాటి కృష్ణా కమిషన్, శివరామకృష్ణన్ కమిషన్ పేర్కొన్నాయన్నారు. రాష్ట్రం విడిపోయిన తరువాత 12 పెద్ద సంస్థలు నిర్మించాల్సి ఉండగా, వెనుకబడిన జిల్లాయైన శ్రీకాకుళం జిల్లాకు ఒక్క కంపెనీ కూడా ఇవ్వాలని అనిపించలేదా?అని ప్రభుత్వానికి గుర్తు చేశారు. 70 సంవత్సరాల్లో ఆస్తితోపాటు హక్కును ఆంధ్రప్రదేశ్‌కు 97వేల కోట్ల రూపాయలు, తెలంగాణాకు రూ.70వేల కోట్లు సర్దడం జరిగిందన్నారు. రాష్ట్రం అభివృద్ధి కోసం రూ.1.18లక్షల కోట్లు రుణాలు అప్పుతెచ్చి జిల్లాకు ఒక్క పైసా సర్దుబాటు చేయకపోవడం శోచనీయమన్నారు. ప్రాంతాలు విడిపోతున్నా తెచ్చిన రుణాలు అన్ని జిల్లాలకు సర్దకపోవడం పట్ల ధర్మాన తీవ్రంగా విమర్శించారు. స్థానిక కార్మిక శాఖామంత్రి కింజారాపు అచ్చెన్నాయుడు అసెంబ్లీలో సంస్కార హీనంగా మాట్లాడితే ముఖ్యమంత్రి చంద్రబాబు భుజం తట్టారని, ఇదేం సంస్కారమని ప్రశ్నించారు. పక్కరాష్ట్రాలైన ఒడిశా, మహారాష్ణ్ర, కర్ణాటక తదితర ప్రాంతాలు అన్ని జిల్లాలను అభివృద్ధి చేశాయని గుర్తు చేశారు. జిల్లా కేంద్రంలో కొత్త ఆడిటోరియం నిర్మాణానికి రూ.8కోట్లు మంజూరు చేస్తే దాని అతీగతి లేదన్నారు. అలాగే టిటిడి కళ్యాణ మండపం టెండర్లు పిలిచేదెప్పుడని నిలదీశారు. స్టేడియం నిర్మాణం చేస్తామని బోర్డును ఏర్పాటుచేస్తే నమ్మాలా అని వ్యాఖ్యానించారు. స్టేడియం నిర్మాణం కోసం టెండర్లకే మూడేళ్లు పడితే ఎప్పుడు పని పూర్తిచేస్తారని ఆయన ప్రశ్నించారు. తమ ప్రభుత్వ హయాంలో జిల్లా అభివృద్ధికి సమగ్ర కలెక్టరేట్, యూనివర్శిటీ, రిమ్స్, రోడ్ల అభివృద్ధి చేపట్టామన్నారు. కడపలో ప్రతీ ఎంపిటిసికి వెలకట్టి కొనుగోలు చేసి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందడం గొప్పవిషయమా..అంటూ ధర్మాన ప్రశ్నించారు. తొలుత పార్టీ నాయకులు, క్రీడాకారులు అభిమానులతో డే అండ్ నైట్ జంక్షన్ నుండి అంబేద్కర్ ఆడిటోరియం వరకు ఆర్ట్స్ కళాశాల రోడ్డు మీదుగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్, వైకాపా జిల్లా అధ్యక్షురాలు రెడ్డిశాంతి, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ ఎం.వి పద్మావతి, అందవరపు సూరిబాబు, రఫీ, బలగ పండరీనాద్, మధుబాబు, గుమ్మా నగేష్, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

కొవ్వాడ అణువిద్యుత్‌కు
రైతులు భూములివ్వద్దు
* సిటు రాష్ట్ర అధ్యక్షుడు నర్సింగరావు
శ్రీకాకుళం(రూరల్), మార్చి 27: కేంద్ర ప్రభుత్వం వెస్టింగ్ హౌస్‌కంపెనీ కొవ్వాడ అణువిద్యుత్ రియాక్టర్లను నిర్మించాలని నిర్ణయించిందని, దీనికి రైతులు భూములు ఇవ్వవద్దని సిటు రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్.నర్సింగరావు పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక ఎన్జీవో హోమ్‌లో విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వెస్టింగ్ హౌస్‌కు ఆర్థిక సహాయాన్ని అందించే తోషిబా కార్పొరేషన్ అణురంగం నుంచి పూర్తిగా తప్పుకుందని, దీంతో వెస్టింగ్ హౌస్ సంక్షోభంలో పడిందని, దాని పర్యవసానంగా కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం ఆగిపోవడం అనివార్యమన్నారు. అణువిద్యుత్ రంగంలో వెస్టింగ్ హౌస్ నిర్మిస్తున్న ఏ.పి తౌజండ్ రియాక్టర్ల ఉత్పత్తి వ్యయం బాగా పెరిగిపోవడం, డిజైన్‌లలో లోపాలు, అణువిద్యుత్ లాభసాటి కాదని నిర్ణయించిందన్నారు. ప్రపంచంలో గత 15 సంవత్సరాల నుండి నిర్మాణంలో ఉన్న 8 అణురియాక్టర్ల పరిస్థితి సంక్షోభంలో పడిందన్నారు. ఇప్పటికీ నిర్మాణం ప్రారంభించిన కొవ్వాడ అణువిద్యుత్ ప్లాంట్ అవకాశాలు అడుగంటాయన్నారు. అణువిద్యుత్ వ్యయం ఒక మెగావాట్‌కు రూ.70కోట్లకు పైగా పెరిగిందని, దీంతో కొవ్వాడలో తలపెట్టిన 6వేల మెగావాట్ల అణువిద్యుత్‌కు రూ.4.20వేలకోట్లు వ్యయం అవుతుందని తెలిపారు. జపాన్‌లో ప్రమాదం జరిగిన తరువాత లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా నేటికీ ప్రమాదం నుంచి బయటపడలేదన్నారు. రైతులు తమ భూమిలిచ్చి మోసపోవద్దని మత్స్యకారులను కోరారు. విలేఖర్లసమావేశంలో సిటు ప్రధాన కార్యదర్శి గోవిందరావు, జిల్లా కార్యదర్శి తేజేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షుడు అమ్మన్నాయుడు, రణస్థలం డివిజన్ అధ్యక్షుడు రమణ, కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి వెలమల రమణ పాల్గొన్నారు.

