శ్రీకాకుళం

ఎయిడ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రణాళికలు తయారు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, మార్చి 28: ఎయిడ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రణాళికలు తయారుచేయాలని కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం వైద్యాధికారులకు ఆదేశించారు. మంగళవారం ఎయిడ్స్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ యూనిట్ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ వైద్యాధికారులు స్వచ్ఛంద సంస్థలు, హెచ్‌ఐవి వ్యాప్తికి గల కారణాలను అనే్వషించాలన్నారు. హెచ్‌ఐవి వ్యాధి టి.బి వ్యాధిగా మార్పు చెందకుండా నిరోధించడానికి అవసరమైన వైద్య సహాయం అందించాలన్నారు. ముఖ్యంగా భార్యాభర్తలు కౌమారదశలో మధ్యవయస్సులలో వారికి ఎవరి నుండి ఎవరికి వ్యాధి సోకుతున్నది, వ్యాధి సోకడానికి మూలాలను అనే్వషించాలన్నారు. అదేవిధంగా కొత్త హెచ్‌ఐవి కేసులు నమోదు సున్నా స్థానానికి చేరుకునేందుకు కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలన్నారు. హెచ్‌ఐవి ఎయిడ్స్ కింద మార్పు చెందకుండా ఉండేందుకు హెచ్‌ఐవి వ్యాధిగ్రస్తులు తీసుకోవాల్సిన చర్యలపై వారికి అవగాహన కల్పించాలన్నారు. ప్రజలకు హెచ్‌ఐవి ఎయిడ్స్‌పై చైతన్యం కలిగించాలన్నారు. స్వచ్ఛంద రక్తదానాలను ప్రోత్సాహించాలని హెచ్‌ఐవి వ్యాధిగ్రస్తుల పట్ల ప్రజల్లో సానుభూతి, సహాయాలను కలిగించడానికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలన్నారు. వీరికి పింఛన్లు అందించడం, హెచ్‌ఐవి వ్యాధి సోకిన పిల్లలను ఐసిడిఎస్ ద్వారా డబుల్ రేషన్ అందించే చర్యలపై చర్చించారు. కరపత్రాలు, పోస్టర్లు, బేనర్లు, ర్యాలీలు సమావేశాలు, ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాల నిర్వహణ, స్వతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ దినోత్సవాల్లో ఎయిడ్స్ వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ట్రక్ డ్రైవర్లు, క్లీనర్లు, సెక్స్‌వర్కర్లకు కండోమ్స్ పంపిణీ ద్వారా ఎయిడ్స్ వ్యాధి సోకకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. స్వచ్ఛంద సంస్థలు వైద్య ఆరోగ్య శాఖాధికారులు, ఐ సిడిఎస్ అధికారులు, డిఆర్‌డిఏ అధికారులు సంయుక్తంగా ఎయిడ్స్ రహిత నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఈసమావేశానికి జిల్లా ఎయిడ్స్ అండ్ లెప్పర్సీ నివారణాధికారి రత్నకుమారి, డాక్టర్ మెండ ప్రవీణ్, డాక్టర్ ధవళ భాస్కరరావు, డిసిహెచ్ ఎస్.సూర్యారావు, ఐ సిడిఎస్ పిడి లీలావతి, డిఆర్‌డిఏ పిడి జి.కిషోర్‌కుమార్, నగరపాలక సంస్థ కమీషనర్ పిఏ శోభ, రిమ్స్ బ్లడ్ బ్యాంకు మెడికల్ అధికారి పాపరత్నం, డిసిపిఓ రమణ, విశ్రాంత న్యాయమూర్తి జగన్నాథరావు, బెజ్జిపురం యూత్‌క్లబ్ ప్రెసిడెంట్ ప్రసాదరావు పాల్గొన్నారు.