శ్రీకాకుళం

జలమే జీవనాధారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లావేరు, మార్చి 28: జలం జగతికి జీవనాధారమని జల సంరక్షణపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీకృసింహం పిలుపునిచ్చారు. మంగళవారం లావేరులో రెండవ రోజు కేంద్రియ జలబోర్డు శిక్షణా శిబిరాన్ని ఆయన సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ భూగర్భజలాల అభివృద్ధికి ప్రతీ ఒక్కరూ బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని కోరారు. భవిష్యత్ తరాలకు జలాలను అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. వాటర్‌షెడ్, చెక్‌డామ్‌ల నిర్మాణం, ఇంకుడుగుంతలు తవ్వకం, పంట సంజీవినిలతో నీటి సంరక్షణ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. యంత్రాలతో విచక్షణారహితంగా బోర్లు తవ్వకంతో నీటి దుర్వినియోగం అవుతుందన్నారు. భూగర్భజలమట్టంపూర్తిగా క్షీణించిందన్నారు. జిల్లాలో 29శాతం వర్షపాతం నమోదైనప్పటికీ సాగునీటి సద్వినియోగం ద్వారా అధికంగా వరి దిగుబడి సాధించడం అభినందనీయమని రైతులను ప్రశంసించారు. మరుగుదొడ్ల నిర్మాణంలో రాష్ట్రంలో జిల్లా వెనుకబడి ఉందని, ఈ అంశంపై ప్రజలను చైతన్యం చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై, అధికారులపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రియ భూగర్భజలబోర్డు శాస్తవ్రేత్త భాస్కరరావు మాట్లాడుతూ ఈ తరహా శిక్షణా శిబిరాల ద్వారా ప్రజలలో అవగాహన పెంపొందిస్తున్నామన్నరు. జల వినియోగంపై ప్రతిఒక్కరికీ అర్థమయ్యేలా శిక్షణ, బ్రోచర్లు, కరపత్రాలు ప్రచార కార్యక్రమాల ద్వారా చైతన్యం పరుస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ తోటన్నదొర, మండల పరిషత్ ప్రత్యేక సలహాదారుడు ముప్పిడి సురేష్, జెడ్పీటిసి ప్రతినిధి పిన్నింటి మధుబాబు, ఎంపిడివో కిరణ్‌కుమార్, తహశీల్దార్ వెంకటరావు, ఉపాధి ఏపిఓ శ్రీనివాసులనాయుడు, ఆర్‌డబ్ల్యూ ఎస్‌జెఇ రామారావు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఆక్రమణలపై ఉక్కుపాదం ఖాయం
* తహశీల్దార్ రామారావు
నరసన్నపేట, మార్చి 28: నరసన్నపేటలో ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటున్న సంఘటనలు నానాటికీ పెరిగిపోతుండటంతో వాటిని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తహశీల్దార్ జల్లేపల్లి రామారావు తెలిపారు. మంగళవారం జమ్ము-తామరాపల్లి పంచాయతీల మధ్య ఉన్న చెరువులో ఆక్రమణలను నరసన్నపేటలోని శ్రీరామనగర్ వద్ద ఆక్రమణలను ఆయన గుర్తించారు. అక్రమార్కులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. అలాగే చెరువు గట్టులపై కూడా అక్రమంగా నిర్మాణాలు చోటుచేసుకుంటున్నాయని, వాటిపై కూడా దృష్టి సారిస్తామని అన్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వ భూముల పరిరక్షణకు రూ.90లక్షలతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసేందుకు ప్రభుత్వానికి నివేదికలు పంపించామని ఆయన తెలిపారు. ఆర్‌ఐలు కోటేశ్వరరావు, వెంకునాయుడు, విఆర్‌ఓలు చక్రధర్, విశే్వశ్వరరావు, శ్రీనివాస్ పాల్గొన్నారు.

తమ్ముడి మృతి.. అక్కకు తప్పని పరీక్ష
నరసన్నపేట, మార్చి 28: తమ్ముడు మృతి చెందినప్పటికీ అక్కకు పదవ తరగతి పరీక్షల్లో తప్పని పరీక్ష అయింది. మండలంలోని బొరిగివలస గ్రామానికి చెందిన మెండ మోహినీకుమారి నరసన్నపేటలో పదవ తరగతి పరీక్షలు రాస్తుంది. ఆమె తమ్ముడు మెండ రోహిత్ అనారోగ్యం తో సోమవారం రాత్రి 10:30గంటలకు మృతి చెందాడు. మంగళవారం ఉదయం అంత్యక్రియలు అనంతరం తప్పనిసరి పరిస్థితుల్లో మొక్కవోని దీక్షతో మంగళవారం సాంఘిక శాస్త్రం పరీక్షకు హాజరుకావడం కనిపించింది. మృతి చెందిన రోహిత్ బొరిగివలస పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. వీరి తల్లిదండ్రులు మెండ ప్రకాశరావు, చిన్నమ్మడు, చిన్నతనంలోనే చనిపోవడంతో పెద్దనాన్న మెండ శాంతారావు ఇంటివద్ద పెరుగుతున్నారు. ఒకపక్క తల్లిదండ్రులను పోగొట్టుకుని, తోబుట్టువు తమ్ముడుని కూడా పోగొట్టుకున్న విషాదం చిన్నారి మోహినికుమారికి ఎదురైంది. అయినా ఎలాగైన పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలన్న దిశగా ఆమె పరీక్షల్లో పాల్గొనడం తోటి విద్యార్థులకు, అధ్యాపకులకు కంటతడి పెట్టించింది.