పల్స్‌పోలియోపై ప్రచారం చేయండి
* జెసి -2 రజనీకాంతారావు
శ్రీకాకుళం(రూరల్), మార్చి 27: పల్స్‌పోలియో ఏప్రిల్ 2వతేదీన ఉందని, దీనిపై వైద్యాధికారులు విస్తృత ప్రచారం నిర్వహించాలని జెసి -2 పి.రజనీకాంతారావు సూచించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశమందిరంలో సోమవారం జిల్లా అధికారులతో టాస్క్ఫోర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పల్స్‌పోలియోపై చర్చించారు. ఏప్రిల్ 2 వతేదీ ఉదయం 7నుండి సాయంత్రం 6గంటల వరకు ఐదేళ్లలోపు చిన్నారులకు రెండు చుక్కల పోలియో వ్యాక్సిన్‌ను కేంద్రాల వారీగా అందించేందుకు బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకోసం జిల్లా అధికారులు సహాయ సహకారాలు అందించి శతశాతం లక్ష్యం చేరేందుకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఇఓ బగాది జగన్నాధరావు, డి ఆర్‌డిఏ పిడి కిషోర్‌కుమార్, ఐసిడిఎస్ పిడి లీలావతి, మున్సిపల్ హెల్త్ అఫీసర్ ధవళ భాస్కరరావు, ఆర్‌బిఎస్‌కె జిల్లా సమన్వయ అధికారి డాక్టర్ మెండ ప్రవీణ్, జెడ్పి సిఇఓ నగేష్, సెట్‌శ్రీ సిఇఓ మూర్తి , సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు, డిఇవో, ఏపి ఇపిడి డిసిఎల్ అధికారులు పాల్గొన్నారు. మధ్యాహ్నం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయ సమావేశ మందిరంలో డిఎంఅండ్ హెచ్‌ఓ అధ్యక్షతన పల్స్‌పోలియోపై వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పల్స్‌పోలియో పై చర్చించారు. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి వై.వెంకటేశ్వరరావు, క్షయనివారణాధికారి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

ఎస్పీ గ్రీవెన్స్‌కు 16 వినతులు
శ్రీకాకుళం(రూరల్), మార్చి 27: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌కు 16 వినతులు వచ్చాయి. ఎస్పీ జె.బ్రహ్మారెడ్డి వినతులు స్వీకరించారు. వచ్చిన వినతుల్లో సివిల్ తగాదాలకు చెందినవి 6, పాత కేసులకు చెందినవి 3, ఇతర కారణాలకు చెందినవి 6వచ్చాయి. వీటి పరిష్కారం కోసం డిఎస్పీలు, సిఐలకు సూచనలు జారీ చేశారు. అలాగే ఉమెన్ పిఎస్ ఎస్‌ఐ వి.వాణిశ్రీ ఆధ్వర్యంలో ఫ్యామిలీ కౌనె్సలింగ్‌నిర్వహించారు. దీనికి 16 అర్జీలు రాగా, అందులో 10 అర్జీలకు రాజీ కుదిర్చారు. మిగిలిన ఆరు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎస్ ఐ రాజేశ్వరరావు, విజయకుమారి, కె.నిర్మల, న్యాయవాది వరప్రసాదరావు, సిటిజన్‌ఫోరం అధ్యక్షుడు బరాటం కామేశ్వరరావు పాల్గొన్నారు.

బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు
హిరమండలం, మార్చి 27: మండలంలోని ధనుపురం గ్రామంలో బాల్య వివాహాన్ని సోమవారం అధికారులు అడ్డుకున్నారు. గ్రామంలోని గొడబ అప్పలస్వామి, ముద్దుమ్మ దంపతుల కుమార్తె వివాహాన్ని ఏప్రిల్ 12వతేదీన చేయడానికి నిర్ణయించారు. ఈమె తంప హైస్కూల్‌లో పదో తరగతి చదువుతుంది. 18 ఏళ్లు వయస్సు నిండకపోవడంతో 1098 చైల్డ్‌లైన్‌కు సమాచారం అందించారు. వీరితోపాటు చైల్డ్‌లైన్, బ్రెడ్స్ స్వచ్చంద సంస్థకు, ఐసిడిఎస్, పోలీస్ అధికారులకు సమాచారం అందడంతో తల్లిదండ్రులకు కౌనె్సలింగ్ నిర్వహించారు. ఆర్‌ఐ నీలిమ, ఐసిడిఎస్ సూపర్‌వైజర్ వరహాలమ్మ, చైల్డ్‌లైన్ కో- ఆర్డినేటర్ జగన్నాథం బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, వివాహాన్ని నిలుపుదల చేయాలని బాలిక తల్లిదండ్రులకు కౌనె్సలింగ్ ఇచ్చారు.